JEE మెయిన్ 2024 మాథెమటిక్స్ (JEE Mains Maths Preparation Tips 2024) ఎలా ప్రిపేర్ అవ్వాలి - నిపుణుల సలహా మరియు ప్రిపరేషన్ టిప్స్

జేఈఈ మెయిన్ 2024 మాథ్స్ ప్రిపేర్ (JEE Mains 2024 Maths Preparation Tips) అవ్వడం కష్టంగా అనిపించిన విద్యార్థులు , ఈ ఆర్దికలో లో అందించిన నిపుణుల సలహా మరియు సూచనల ద్వారా సులభంగా ప్రిపేర్ అవ్వవచ్చు.

జేఈఈ మెయిన్ 2024 మాథ్స్ ప్రిపరేషన్ టిప్స్ (JEE Mains 2024 Maths Preparation Tips) : JEE Main 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్ మాథెమాటిక్స్. ఒక విధంగా చెప్పాలి అంటే జేఈఈ మెయిన్స్ 2024 లో ఉన్న అన్ని సబ్జెక్టుల కంటే మాథెమాటిక్స్ కష్టమైనది. కానీ ఈ సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడం అసాధ్యం కాదు. మీరు జేఈఈ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతూ మీకు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తే ఈ సబ్జెక్టును సులభంగా అర్ధం చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రిపరేషన్ టిప్స్  (JEE Mains 2024 Maths Preparation Tips)ఈ ఆర్టికల్ లో అందించాం. JEE Main 2024 సెషన్ 1 పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో NTA ద్వారా నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఇప్పటి నుండే వారి ప్రిపరేషన్ ను ప్రారంభిస్తే పరీక్షలో మంచి స్కోరు సాధించవచ్చు.

ఇది కూడా చదవండి: JEE మెయిన్ సెషన్ 1 పరీక్షా తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే

విద్యార్థులు మాథెమాటిక్స్ సబ్జెక్టులో మంచి మార్కులు స్కోర్ చెయ్యకపోవడానికి ముఖ్యమైన కారణం ఎంటి అంటే మాథ్స్ లో ప్రైమరీ నాలెడ్జ్ లేకపోవడం. మాథ్స్ లో ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే కొన్నిసార్లు ప్రశ్నలోనే జవాబు కూడా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా జేఈఈ మెయిన్స్ లో మాథ్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి సరైన టైమ్ టేబుల్, ప్రత్యేకమైన టెక్నిక్స్ అవసరం అవుతాయి. 

జేఈఈ మెయిన్స్ 2024 మాథెమాటిక్స్ ఎగ్జామ్ ను క్లియర్ చేయడానికి విద్యార్థులు ఈ క్రింది టిప్స్ (JEE Mains 2024 Maths Preparation Tips) ను ఫాలో అవ్వడం మంచిది.

ఇవి కూడా చదవండి 

జేఈఈ మెయిన్స్ 2024 మాథెమాటిక్స్ ప్రిపరేషన్ టిప్స్ (Preparation Tips for Maths in JEE Main 2024 Exam)

జేఈఈ మెయిన్స్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి మనసులో నెగెటివ్ ఆలోచనలను ఉంచుకోకూడదు. పరీక్ష గురించి ముందే భయపడితే ప్రిపరేషన్ పై పూర్తిగా మనసు పెట్టలేరు. కాబట్టి ప్రిపరేషన్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేయడం చాలా అవసరం. మీ సమయానికి తగ్గట్టు మీ బలాలను, బలహీనతలను బట్టి సొంతగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 

1)ముందుగా ప్రిపరేషన్ ప్రారంభించడం ముఖ్యం

మీరు మాథెమాటిక్స్ సబ్జెక్ట్ కష్టమైనది గా భావిస్తే వీలైనంత త్వరగా ఈ సబ్జెక్టు కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. మీకు ఉన్న సమయం చాలా విలువ అయినది అని మీరు గుర్తుంచుకోవాలి. సమయాన్ని సరిగా ఉపయోగించుకునే విధంగా టైం టేబుల్ సిద్ధం చేసుకోండి. టైం టేబుల్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ రెడీ చేసుకోండి. మీరు జేఈఈ మెయిన్స్ కు మరియు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ అవుతున్నట్లు అయితే మీరు మాథ్స్ సబ్జెక్టు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 

