Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

సంక్రాంతి రోజున ఇళ్లను తగులబెట్టే సంప్రదాయం ఎక్కడో తెలుసా? (Essay on Sankranti in Telugu)

తెలుగు రాష్ట్రాల్లో (Essay on Sankranti in Telugu) సంక్రాంతి శోభ నెలకొంది. ఇప్పటికే పల్లెల్లో, పట్టణాల్లో పండుగ సందడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలుగులో సంక్రాంతి వ్యాసం (Essay on Sankranti in Telugu): పండుగలన్నీ ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా హిందువులు పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పండుగల్లో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకున్నా తెలుగు రాష్ట్రాల్లో  (Essay on Sankranti in Telugu) ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది జనవరి నెలలో ఈ పండుగను నిర్వహించుకుంటారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తమ పంట చేతికి వచ్చిందనే సంతోషంతో  భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట సంబరాలు అంబరాన్ని తాకతాయి. ఇంట్లో కాలం చేసిన పెద్దవాళ్లకు కొత్త దుస్తులు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా  కొత్త దుస్తులతో, కొత్త వంటకాలతో, స్నేహితులు, బంధువులతో ప్రతి గడప కళకళలాడుతుంది. సంక్రాంతికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. 

భోగి (Bhogi 2024)

ఈ సంక్రాంతి రోజున సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశికి కదులుతాడు. మకర సంక్రమణము నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.  మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీల్లో వస్తుంది. దక్షిణాయానంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు వేడి సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేస్తారు. మంటల్లో పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా మూడు గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేస్తుంటారు. ఈ భోగి మంట చుట్టూ పెద్దలు, పిల్లలు కేరింతలు కొడతారు. 

ఈ భోగి పండుగనాడు కొత్త దుస్తులు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. 

మకర సంక్రాంతి (Makara Sankranti 2024)

సంక్రాంతి అంటే కొత్త క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ఈ సంక్రాంతి రోజున పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ల పూజలతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు కళకళాడుతుంది.  వాస్తవంగా సంక్రాంతి పండుగ భోగి మంటలతో ప్రారంభమవుతుంది.  హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, కోడ పందాలతో పల్లెలలన్నీ సందడి చేస్తాయి. ఈ సమయంలో రైతులకు కొత్త పంట చేతికందుతుంది. 

సంక్రాంతి పురాణ గాథ... 

మకర సంక్రాంతికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ వినికిడిలో ఉంది. ఈ మకర సంక్రాంతి రోజునే భగీరథుడనే ముని తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఆరోజునే గంగానది భూమిపైకి వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. కాబట్టి ఆ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుందని ప్రజల నమ్మకం. దీనికి సంకేతంగా కూడా చాలామంది సంక్రాంతిని పండుగను జరుపుకుంటారు.  

కనుమ (Kanuma 2024)

పెద్ద పండుగలో మూడో రోజున కనుమ  (Kanuma) పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మాంసాహారులకు చాలా ఇష్టమైనది. కనుమ అంటే అందరికీ గుర్తొచ్చేది గారెలు. తెలుగు రాష్ట్రాల్లో కనుమ పండుగరోజున తప్పకుండా గారెలను చేసుకుంటారు. "కనుమనాడు మినుముల తినాలి" అనే సామెత మన ఆచారాన్ని స్పష్టం చేస్తోంది.  గారెలు, మాంసంతో చేసిన వంటలతో కనుమ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. పితృదేవతలకి ఆరోజు ప్రసాదాలు పెట్టి మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేయడం మంచిది. ఆ రోజున గారెలు తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది.  మినుములు ఒంట్లో వేడిని కలిగిస్తాయి. చలికాలంలో మినుములు తినడం వల్ల, మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. 

