మే డేని ఎందుకు జరుపుకుంటారు? కార్మిక దినోత్సవం హిస్టరీ ఇక్కడ తెలుసుకోండి (May Day Speech in Telugu)
మే డేని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటారు? మే డే ఎప్పుడు మొదలైంది? (May Day Speech in Telugu) ఏ ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారనే వివరాలు ఈ ఆర్టికల్లో అందించాం. మే డేకి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
తెలుగులో మేడే స్పీచ్ (May Day Speech in Telugu) : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మే ఒకటో తేదీన అంటే మే డే రోజున సెలవు పాటిస్తారు. మన దేశంలో కూడా ఈ సంప్రదాయం ఉంది. కానీ చాలామందికి అసలు మే డే అంటే ఏమిటి? మే డే ఎలా మొదలైంది? అసలు మేడే ప్రత్యేకతల గురించి తెలియదు. ఈ విషయాల గురించి ఈ ఆర్టికల్లో (May Day Speech in Telugu) అందించాం. మే డే అనేది అంతర్జాతీయంగా ప్రత్యేకమైన రోజు.. ఆ డేకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
మే డే .. అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే డే పుట్టుకకు కార్మికుల పోరాటాలు, ఉద్యమాలే కారణం. తమ పనిగంటలు తగ్గించమని కోరుతూ 1886లో షికాగోలో హే మార్కెట్‌లో కొంతమంది కార్మికులు ఉద్యమించారు. ఈ పోరాటమే మే డే ఆవిర్భావానికి కారణంగా చెబుతుంటారు. ఆ ఏడాది మే 1వ తేదీన చాలామంది కార్మికులు నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా హే మార్కెట్‌లో మరికొంతమంది కార్మికులు పోరాడగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఒక ఏడాది పాటు చాలా దేశాల్లో కార్మికులు ఉద్యమాలు, నిరసనలు ప్రదర్శనలు చేశారు.
ఇది కూడా చదవండి: ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు కార్డు క ోసం ఎలా అప్లై చేసుకోవాలి?
రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలుగా ఉండాలనేదే అప్పటి కార్మికుల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్‌తోనే అనేక యూరోపియన్ దేశాల్లో ప్రదర్వనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన షికాగోలో చనిపోయిన కార్మికులకు గుర్తుగా మే డేని జరుపుకోవాలని కొందరు కార్మిక నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అలా మే డే ఉద్బవించింది. అప్పటి నుంచి చాలా దేశాల్లో మే 1న మేడేని జరుపుకుంటున్నారు. అంతేకాదు ఆరోజున పోరాటాలు, నిరసనలు చేపడుతుంటారు. కార్మికుల సమస్యలపై ప్రసంగిస్తుంటారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు మే 1ని సెలవుగా ప్రకటించాయి. ఇదే సంప్రదాయాన్ని చాలా దేశాలు కూడా పాటిస్తున్నాయి. కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మే 1వ తేదీన ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తుంది.
మన దేశంలో మే డే (May Day in India)
మన దేశంలో కూడా మే డేకి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర దేశాల్లోలాగానే మన దేశంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు జరిగాయి. మన దేశంలో 1862లో కలత్తాలోని కార్మికుల పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్‌లో సమ్మే చేశారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడింది. ఈ ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మికుల్లో చైతన్యం పెరిగింది. తొలిసారిగా భారత్‌లో 1923లో మే డేని పాటించారు. భారతదేశంలో మొదటి కార్మిక దినోత్సవాన్ని మే 1, 1923న చెన్నైలో జరుపుకున్నారు. మొదటి మే డే వేడుకలను లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత కామ్రేడ్ సింగరవేలర్ రెండు సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్మిక దినోత్సవాన్ని వివిధ భారతీయ రాష్ట్రాలలో అనేక పేర్లతో జరుపుకుంటారు. మే డే అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పేరు. కార్మిక దినోత్సవాన్ని హిందీలో "కమ్‌గర్ దిన్" అని, కన్నడలో షకార్మిక దినచరనేష అని, తెలుగులో "కార్మిక దినోత్సవం" అని, మరాఠీలో "కమ్‌గర్ దివస్" అని, తమిళంలో "ఉజైపలర్ ధీనం" అని, మలయాళంలో "తొజిలాలీ దినమ్" అని, బెంగాలీలో "ష్రోమిక్ దిబోష్" అని పిలుస్తారు.మే డేకి సంబంధించి ముఖ్యమైన విషయాలు (Interesting facts of May Day)
- 1886లో మే డేను అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే కార్మిక సెలవుదినం.
- 1894లో యునైటెడ్ స్టేట్స్ కార్మికుల సహకారం, విజయాలను గుర్తించడానికి కార్మిక దినోత్సవాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.
- మే డే ని కార్మికుల త్యాగానికి ప్రతీకగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.
- కార్మిక దినోత్సవాన్ని సూచించే ఎర్ర జెండాను మే డే రోజు ఎగురవేస్తారు.