2) సరైన షెడ్యూల్ తయారుచేసుకోండి 

విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక షెడ్యూల్ ను ఫాలో అవ్వడం చాలా అవసరం. ఇక్కడ షెడ్యూల్ అంటే కేవలం చదువుతున్న సమయం మాత్రమే కాదు, మీరు రోజువారీ చేస్తున్న అన్ని పనులను షెడ్యూల్ చేసుకోవాలి. భోజనం చేసే సమయం, చదవడానికి కేటాయించే సమయం , విశ్రాంతి తీసుకునే సమయం రివిజన్ కు అవసరమైన సమయం ఇలా అన్ని పనులకూ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఆ షెడ్యూల్ ను ఫాలో అవ్వడం అలవాటు చేసుకోవాలి. 

విద్యార్థులు ప్రిపరేషన్ మీద మాత్రమే కాకుండా వారి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా చదవడం వలన నిద్ర సరిపోకపోతే విద్యార్థుల ఏకాగ్రత దెబ్బ తింటుంది, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే పూర్తి సమయం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే విద్యార్థి చదువు కోసం మరియు విశ్రాంతి కోసం తప్పకుండా సమయం కేటాయించాలి. విశ్రాంతి కోసం సరైన సమయం కేటాయిస్తూ ఉంటే వారి కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది. 

3) మీ సిలబస్‌ను ప్లాన్ చేసుకోండి 

విద్యార్థులు వారి కోసం టైం టేబుల్ సిద్ధం చేసుకున్న తర్వాత సిలబస్ ను కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఎంత ఉంది అని కాకుండా టాపిక్ క్లిష్టత స్థాయి ఆధారంగా సిలబస్ ను ప్లాన్ చేసుకోవాలి. కష్టంగా ఉన్న టాపిక్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ సమయం కేటాయించండి. అలాగే ప్రతీ టాపిక్ పూర్తి చేసిన తర్వాత రివిజన్ కి కూడా కొంత సమయం కేటాయించడం అవసరం. ఏ టాపిక్ కోసం ఏ పుస్తకం లో చదవాలి అని ముందే ఒక ప్లాన్ రెఢీ చేసుకుంటే ప్రిపేర్ అయ్యే సమయంలో టైం సేవ్ అవుతుంది. విద్యార్థులు వారి సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. 

జేఈఈ మెయిన్స్ 2024 మాథెమాటిక్స్ సబ్జెక్టు లో ఉన్న టాపిక్స్ ప్రకారంగా వెయిటేజీ ఈ క్రింది పట్టిక లో వివరించబడింది. 

JEE Main Maths Topics/ Chapters

Weightage

Differential Calculus

17%

Coordinate Geometry

17%

Integral Calculus

14%

Coordinate Geometry

7%

Matrices and Determinants

7%

Sequence and Series

7%

Trigonometry

7%

Quadratic Equation

3%

Probability

3%

Permutation and Combination

3%

Mathematical Reasoning

3%

Statistics

3%

Algebra

3%

Binomial Theorem

3%

Complex Numbers

3%

4) ఈక్వేషన్స్ మరియు థియరీ లను ప్రత్యేకంగా నోట్ చేసుకోండి. 

జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉండే అన్ని సబ్జెక్టుల కంటే మాథెమాటిక్స్ భిన్నం అయినది. మాథ్స్ సబ్జెక్టు కేవలం చదవడం వలన మాత్రమే నైపుణ్యం రాదు అని విద్యార్థులకు తెలిసిన విషయమే. మాథ్స్ సబ్జెక్టు లో అత్యధికంగా ఈక్వేషన్స్ మరియు థియరీ లు ఉంటాయి. ఈక్వేషన్స్ చాలా సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాప్టర్ ప్రకారంగా అన్ని ఈక్వేషన్స్ మరియు థియరీ లను ప్రత్యేకంగా నోట్ చేసుకుంటే పరీక్షల టైం లో క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఈ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. 

