భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? (Indian Flag History in Telugu)
భారతీయ జెండా చరిత్రను, (Indian Flag History in Telugu) ప్రత్యేకతలను, జాతీయ పతాకానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను తెలుగులో ఇక్కడ అందించాం.
తెలుగులో భారతీయ జెండా చరిత్ర (Indian Flag History in Telugu) : బ్రిటీష్ వారి చెర నుంచి విముక్తి పొంది.. స్వేచ్ఛను సాధించిన రోజుకు గుర్తుగా ప్రతి ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. 1947, ఆగస్ట్ 14 అర్ధరాత్రిన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ సందర్భాన్ని, ఈ చరిత్రను ప్రతి భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్వేచ్ఛ కోసం ఎంతో మంది భారతీయ నాయకులు, నేతలు తమ ప్రాణాలను అర్పించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఆగస్ట్ 15న ప్రతి చోటా జెండా వందనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన దేశ ఖ్యాతీకి, స్వతంత్రానికి గుర్తుగా ప్రతి సంస్థలో జెండాను ఎగురవేయడం, సెల్యూట్ చేయడం, స్వీట్లు పంచుకుని పండుగలా జరుపుకుంటుంటాం.
ఇది కూడా చదవండి: భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి
ఈ సందర్భంగా ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా మన జెండాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకోవాలి. మన జాతీయ జెండా మూడు రంగులతో భారతీయతను చాటి చెబుతుంది. రెపరెపలాడుతూ మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఆ జెండాకు సంబంధించిన చరిత్రను.. కచ్చితంగా అందరం తెలుసుకోవాలి. జెండా తయారీ వెనుక, జెండాను తయారు చేయడంలో మన నాయకుల ఆలోచనలు, ఆ చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ అందించాం.
1921లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బెజవాడ సెషన్‌లో, పింగళి వెంకయ్య ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగులతో రూపొందించిన జెండాను రూపొందించారు. ఇది రెండు ప్రధాన వర్గాలైన హిందువులు, ముస్లింలను సూచిస్తుంది. భారతదేశంలోని మిగిలిన సమాజాలకు ప్రతీకగా తెల్లటి గీతను జోడించాలని, దేశ అభివృద్ధిని సూచించడానికి స్పిన్నింగ్ వీల్‌ను జోడించాలని గాంధీ సిఫార్సు చేశారు. అదేవిధంగా 1931లో త్రివర్ణ పతాకాన్ని మన జాతీయ జెండాగా అంగీకరిస్తూ తీర్మానించారు. ఈ జెండాలో మూడు రంగులైనా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉంటాయి. మధ్యలో చక్రం ఉంటాయి
భారతీయ జెండా ఆసక్తికరమైన అంశాలు (Interesting Facts about National Flag of India)
భారతీయ జెండాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. వాటిని ప్రతి భారతీయ పౌరుడు కచ్చితంగా తెలుసుకోవాలి. మన జాతీయ పతాకం ఎలా రూపొందించబడింది. ఎప్పుడు, ఎవరు తయారు చేసేరనే విషయాలు ఇక్కడ అందించాం.- భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్వతంత్ర సమరయోధుడు.
- చట్టం ప్రకారం, భారతదేశ జాతీయ పతాకాన్ని 'ఖాదీ'తో తయారు చేయాలి. కర్నాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ భారతదేశంలో జెండాను సరఫరా చేయడానికి, తయారు చేయడానికి గుర్తింపు పొందిన ఏకైక యూనిట్.
- ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, భారతదేశ జాతీయ పతాకాన్ని తయారు చేసే తయారీ హక్కును కలిగి ఉంది.
- భారతదేశ జాతీయ పతాకం వెడల్పు పొడవు నిష్పత్తి 2:3. జెండా మూడు స్ట్రిప్స్ వెడల్పు, పొడవులో సమానంగా ఉండాలి.
- బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం స్వతంత్రం పొందే ముందు, జూలై 22, 1947న భారత జెండా ఆమోదించబడింది.
- మే 29, 1953న, ఎడ్మండ్ హిల్లరీ, షెర్పా టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అప్పుడు ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ జాతీయ జెండా, నేపాల్ జాతీయ జెండాతో పాటు ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను కూడా ఎగురవేశారు.
- అదే విధంగా ఇండో-పాక్ అట్టారీ సరిహద్దులో అతిపెద్ద భారత జెండాను ఎగురవేశారు. దేశం అతిపెద్ద జెండా పొడవు 110 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, బరువు 55 టన్నులు.
- ఏప్రిల్ 1984లో ఇండో-సోవియట్ జాయింట్ స్పేస్ ఫ్లైట్ సమయంలో, కాస్మోనాట్ వింగ్ కమాండర్ రాకేష్ శర్మ ధరించిన స్పేస్‌సూట్‌పై చిహ్నంగా భారతదేశ జాతీయ జెండా అంతరిక్షంలోకి ఎగిరింది.
భారతదేశ జెండాలోని రంగుల అర్థం ఏమిటి? (Indian flag colors meaning)
మన దేశ జెండాలో ఉపయోగించిన రంగులకు కూడా విశిష్టమైన అర్థం ఉంది. మూడు రంగులు ఉన్నతమైన విలువలను ఛాటి చెబుతున్నాయి. జెండాలో కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేశానికి సంబంధించిన విభిన్న విలువలను సూచిస్తాయి. అవి వరుసగా ధైర్యం, త్యాగం, శాంతి, సత్యం, విశ్వాసం, శౌర్యాలకు చిహ్నాలుగా సూచించాస్తాయి.
జాతీయ జెండాను హిందీలో తిరంగ అని పిలుస్తారు. దాని మధ్యలో మూడు రంగులు, అశోక చక్రం ఉంటుంది. మూడు రంగులు సూచిస్తాయి:
- కాషాయ రంగు - ధైర్యం, త్యాగం
- తెలుపు - సత్యం, శాంతి, స్వచ్ఛత
- ఆకుపచ్చ రంగు - శ్రేయస్సు
- అశోక చక్రం ధర్మ నియమాలను సూచిస్తుంది
జాతీయ జెండా - చేయవలసినవి..
మన జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఒకవేళ జాతీయ జెండాను అవమానించే విధంగా ఏ చిన్న పని చేసినా శిక్షార్హులవుతారు. అందుకే జాతీయ జెండా విషయంలో ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు భారతీయ పౌరులు తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.జాతీయ జెండాను విద్యా సంస్థలలో (పాఠశాలలు, కళాశాలలు, క్రీడా శిబిరాలు, స్కౌట్ శిబిరాలు మొదలైనవి) ఎగుర వేయవచ్చు. పాఠశాలల్లో జెండా ఎగురవేసేటప్పుడు పిల్లలు ప్రతిజ్ఞను చేయాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేపడతాయి. జాతీయ పతకానికి ఎటువంటి అగౌరవం కలగకుండా పబ్లిక్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లేదా విద్యాసంస్థ సభ్యుడు అన్ని రోజులుసందర్భాలలో జాతీయ జెండాను ఎగురవేయవచ్చు/ప్రదర్శించవచ్చు. కొత్త కోడ్‌లోని సెక్షన్ 2 ప్రైవేట్ పౌరులందరికీ వారి ప్రాంగణంలో జెండాను ఎగురవేసే హక్కును అంగీకరిస్తుంది.