రాష్ట్రాల్లో మకర సంక్రాంతి వేడుకలు (Celebrations of Makar Sankranti in States)

మకర సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తెలుగు రాష్ట్రాలతో దేశంలో మరికొన్ని చోట్ల కూడా జరుపుకుంటారు. దేశంలో పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఆ వివరాలను ఈ దిగువున అందజేశాం. 
  • ఢిల్లీ, హర్యాణాలో ఈ పండుగను సుకరత్ అంటారు.
  • పంజాబ్‌లో మకర సంక్రాంతికి ముందు రోజు సాయంత్రం లోహ్రీ అంటారు. ఈ పండుగను మాఘి అని కూడా అంటారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మకర సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు.
  • అసోంలో ఈ పండుగను భోగాలి బిహు అని పిలుస్తారు.
  • మహారాష్ట్రలో ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.
  • తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అంటారు.
  • గుజరాత్‌లో ఈ పండుగను ఉత్తరాయణం అంటారు.

వివిధ భారతీయ రాష్ట్రాల్లో మకర సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? (How is Makar Sankranti Celebrated in Different Indian States?)


భారతదేశంలో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉంది. చాలా రాష్ట్రాల్లో ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. వారి వారి నమ్మకాలకు అనుగుణంగా కొత్త దుస్తులు, వంటకాలు, ఆటలు, పాటలతో నిర్వహించుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో వారి వారి సంప్రదాయాల్లో పండుగను జరుపుకుని ఆనందపడుతుంటారు. ఏ రాష్ట్రంలో పండుగను ఎలా జరుపుకుంటారో ఇక్కడ తెలియజేశాం. 


ఒడిశాలో మకర సంక్రాంతి... 

ఒడిశాలో మకర సంక్రాంతి ప్రజలు చెరువులు లేదా పవిత్ర నదులలో స్నానం చేయడంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు కొత్తగా పండించిన బియ్యం, అరటి, కొబ్బరి, బెల్లం, నువ్వులు, కుడుబు మొదలైన వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒడిశాలోని మయూర్‌భంజ్, సుందర్‌ఘర్, కియోంజర్ జిల్లాల్లో 40 శాతం గిరిజనులు ఉన్నారు. వారికి ఈ మకర సంక్రాంతి చాలా ప్రత్యేకం. పండుగ సందర్భంగా అక్కడి ప్రజలు  వారం రోజుల పాటు పాటలు, నృత్యాలతో ఎంజాయ్ చేస్తారు. మకర సంక్రాంతి నాడు సాయంత్రం గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజు సూర్యుడు తన మార్గాన్ని మార్చుకోవడానికి సంకేతాంగా కోణార్క్ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. పశ్చిమ ఒడిశాలో ఈ పండుగను ఒక  ఆత్మీయునితో ఒకరి బంధాన్ని బలపరిచే రోజుగా భావిస్తారు. అందుకే ఆ వ్యక్తిని "మకర బసిబా" అని కూడా పిలుస్తారు.


గుజరాత్‌లో మకర సంక్రాంతి... 

గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణం అని పిలుస్తారు. ఇక్కడ పండుగ వేడుకల్లో గాలిపటాలు ఎగురవేయడం ఒక ముఖ్యమైన భాగం. లక్షలాది మంది గుజరాతీలు తమ బాల్కనీలు, టెర్రస్‌ల నుంచి ఆకాశాన్ని రంగులమయం చేసేందుకు గాలిపటాలు ఎగురవేస్తారు. రకరకాల వంటకాలు కూడా తయారు చేసి ఆనందిస్తారు. ఈ పండుగలో చిక్కి, ఉంధియు, జిలేబీ వంటి ప్రత్యేక వంటకాలు కూడా తయారుచేస్తారు.

ఇవి కూడా చదవండి...


తమిళనాడులో పొంగల్... 

మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ అంటారు. ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. తమిళనాడులో మకర సంక్రాంతి వేడుకలు చాలా ప్రత్యేకం. ఇక్కడ ఎప్పటి నుంచో పొంగల్ జరుపుకుంటారు. ఇక్కడ పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు విశాలమైన మైదానం లేదా ప్రాంగణంలో పొయ్యిని పెట్టి కుండలో పొంగలిని తయారు చేస్తారు. ఇది తమిళ మాసం మార్గజీ చివరి రోజు ప్రారంభం అవుతుంది.


