Predict My College

NEET 2024లో మంచి రిజల్ట్స్‌కి (NEET 2024 Preparation Tips) ప్రిపరేషన్ టిప్స్

మే 5, 2024న NEET 2024 పరీక్షకు హాజరుకావడం పట్ల ఆందోళన చెందుతున్నారా? మీ ప్రిపరేషన్‌ని  మరింత మెరుగుపరచడానికి, ప్రవేశ పరీక్షలో రాణించడానికి ఈ స్మార్ట్ నీట్ ప్రిపరేషన్ టిప్స్‌ని (NEET 2024 Preparation Tips) ఇక్కడ అందజేశాం. 

Predict My College
NEET 2024లో మంచి రిజల్ట్స్‌కి  (NEET 2024 Preparation Tips) ప్రిపరేషన్ టిప్స్

నీట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ (NEET 2024 Preparation Tips): NEET 2024 అనేది దేశవ్యాప్తంగా ఉన్న MBBS/ BDS అలాగే MD/MS కాలేజీల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా  నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. ప్రతి సంవత్సరం మాదిరిగానే, మే 5, 2024న జరిగే NEET UG 2024 పరీక్షకు దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేయబడింది, దీని కోసం సన్నాహాలు సాగుతున్నాయి.

ఇప్పటికే అభ్యర్థులు నీట్ 2024 కోసం ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నారు. వారి ప్రిపరేషన్‌ని మరింత పదునుగా మార్చేందుకు, ప్రవేశ పరీక్షలో అత్యద్భుతమైన  విజయం సాధించడంలో సహాయపడగలమని భావిస్తున్న కొన్ని స్మార్ట్ NEET 2024 సన్నాహక టిప్స్‌‌ను మీకు అందిస్తున్నాం.

సరైన, సమగ్రమైన షెడ్యూల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి (Make A Realistic Study Schedule)

NEET UG 2024 ప్రిపరేషన్‌కు హార్డ్ వర్క్,  స్మార్ట్ వర్క్ అవసరం.  ఈ విషయాన్ని అభ్యర్థులు ముందుగా గుర్తించాలి.  అందువల్ల NEET పరీక్షకు ఎలా సిద్ధం కావాలనే దానిపై సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలి.  పూర్తిగా  ఆచరణాత్మక అధ్యయన షెడ్యూల్‌గా ఉండాలి. ఇలాంటి షెడ్యూల్‌ను తయారు చేసుకోవడమే అభ్యర్థుల ముందు అడుగు అవుతుంది.  అనంతరం ఆ షెడ్యూల్‌కు పూర్తిగా అభ్యర్థులు కట్టుబడి ఉండాలి. అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని, ప్రతిభను గుర్తించి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇది అభ్యర్థుల పనితీరును ప్రభావితం చేస్తుంది.

ముఖ్యంగా NTA NEET‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ,  జువాలజీ అనే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులను సమర్థవంతంగా కవర్ చేయడానికి అంచనాగా అధ్యయన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చాలా అవసరం.

నీట్ 2024కి ఎలా చదవాలి? పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి (How to study for NEET: Know The Paper Pattern)

NEET UG 2024లో అభ్యర్థులు మంచి ర్యాంక్‌ను సాధించాలనుకుంటే ముందుగా పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి. NEET 2024  పేపర్ నమూనాలో  ప్రశ్నల రకం, మార్కింగ్ స్కీమ్, పరీక్షకు కేటాయించే సమయం ఇలా చాలా వాటి గురించి తెలియజేస్తుంది.

నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ (NEET UG 2024 Exam Pattern)

నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

పరీక్ష విధానంలో ఉండే అంశాలు వివరాలు
నీట్ ప్రశ్నపత్రం మోడ్ పెన్, పేపర్ మోడ్
NEET పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు
ప్రశ్నల రకం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు
NEET 2024 ప్రశ్నపత్రంలో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? 200 ప్రశ్నలు వీటిలో 180 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
సెక్షన్ వైజ్ ప్రశ్నలు భౌతికశాస్త్రం (35+15)
రసాయన శాస్త్రం (35+15)
వృక్షశాస్త్రం (35+15)
జంతుశాస్త్రం (35+15)
మొత్తం మార్కులు 720 మార్కులు
NEET 2024 మార్కింగ్ స్కీమ్
ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వబడతాయి

ప్రతి తప్పు ప్రయత్నానికి 1 మార్కు తీసివేయబడుతుంది

సమాధానం లేని ప్రశ్నలకు మార్కులు లేవు


NEET 2023 సిలబస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి (Preparation Tips For NEET 2024: Know The Syllabus)


ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు NEET 2024 సిలబస్‌ను బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అధ్యయన షెడ్యూల్‌కు ఆధారం.  NEET సిలబస్ 2024లో ఉన్న విభాగాలు, అధ్యాయాలు, కాన్సెప్ట్‌ల గురించి అభ్యర్థులకు తెలియకపోతే మొత్తం ప్రిపరేషన్‌ వల్ల ఉపయోగం ఉండదు. నీట్ ప్రిపరేషన్ 2024 కోసం వ్యూహాన్ని రూపొందించడానికి, సిలబస్ వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అభ్యర్థికి సిలబస్‌ను క్షుణ్ణంగా తెలిసినప్పుడే ఒక్కో విభాగానికి వెచ్చించాల్సిన సమయాన్ని విభజించడం సాధ్యమవుతుంది.


NEET 2024 టాపిక్స్‌ వారీగా వెయిటేజీ - జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం (NEET 2024 Topic-wise Weightage for All Subjects – Biology, Physics, Chemistry)

NEET UG సిలబస్ విస్తృతంగా ఉందని పరిగణనలోకి తీసుకుంటే, ప్రవేశ పరీక్షలో రాణించాలనుకునే విద్యార్థులు గరిష్ట వెయిటేజీతో అధ్యాయాలు/అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఏ టాపిక్‌లపై దృష్టి పెట్టాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే  CollegeDekho మిమ్మల్ని గైడ్ చేస్తుంది.  మేము నీట్ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను విశ్లేషించాం. వెయిటేజీ ఆధారంగా మూడు సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన అంశాల జాబితాను సిద్ధం చేశాం.

నీట్ 2024 ఫిజిక్స్‌లో ఛాప్టర్ వైజ్‌గా వెయిటేజీ అంశాలు (Chapter-Wise Weightage for NEET UG Physics)

NEET 2024లోని ఫిజిక్స్ సెక్షన్‌లో 4 మార్కులు చొప్పున 45 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్‌లో ఎక్కువ ఛాప్టర్ వైజ్‌గా వెయిటేజీ అంశాలు ఈ దిగువున అందించడం జరిగింది.

NEET ఫిజిక్స్ 2024 కోసం ముఖ్యమైన అంశాలు

ప్రశ్నల సంఖ్య

మెకానిక్స్

13

ఎలెక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిసిటీ

11

ఆధునిక భౌతిక శాస్త్రం & ఎలక్ట్రానిక్స్

8

అయస్కాంతత్వం

7

ఆప్టిక్స్

4

హీట్ & థర్మోడైనమిక్స్

4

SHM & వేవ్

3

NEET UG కెమిస్ట్రీలో వెయిటేజీ ఉన్న ఛాప్టర్లు (Chapter-Wise Weightage for NEET UG Chemistry

NEET కెమిస్ట్రీ సిలబస్‌ను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. అవి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ  ప్రశ్నపత్రంలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌లో ఏలో 35 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బీలో 15 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ బీలోని 15 ప్రశ్నల్లో అభ్యర్థులు పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దిగువ టేబుల్లో కెమిస్ట్రీలో వెయిటేజీ గల ఛాప్టర్లు తెలుసుకోవచ్చు.

సెక్షన్

NEET కెమిస్ట్రీ 2024 కోసం ముఖ్యమైన అంశాలు

ప్రశ్నల సంఖ్య

అకర్బన రసాయన శాస్త్రం

రసాయన బంధం (Chemical bonding)

5

p-బ్లాక్

3

s-బ్లాక్

2

D, F బ్లాక్

2

సమన్వయ కెమిస్ట్రీ (Coordination Chemistry)

2

మెటలర్జీ

2

ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ

1



కర్బన రసాయన శాస్త్రము

హైడ్రోకార్బన్లు

4

కార్బొనిల్ సమ్మేళనం

3

హాలోఅల్కేన్స్,  హలోరేన్స్

2

అమీన్

2

ఆల్కహాల్, ఫినాల్, ఈథర్

1

కొన్ని ప్రాథమిక సూత్రాలు, పద్ధతులు

1

రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ

1

పాలిమర్లు

1

జీవఅణువులు

1




ఫిజికల్ కెమిస్ట్రీ

రాష్ట్రాలు

2

ఘన స్థితి

2

పరిష్కారాలు

2

రసాయన గతిశాస్త్రం

2

ఎలక్ట్రోకెమిస్ట్రీ

2

ఉపరితల రసాయన శాస్త్రం

1

థర్మోడైనమిక్స్

1

అయానిక్ సమతుల్యత

1

మోల్ భావన

1

పరమాణు నిర్మాణం

1

న్యూక్లియర్ కెమిస్ట్రీ

1

NEET UG జీవశాస్త్రంలో ఛాప్టర్ వారీగా వెయిటేజీ (Chapter-wise Weightage for NEET UG Biology)

జీవశాస్త్ర సెక్షన్ NEET 2024లో వృక్షశాస్త్రం,  జంతు శాస్త్రంతో కలిపి మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి.  బయాలజీలో ఉన్న ముఖ్యమైన అంశాలు, వెయిటేజీ వారీగా ఛాప్టర్లు ఈ దిగువున తెలియజేయడం జరిగింది.

