APPSC Post-wise Vacancies: ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వారీగా ఉన్న ఖాళీలు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వారీగా (APPSC Post-wise Vacancies) ఉన్న ఖాళీల వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పోస్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ పోస్ట్ వైజ్ ఖాళీలు (APPSC Post-wise Vacancies): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023న ఉత్తర్వులు జారీ చేసినది. ఈ ఉత్తర్వుల ప్రకారం APPSC గ్రూప్ 1లో 89 పోస్టులకు, గ్రూప్ 2లో 508 పోస్టుల (APPSC Post-wise Vacancies) భర్తీ చేయనున్నారు. ఈ గ్రూప్ 1 , గ్రూప్ 2 పరీక్షలను APPSC నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఇది కూడా చదవండి: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?
APPSC గ్రూప్ 1, 2 హైలెట్స్ (APPSC Group 1, 2 2023 Exam-Highlights)
APPSC గ్రూప్ 1, 2 రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా 597 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. APPSC గ్రూప్ పరీక్షలకు సంబంధించిన 2023 వివరాలు దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది.కండక్టింగ్ అథారిటీ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
ఎగ్జామ్ పేరు | APPSC గ్రూప్ 1, 2 ఎగ్జామ్ |
ఎగ్జామ్ లెవల్ | రాష్ట్రస్థాయి (ఆంధ్రప్రదేశ్) |
ఖాళీలు | గ్రూప్ 1-89, గ్రూప్ -2 - 508 (అంచనా) |
ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
కేటగిరి | ప్రభుత్వ ఉద్యోగాలు |
ఎగ్జామ్ స్టేజ్‌లు | మూడు (ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్) |
భాషలు | ఇంగ్లీష్, తెలుగు |
జాబ్ లోకేషన్ | ఆంధ్రప్రదేశ్ |
అధికారిక వెబ్‌సైట్ | https://psc.ap.gov.in |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఖాళీల వివరాలు 2023 (APPSC Group 2 Vacancy 2023)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల వివరాలను అంచనాగా ఈ దిగువున టేబుల్లో అందజేశాం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.డిపార్ట్‌మెంట్ పేరు | హెచ్‌వోడీ | పోస్టుల పేరు | సంఖ్య |
ఫైనాన్స్ | సెక్రటేరియట్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 23 |
జనరల్ అడ్మినిస్ట్రేషన్ | సెక్రటేరియట్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) | 161 |
లా | సెక్రటేరియట్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) | 12 |
లెజిస్లేటర్ సెక్రటేరియట్ | సెక్రటేరియట్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేటర్) | 10 |
ఎంఏ, యూడీ | కమిషనర్, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరక్టర్ | మున్సిపల్ కమిషన్ (జీఆర్ 111) | 04 |
రెవెన్యూ | ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ | డిప్యూటీ తహసీల్దార్ (జీఆర్ 11) సబ్ రిజిస్ట్రార్ జీ II ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ | 114 16 16 |
ఎల్ఎఫ్‌బీ, ఐఎంఎస్ | ఎల్ఎఫ్‌బీ అండ్ ఐఎమ్ ఎస్ లేబర్ కమిషనర్ | అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ | 18 |
మొత్తం ఖాళీలు | 508 |
APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 పోస్టుల వారీగా ఖాళీలు (APPSC Group 1 Vacancies 2023 Posts Wise Vacancies)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 89 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన వివరాలను అంచనా ఈ దిగువ పట్టికలో అందజేయడం జరిగింది.
క్రమ సంఖ్య | శాఖ | పోస్ట్ | ఖాళీల సంఖ్య |
1 | A & C | కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ | 05 |
2 | బీసీ సంక్షేమం | జిల్లా A.P. B. C లో B.C. సంక్షేమ అధికారి | 01 |
3 | ఎడీ అండ్ టీ | జిల్లా ఉపాధి అధికారి | 04 |
4 | ఆర్థిక శాఖ | A.P స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసి. ట్రెజరీ అధికారి/అసిస్ట్. A.P. ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అకౌంట్స్ ఆఫీసర్ | 02 06 |
5 | హోమ్ | ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సప్‌డిట్ ఆఫ్ పోలీస్ (సివిల్) క్యాట్-2 ఏపీ జైల్ సర్వీస్‌లో డిప్యూటీ సూప్డ్ ఆఫ్ జైల్స్ (MEN) రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల్లో డివిజనల్/జిల్లా అగ్నిమాపక అధికారులు | 25 01 01 |
6 | ఎంఏ, యూడీ | A.P. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II | 01 |
7 | రెవెన్యూ | డిప్యూటీ కలెక్టర్లు డిప్యూటీ రిజిస్ట్రార్ ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్‌లో స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 12 03 18 01 |
8 | సోషల్ వెల్ఫేర్ | జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి | 03 |
9 | టీఆర్ అండ్ బీ | ప్రాంతీయ రవాణ అధికారి | 06 |
ఏపీపీఎస్సీ గ్రూప్ పోస్టులకు సెలక్షన్ విధానం (APPSC Group Selection Process 2023)
ఏపీపీఎస్సీ గ్రూప్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది.
- ప్రిలిమినరీ ఎగ్జామ్
- మెయిన్స్ ఎగ్జామ్
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి దశలు (Steps to Apply for APPSC Group 2 Recruitment 2023)
- APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
- ముందుగా అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను https://psc.ap.gov.inని సందర్శించాలి.
- హోంపేజీలో “డైరెక్ట్ రిక్రూట్‌మెంట్” “కొత్త నోటిఫికేషన్” లింక్‌పై క్లిక్ చేయాలి.
- "కొత్త రిజిస్ట్రేషన్"పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఇచ్చి పూరించాలి.
- రిజిస్ట్రేషన్ పేజీలోని వివరాలలో ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీలని ఇచ్చిన ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, విద్యార్హత వివరాలు మొదలైనవి ఉంటాయి.
- పేర్కొన్న ఫార్మాట్‌లో ఫోటోగ్రాఫ్ (JPG/JPEG ఫార్మాట్, 50 kb, 3.5 cm x 4.5 cm) మరియు సంతకాన్ని (JPG/JPEG ఫార్మాట్, 30 kb, 3.5 cm x 1.5 cm) అప్‌లోడ్ చేయాలి.
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టెప్ 2 (Step 2- Submit Application Form)
- అభ్యర్థి క్రియేట్ చేసిన ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి
- తర్వాత అభ్యర్థి అప్లికేషన్ Submitపై క్లిక్ చేసి, అధికారిక ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి మిగిలిన వివరాలను జాగ్రత్తగా పూరించాలి.
- దీని తర్వాత అభ్యర్థి అవసరమైన దరఖాస్తు ఫీజును చెల్లించాలి. నిర్ధారణ తర్వాత సమర్పించుపై క్లిక్ చేయాలి.
- APPSC గ్రూప్ 2 దరఖాస్తు ఫార్మ్ విజయవంతంగా సబ్మిట్ చేసి భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ సమాచారం గురించి మరిన్ని అప్‌డేట్స్ గురించి College Dekhoని ఫాలో అవ్వండి.