జిల్లాల వారీగా APRJC కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024 )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APRJC కళాశాలల జాబితా, సీట్ల సంఖ్య మరియు అందించే కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
జిల్లా ప్రకారంగా APRJC కళాశాలల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024) : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ CET 2024 పరీక్ష 25, ఏప్రిల్ 2024 తేదీన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, వసతి ఉచితంగా అందిస్తుంది. కాబట్టి ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (APREI) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. APRJC కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు MPC, BiPC, MEC, CEC, EET, CGT గ్రూప్ లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల ప్రకారంగా ఉన్న కళాశాలలు , అందించే కోర్సుల జాబితా మరియు సీట్ల సంఖ్య ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ - APRJC ఫలితాల డైరెక్ట్ లింక్
APRJC 2024 కళాశాలల జాబితా ( List of APRJC Colleges 2024)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 APRJC కళాశాలలు ఉన్నాయి, వాటి జాబితా క్రింద ఉన్న పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
క్రమ సంఖ్య | కళాశాల పేరు | ప్రదేశం | అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా ) |
---|---|---|---|
1 | APRJC బాలికల కళాశాల | శృంగవరపు కోట | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
2 | APRJC కళాశాల ( కో - ఎడ్యుకేషన్ ) | నిమ్మకూరు | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఒకేషనల్ కోర్సులకు : అన్ని జిల్లాలకు |
3 | APRJC బాలుర కళాశాల | నాగార్జున సాగర్ | అన్ని జిల్లాలకు |
4 | APRJC బాలుర కళాశాల | వేంకటగిరి | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
5 | APRJC బాలుర కళాశాల | గ్యారంపల్లి | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
6 | APRJC బాలుర కళాశాల | కొడిగెనహళ్లి | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
7 | APRJC బాలికల కళాశాల | బనవాసి, ఎమ్మిగనూరు | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
8 | APRJC బాలుర కళాశాల ( మైనారిటీ ) | గుంటూరు | శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ఠీఆర్ , గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
9 | APRJC బాలుర కళాశాల (మైనారిటీ ) | కర్నూలు | తిరుపతి, చిత్తూరు , అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం , వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూల్ |
10 | APRJC బాలికల కళాశాల ( మైనారిటీ) | వాయలపాడు | అన్ని జిల్లాలు |
APRJC కళాశాలల సీట్ల సంఖ్య గ్రూప్ ప్రకారంగా ( Number of Seats in APRJC Colleges - Group Wise)
APRJC కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్యను గ్రూప్ ప్రకారంగా తెలుసుకోవడానికి క్రింది టేబుల్ పరిశీలించవచ్చు.MPC | BiPC | MEC | CEC | EET | CGT | |
---|---|---|---|---|---|---|
APRJC కళాశాల, శృంగవరపు కోట | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, నిమ్మకూరు | 50 | 30 | 25 | 30 | 30 | 30 |
APRJC కళాశాల, నాగార్జున సాగర్ | 80 | 60 | 45 | 45 | 0 | 0 |
APRJC కళాశాల , వేంకటగిరి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, గ్యారంపల్లి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, కొడిగెనహళ్లి | 50 | 30 | 25 | 30 | 0 | 0 |
APRJC కళాశాల, బనవాసి | 60 | 40 | 30 | 0 | 0 | 0 |
APRJC కళాశాల, గుంటూరు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC కళాశాల, కర్నూలు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC కళాశాల, వాయలపాడు | 8 | 8 | 0 | 7 | 0 | 0 |
APRJC CET 2024 రిజర్వేషన్ పాలసీ ( APRJC CET 2024 Reservation Policy)
APRJC 2024 జనరల్ కళాశాలలకు ఉండే రిజర్వేషన్ పాలసీ క్రింది పట్టికలో గమనించవచ్చు.
కేటగిరీ | రిజర్వేషన్ శాతం |
---|---|
OC | 38% |
BC - A | 7% |
BC - B | 10% |
BC - C | 1% |
BC - D | 7% |
BC - E | 4% |
SC | 15% |
ST | 6% |
PHC | 3% |
స్పోర్ట్స్ | 3% |
CAP | 3% |
ఆనాధలు | 3% |
APRJC మైనారిటీ కళాశాలకు సంబంధించిన రిజర్వేషన్ పాలసీ ను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
కేటగిరీ | రిజర్వేషన్ శాతం |
---|---|
మైనారిటీ | 79% |
SC | 15% |
ST | 6% |
APRJC CET 2024 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.