ఇతర దేశాల్లో వేర్వేరు పేర్లతో (మే డే) కార్మిక దినోత్సవం..
ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల్లో మే డే అంటే కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో వేరే పేర్లతో కూడా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాంటి దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి. బంగ్లాదేశ్ రాణా ప్లాజా భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం ఏప్రిల్ 24ని కార్మిక భద్రతా దినంగా జరుపుకుంటుంది. అలాగే మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా కూడా జరుపుకుంటుంది. అదేవిధంగా జపాన్‌లో లేబర్ డేని అధికారికంగా నవంబర్ 23న లేబర్ థాంక్స్ గివింగ్ డేగా జరుపుకుంటారు. ఇక చైనా ప్రభుత్వం మే డే సందర్భంగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తుంది. అలాగే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, పాకిస్థాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాల్లో నిరసనలు జరుగుతాయి.ప్రపంచ కార్మిక దినోత్సవం అనేది శ్రామిక ప్రజలు తమ సాధారణ విధుల నుంచి విరామం తీసుకోవడానికి కేటాయించిన రోజు. కార్మికుల హక్కుల కోసం వాదించడానికి, ఇతర కార్మికులకు సంఘీభావంగా నిలబడటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల విజయాలను జరుపుకోవడానికి ఇది ఒక అవకాశం. మేడే రోజున కార్మిక హక్కులను గుర్తు చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్మిక హక్కులపై అవగాహన పెంచేందుకు వివిధ మార్గాల ద్వారా సందేశాలు కూడా అందజేస్తారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2024, ఫేమస్ కొటేషన్స్ (International Labour Day 2024: Quotes)
అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని చాలా మంది తత్త్వవేత్తలు చాలా రకాలుగా వివరించారు. ప్రజలు అర్థమయ్యేలా తెలియజేశారు. సామాజిక తత్త్వవేత్తల కోటేషన్స్ కొన్ని చాలా ఫేమస్ కూడా అలాంటి కొటేషన్స్‌ని ఈ దిగువున అందించా.ం
- డబ్బు సంపాదించడానికే కాదు, జీవితాన్ని రూపొందించుకోవడానికి కూడా పని చేస్తారు- మార్క్ చాగల్
- కఠినమైన శక్తి, దృఢమైన ధైర్యం ద్వారా శ్రమ, బాధాకరమైన కృషి ద్వారా మాత్రమే మనం మంచి విషయాలకు తెలుసుకోగలం.'- థియోడర్ రూజ్‌వెల్ట్
- "గొప్ప శ్రమ లేకుండా ఏ మానవ కళాఖండం సృష్టించబడ లేదు." - ఆండ్రీ గిడే
- "మీరు చేస్తే తప్ప ఏదీ పని చేయదు."- మాయా ఏంజెలో
- "శ్రమ లేకుండా, ఏదీ అభివృద్ధి చెందదు." - సోఫోకిల్స్
- "నేను తలతో లేదా చేతితో శ్రమతో కూడిన గౌరవాన్ని నమ్ముతాను; ప్రపంచం ఏ మనిషికి రుణపడి ఉండదు, కానీ ప్రతి మనిషికి జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది." -జాన్ డి. రాక్‌ఫెల్లర్
మేడే ప్రాముఖ్యత (May Day Importance)
మేడే ప్రాముఖ్యతను తెలియజేసే మరికొన్ని అంశాలను ఈ దిగువున చూడొచ్చు.
- మే డే ఒక ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇది బహుళ అర్థాలను కలిగి ఉంది. కార్మికులు వారి హక్కుల కోసం పోరాడుతున్న పోరాటాలను గుర్తు చేస్తుంది.
- సమాజానికి కార్మికులు చేసిన సేవలను గౌరవించే రోజు, న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని పరిస్థితులు, ఇతర కార్మిక సంబంధిత సమస్యల కోసం జరుగుతున్న పోరాటాల గురించి అవగాహన కల్పించే రోజు.
- మే డే అనేది అంతర్జాతీయ సంఘీభావ దినం, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పాటించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన పెంచడానికి కార్మిక సంఘాలు, వర్కర్ ఆర్గనైజేషన్‌లకు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది.
- మే డే వసంతకాలం ప్రారంభం, కొన్ని సంస్కృతులలో కొత్త సీజన్ వేడుకలతో ముడిపడి ఉంటుంది.
- ప్రకృతికి, పునరుద్ధరణకు ఈ కనెక్షన్ రోజు ప్రాముఖ్యతను పెంచుతుంది. మానవులు, పర్యావరణం పరస్పర అనుసంధానాన్ని గుర్తు చేస్తుంది.
- మే డే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కార్మికుల సహకారం, కార్మికుల హక్కుల కోసం కొనసాగుతున్న పోరాటం. అంతర్జాతీయ సంఘీభావం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కులను, సమాన అవకాశాలను కల్పించే విధంగా అవకాశాలను సూచించే రోజు అని చెప్పుకోవచ్చు.
తెలుగులో మరిన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.