మాథ్స్ సబ్జెక్టు మొత్తం ఇలాంటి ఈక్వేషన్స్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఇవి చాలా అవసరం. సరైన ప్రశ్నకు సరైన ఈక్వేషన్స్ అమలు చేస్తేనే జవాబు కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి చాప్టర్ ప్రకారంగా ఈక్వేషన్స్ ను నోట్ చేసుకుంటే విద్యార్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా సులభంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 

5)ఎక్కువ పుస్తకాలు చదవండి / రిఫరెన్స్ తీసుకోండి

విద్యార్థులు కేవలం వారి పాఠ్య పుస్తకాలను మాత్రమే కాకుండా వారి సిలబస్ లేదా టాపిక్స్ కోసం కొత్త విషయాలను తెలుసుకోవడానికి మరియు పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఎక్కువ పుస్తకాల నుండి రిఫరెన్స్ తీసుకోవడం మంచిది. మాథ్స్ సబ్జెక్టు విషయానికి వస్తె NCERT మాత్రమే కాకుండా R. D. Sharma, Arihant పుస్తకాల నుండి రిఫరెన్స్ తీసుకోవడం కూడా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతీ పుస్తకం వివిధ ఫార్మాట్ లలో ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. దాంతో విద్యార్థులు కొత్త కాన్సెప్ట్ లను నేర్చుకునే అవకాశం ఉంటుంది. 

జేఈఈ మెయిన్స్ 2024 మాథ్స్ ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు (Best Books to Prepare for Maths in JEE Mains 2024)

జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మాథ్స్ సబ్జెక్టు కు అవసరమైన వివిధ పుస్తకాల లిస్ట్ క్రింది పట్టిక లో వివరించబడింది. 

Books

Publishers

Maths For Class 11 and 12

R. S. Agarwal

Maths For Class 11 and 12

R. D. Sharma

Algebra

Arihant

IIT Mathematics

M. L. Khanna

Trigonometry

S. L. Loney

Differential Calculus

Arihant

Calculus and Analytic Geometry

Thomas and Finney

Introduction Probability and It’s Application

W. Feller

Geometry

Dr Gorakh Prasad

సక్సెస్ సాధించడానికి రివిజన్ చాలా అవసరం.

విద్యార్థులు ఒకసారి చదివింది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అనుకుంటారు కానీ అలా అనుకోవడం చాలా తప్పు. అందుకే విద్యార్థులు ప్రతీ టాపిక్ ను ఒకటికి రెండుసార్లు రివిజన్ చేయడం చాలా అవసరం. కేవలం సిలబస్ ను మాత్రమే రివిజన్ చేయడం కాకుండా మోడల్ పేపర్లకు మరియు గత సంవత్సర ప్రశ్న పత్రాలకు జవాబులు వ్రాస్తూ ఉండడం వలన ప్రశ్నలను సులభంగా అర్ధం చేసుకోగలరు. ప్రశ్నలను అర్థం చేసుకుంటే వాటికి జవాబులు వ్రాయడం కూడా సులభం అవుతుంది. 

మాథ్స్ సబ్జెక్టు లో ఒకే ప్రశ్న ను రెండు మూడు విధాలుగా కూడా అడగవచ్చు, ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి అంటే విద్యార్థులు ఖచ్చితంగా ఆ ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. మాథ్స్ సబ్జెక్టు లో ఉండే ప్రశ్నలను ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వలన విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 

జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు పైన చెప్పిన అంశాలను ఫాలో అవ్వడం వలన ఎంటువంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయవచ్చు. అంతే కాకుండా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించాలి.