అసోంలో సంక్రాంతి... 

అసోంలో సంక్రాంతి పండుగను మాగ్ బిహును అని లేదా భోగాలి బిహు అని కూడా పిలుస్తారు, ఇది అసోంలో ఇది పంట పండుగ. ఇది మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) పంట కాలం ముగుస్తుంది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ఉత్సవాలు, దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడి యువత బిహు సమయంలో వెదురు, ఆకులు, గడ్డితో మెజీ అనే ఇళ్లను నిర్మిస్తారు. మరుసటి రోజు ఆ గుడిసెలను తగులబెట్టి పండుగ ప్రత్యేక వంటకాలను ఆస్వాదిస్తారు. టేకేలి భోంగా (కుండ పగలగొట్టడం), గేదెల పోరు వంటి స్థానిక సంప్రదాయ కళలు కూడా పండుగలో భాగంగా ఉంటాయి. 


పంజాబ్‌లో...

పంజాబ్‌లో మకర సంక్రాంతిని లోహ్రీ అంటారు. ఇక్కడ ఈ పండుగను రంగుల నృత్యం, సంగీతం, భోగి మంటలతో జరుపుకుంటారు. ఇక్కడ పిల్లలు ఇంటింటికీ వెళ్లి దోపిడీ (పాప్‌కార్న్, వేరుశెనగ, బెల్లం మొదలైనవి) సేకరించి దుల్హబట్టి పాడతారు. సాయంత్రం ప్రతిచోటా దీపాలు వెలిగిస్తారు. దీపం చుట్టూ భాంగ్రా నాట్యం చేస్తారు.  


హిమాచల్ ప్రదేశ్... 

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మకర సంక్రాంతిని మాఘ సాజీ అంటారు.  ఇక్కడి ప్రజలకు ఇది మాఘమాసం ప్రారంభం. దీనిని మాఘ సాజి అని కూడా అంటారు. సంక్రాంతి రోజు తెల్లవారుజామునే లేచి చెరువులు, నదుల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడి ప్రజలు తమ పొరుగువారిని సందర్శించడం ద్వారా పండుగను జరుపుకుంటారు. ఆట, పాటలతో (జానపద నృత్యం) పండుగ ముగుస్తుంది.


ఉత్తరప్రదేశ్‌లో.. 

మకర సంక్రాంతిని ఉత్తరప్రదేశ్‌లో కీచేరి అంటారు. ఇది పవిత్ర స్నాన దినం. ఈ రోజున ఉత్తరప్రదేశ్ నుంచి ప్రజలు పవిత్ర స్నానానికి అలహాబాద్, వారణాసి, హరిద్వార్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. స్నానం చేసిన తర్వాత టిల్ లడ్డూ లేదా గుడ్ లడ్డూ తీసుకోవడం ఆనవాయితీ.


పశ్చిమ బెంగాల్...

పశ్చిమ బెంగాల్‌లో దీనిని పౌష్ సంక్రాంతి అంటారు. బెంగాల్‌లో ఈ పంట పండుగను పౌష్ పర్బన్‌గా జరుపుకుంటారు. 'ఖేజురేర్ గుర్', 'పాటాలి' రూపంలో 'పిటా' అని పిలువబడే వివిధ సాంప్రదాయ బెంగాలీ స్వీట్ల తయారీలో తాజాగా పండించిన బియ్యం, ఖర్జూర సిరప్‌ను ఉపయోగిస్తారు. ఇది బియ్యం పిండి, కొబ్బరి, పాలు, 'దానిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుంది. ఖేజురేర్ గుర్' (ఖర్జూరం బెల్లం). మూడు రోజుల పండుగ అయిన మకర సంక్రాంతికి ఇక్కడ లక్ష్మీ దేవిని జరుపుకుంటారు.


బీహార్, జార్ఖండ్.. 