జేఈఈ మెయిన్స్ 2024 మాథ్స్ ప్రిపరేషన్ కు ముఖ్యమైన పాయింట్స్ (Important Points to Remember While Preparing Maths for JEE Mains 2024)

జేఈఈ మెయిన్స్ 2024 మాథ్స్ సబ్జెక్ట్ కు ప్రిపేర్ (JEE Mains 2024 Maths Preparation Tips)అవుతున్న విద్యార్థులు ఈ క్రింది అంశాలను ఫాలో అవ్వాలి. 

  • ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 
  • నిరంతరంగా ప్రిపేర్ అవ్వడం కంటే మధ్య మద్యలో విరామం తీసుకోవడం మంచిది. 
  • మీరు సెట్ చేసుకున్న టైం టేబుల్ నుండి బయటకు రావద్దు. ఉదాహరణకు ఒక టాపిక్ కోసం మూడు గంటలు కేటాయిస్తే ఆ మూడు గంటలలో టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. 
  • మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోండి. ఉదాహరణకు ఏదైనా టాపిక్ కంప్లీట్ చెయ్యడానికి మూడు లేదా నాలుగు గంటల సమయం కావాల్సి వస్తె ఆ సమయం కేటాయించండి. నేను గంటలోనే నేర్చుకోగలను అని అతి నమ్మకం వద్దు. 
  • ఒకే ప్రశ్న మీద ఎక్కువ కాలం ఉన్నా కూడా ఆ ప్రశ్నకి సమాధానం దొరకకపోతే టీచర్ల సహాయం తీసుకోవడం మంచిది. 

చివరిగా మిమ్మల్ని మీరు నమ్మితే  జేఈఈ మెయిన్స్ 2024 ను తప్పకుండా క్రాక్ చేస్తారు. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ పాజిటివ్ గా ఉండండి.

 ఆల్ ది బెస్ట్ ఫ్రం CollegeDekho

Get Help From Our Expert Counsellors

FAQs

JEE Mains 2024 గణితం ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాలు ఏవి?

JEE Mains 2024 గణితం ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన పుస్తకాల జాబితా ఇది : 

1. Maths For Class 11 and 12 - R. S. Agarwal

2. Maths For Class 11 and 12 - R. D. Sharma

3. Algebra - Arihant

4. IIT Mathematics - M. L. Khanna

JEE Mains 2024 గణితం సబ్జెక్టులో ముఖ్యమైన టాపిక్స్ ఏవి?

JEE Mains 2024 పరీక్షలో గణితం సబ్జెక్టు కు సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ ను పైన ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

JEE Mains 2024 పరీక్షలో గణితం సబ్జెక్టు నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?

JEE Mains 2024 పరీక్షలో గణితం సబ్జెక్టు నుండి 25 ప్రశ్నలు అడుగుతారు. 

JEE Main Previous Year Question Paper

2024 Physics Paper Morning Shift

Admission Updates for 2025

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Related Questions

have you any faculty in this college for aeronautical engg.

-nityanshi kainUpdated on April 01, 2025 06:36 PM
  • 1 Answer
Jayita Ekka, Content Team

Dear student,

We are not part of the college. CollegeDekho is a platform to help students in their college & course search, thereby helping them to plan and execute for a lucrative career. We suggest that you get in touch with the college directly for faculty related queries. 

READ MORE...

Can I take admisson on 12th basis

-rashi tamrakarUpdated on April 02, 2025 06:34 PM
  • 1 Answer
Rupsa, Content Team

Dear student,

We are not part of the college. CollegeDekho is a platform to help students in their college & course search, thereby helping them to plan and execute for a lucrative career. We suggest that you get in touch with the college directly for faculty related queries. 

READ MORE...

BTech lateral entry mechanical fees structure

-bikram keshari beheraUpdated on April 02, 2025 06:19 PM
  • 1 Answer
Rupsa, Content Team

Dear student,

We are not part of the college. CollegeDekho is a platform to help students in their college & course search, thereby helping them to plan and execute for a lucrative career. We suggest that you get in touch with the college directly for faculty related queries. 

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్