బీహార్, జార్ఖండ్‌లలో కిచిడి పర్వ్ అంటారు. ఇక్కడ కూడా పప్పు, బియ్యం, కాలీఫ్లవర్, బఠానీలు, బంగాళాదుంపలతో చేసిన కిచిడి, చోఖా (కాల్చిన కూరగాయలు), అచర్ (ఊరగాయ), పప్పు, నెయ్యి లతో వంటకాలు చేస్తుంటారు. అదే విధంగా పవిత్ర స్నానం చేస్తారు.  భోగి మంటలు వేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తారు.  ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో, పప్పు, బియ్యం మిశ్రమం అయిన ఖిచడితో పండుగను జరుపుకుంటారు. 


మధ్యప్రదేశ్‌లో... 

మధ్యప్రదేశ్‌లో, వివాహిత మహిళలను హల్దీ-కుంకుమ్ కోసం ఇంటికి ఆహ్వానిస్తారు.స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మకర సంక్రాంతిని జరుపుకుంటారు.

కర్ణాటకలో సంక్రాంతి..

కర్ణాటకలో ఇది అతి పెద్ద పండుగ. అక్కడ కూడా ఇది రైతు పండగగానే జరుపుకుంటుంటారు. సంక్రాంతి పండుగ రోజున  నువ్వులు, బెల్లం పంచి అందరినీ పలకరిస్తారు. వారి ఆచారం ప్రకారం మహిళలు బగిన సమర్పిస్తారు. అదేవిధంగా గోవులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగిస్తారు. 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... 

తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను గొప్పగా చేసుకుంటారు. నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహించుకుంటారు.  భోగితో పండుగ సందడి మొదలవుతుంది. దట్టమైన పొగమంచులో, సూర్యుడు దోబుచూలాటలో తెల్ల తెల్లవారు జామున ప్రతి వీధిలో కలసికట్టుగా భోగిమంటలు వేసుకుంటారు. ఇళ్లలో పాత వస్తువులను, పాత సామాన్లను ఈ మంటల్లో దహనం చేయడం ఆచారంగా భావిస్తారు. కొత్త బట్టలతో సందడి చేస్తారు. తర్వాతి రోజు సంక్రాంతి ఆ రోజు ఇంట్లో పెద్దవాళ్లకు బట్టలు పెట్టి పూజలు చేస్తారు. అన్ని రకాల కూరగాయలతో దప్పలం అనే కూరను చేసుకుని ఆరగిస్తారు.ఇక కనుమ రోజు మాంసాహారం చేసుకుని భుజిస్తారు. ముక్కనుమ రోజున అందరూ సందడి ఆటలు, పాటలతో గడుపుతారు.  


గాలిపటాలు ఎగురవేయడం... 

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఆకాశంలో రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. పిల్లలు, పెద్దలు, మహిళలు కూడా ఇందులో పాల్గొంటారు. వివిధ ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేసే పోటీలను కూడా నిర్వహిస్తారు. చాలాచోట్ల కోళ్ల పందాలు కూడా జరుగుతాయి. 

తెలుగులో మరిన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

We want to join pr collage

-surya prakashUpdated on August 14, 2024 12:37 AM
  • 3 Answers
7386685546, Student / Alumni

రొంగల హేమశ్రీ Bc,D Ba అడ్మిషన్ కావాలి సార్

READ MORE...

I want to apply for admission in BA

-priyanjali debnathUpdated on August 13, 2024 04:19 PM
  • 2 Answers
harshit, Student / Alumni

రొంగల హేమశ్రీ Bc,D Ba అడ్మిషన్ కావాలి సార్

READ MORE...

Direct admisiom B.A first year me Ho skata hai

-Tanisk GuptaUpdated on August 23, 2024 11:01 AM
  • 2 Answers
harshit, Student / Alumni

రొంగల హేమశ్రీ Bc,D Ba అడ్మిషన్ కావాలి సార్

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Unlock Exclusive Insights to Empower Your Academic Journey

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Boost your preparation with extensive knowledge of syllabus & exam pattern.Access FREE, subject-wise sample papers & previous year question papers.Explore courses and careers that you can opt for after your exam result.With totally online Admission Process we help you get college admission without having to step out.
You have unlocked the pdf. download here
Error! Please Check Inputs