NEET జీవశాస్త్రం 2024 ముఖ్యమైన అంశాలు

ప్రశ్నల సంఖ్య

వారసత్వం, పరమాణు ఆధారం (Molecular Basis of Inheritance)

10

సెల్ సైకిల్, సెల్ డివిజన్

7

బయోటెక్నాలజీ: సూత్రాలు, ప్రక్రియలు

6

మొక్కల రాజ్యం (Plant Kingdom)

5

జంతు సామ్రాజ్యం

4

ఎత్తైన మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ

4

లోకోమోషన్, కదలిక

4

జీవులు, జనాభా

4

పర్యావరణ వ్యవస్థ

3

ఆహార ఉత్పత్తిలో మెరుగుదల కోసం వ్యూహాలు

3

మానవ ఆరోగ్యం, వ్యాధి

3

పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి

3

మానవ పునరుత్పత్తి

3

పునరుత్పత్తి ఆరోగ్యం

3

శ్వాస, వాయువుల మార్పిడి

3

శరీర ద్రవాలు, ప్రసరణ

3

మొక్కల పెరుగుదల, అభివృద్ధి

3

జీవ అణువులు

3

పుష్పించే మొక్కల అనాటమీ

3

జంతువులలో నిర్మాణ సంస్థ

3

పుష్పించే మొక్కల స్వరూపం

2

సెల్: ది యూనిట్ ఆఫ్ లైఫ్

2

జీర్ణక్రియ, శోషణ

2

వారసత్వం, వైవిధ్యం సూత్రాలు

2

పర్యావరణ సమస్యలు

1

మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు

1

పరిణామం

1

మొక్కలలో శ్వాసక్రియ

1

మొక్కలలో రవాణా

1

ది లివింగ్ వరల్డ్

1

జీవ వర్గీకరణ

1

స్మార్ట్ నీట్ 2024 ప్రిపరేషన్ టిప్స్ (NEET 2024 Preparation Tips)

NEET 2024 పరీక్ష కోసం ప్రిపరేషన్‌కు మంచి ప్లానింగ్ ఉండాలి. అప్పుడే అభ్యర్థులు పరీక్షలో మంచి ర్యాంకును, స్కోర్‌ను పొందగలుగుతారు. అయితే ప్రిపరేషన్‌లో చిన్న చిన్న టిప్స్‌ను పాటించడం ద్వారా మరింత సులభంగా  600కుపైగా స్కోర్ చేయవచ్చు. విద్యార్థులు తమకు ఇష్టమైన మెడికల్ కాలేజీలో సీటు పొందవచ్చు. ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడానికి  నీట్ 2024 టిప్స్‌ని  (NEET 2024 Preparation Tips) ఇక్కడ తెలుసుకోవచ్చు.

NEET 2024కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి (Grasp All Information Related to NEET 2024)

NEET 2024కి హాజరవ్వాలనుకునే విద్యార్థులు ముందుగా పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి. NEETకు సంబంధించిన లేటెస్ట్ వార్తలను, అప్‌డేట్‌లను ఫాలో అవుతూ ఉండాలి. అదే విధంగా పరీక్ష విధానాన్ని తెలుసుకోవాలి. ఏ టాపిక్‌కు ఎన్ని మార్కులు, ఎన్ని గంటల్లో పరీక్షను నిర్వహిస్తారు.. అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలి. NEET 2024లో మంచి ర్యాంకు కోసం మంచి పుస్తకాలను ఎంచుకోవాలి.

నీట్ 2024 సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి (Have a Clear Picture of NEET 2024 Syllabus in Your Mind)

విద్యార్థులు ప్రిపరేషన్‌ను ప్రారంభించే ముందు NEET 2024 సిలబస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం.  NEET సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సిలబస్‌పై పట్టు సాధించేందుకు చిన్న భాగాలుగా విభజించుకోవాలి. దీనివల్ల సిలబస్‌లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలనేది తెలుస్తుంది.

ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేసుకోవాలి (Set Your Priorities Right)

NEET 2024కు ప్రిపేర్ అయ్యే ముందు అభ్యర్థులు సిలబస్‌లో ప్రాధాన్యతలను సెట్ చేసుకోవాలి. దాని ద్వారా స్టడీ షెడ్యూల్‌ని రూపొందించుకోవాలి. ఎక్కువ సమయం కేటాయించాలనుకునే టాపిక్  షెడ్యూల్ జాబితాలో టాప్‌లో ఉండేలా చూసుకోవాలి. సబ్జెక్టుల వారీ వెయిటేజీ ప్రకారం వాటి ప్రిపరేషన్‌కు తగినంత సమయం కేటాయించుకోవాలి. అదే సమయంలో విద్యార్థులు సరైన ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్ర పోవాలి.

షెడ్యూల్డ్ బ్రేక్స్ తీసుకోవాలి (Take Scheduled Breaks)

మెడికల్ ఎంట్రన్స్‌లకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎక్కువగా మారథాన్ స్టడీ సెషన్‌లు అలవాటు పడుతుంటారు. మీరు కూడా ఈ కోవలోకి వస్తే అటువంటి స్టడీకి దూరంగా ఉండడం చాలా మంచిది.  కదలకుండా స్టడీ చేయడం వల్ల ఎక్కువగా నష్టాలు జరుగుతాయి. స్టడీ చేసే సమయంలో అభ్యర్థులు కొన్ని బ్రేక్స్‌ కూడా తీసుకోవాలి.  అలా బ్రేక్స్ తీసుకోవడం ద్వారా విద్యార్థుల ఏకగ్రత మరింత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టుపై వేగంగా పట్టు సాధించగలుగుతారు.

పరిశీలించుకోవడం అవసరం (Keep Evaluating Your Performance)

ఒక పని చేశాక అది ఎంత వరకు వర్క్ అవుట్ అయిందో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే  తమ స్టడీ పూర్తైన తర్వాత విద్యార్థులు కూడా తమకు ఎంత వరకు వచ్చిందో పరిశీలించుకోవాలి. ఇలా పరిశీలించుకోకపోతే NEET 2024 ప్రిపరేషన్ పూర్తి కానట్టే. అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని పరిశీలించుకోవడానికి NEET UG పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ని, NEET 2024 Practice Testsని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల అభ్యర్థులు ఏ టాపిక్స్‌‌లో వెనుకబడి ఉన్నారో అర్థం అవుతుంది. ఆ టాపిక్స్‌పై మరింత దృష్టి పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. దీంతోపాటు సీనియర్ల సహకారం తీసుకోవడం చాలా మంచిది. వారి సూచనలు ఫాలో అవ్వడం వల్ల NEET 2024లో మంచి ర్యాంక్ సాధించవచ్చు.

నీట్ 2024 కోసం బెస్ట్ పుస్తకాలు: కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ  (Best Books for NEET 2024: Chemistry, Physics and Biology)

NEET 2024 సిలబస్ ఎక్కువగా ఇంటర్ పరీక్షలో కవర్ చేయబడిన అంశాలపై ఆధారపడి ఉంటుంది. నీట్ పరీక్షలో 11, 12 తరగతులకు సంబంధించిన NCERT టెక్ట్స్ పుస్తకాల్లో ఉన్న సిలబస్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. అందుకే NEET కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు  NCERT పాఠ్యపుస్తకాలను ఫాలో అవ్వాలి. ఎందుకంటే నీట్ ఎంట్రన్స్ పరీక్షలోని 90 శాతం ప్రశ్నలు  NCERT పుస్తకాల నుంచి వచ్చినట్టు అంచనా వేయబడింది. కాబట్టి NCERT పుస్తకాలను అధ్యయనం చేసిన ఎవరైనా NEET 2024లో 600+ స్కోర్ చేసే అవకాశం చాలా ఎక్కువ.

నీట్ 2024 కోసం  NCERT పుస్తకాలతోపాటు ప్రాబ్లమ్-సాల్వింగ్, ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం అభ్యర్థులు ఇతర పుస్తకాలను కూడా స్టడీ చేయవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల పుస్తకాల జాబితా కింద ఇవ్వడం జరిగింది.

NEET కెమిస్ట్రీ 2024 కోసం ఉత్తమ పుస్తకాలు

NEET ఫిజిక్స్ 2024 కోసం బెస్ట్ పుస్తకాలు

NEET జీవశాస్త్రం 2024 కోసం బెస్ట్ పుస్తకాలు

NCERT (టెక్స్ట్‌బుక్) కెమిస్ట్రీ – క్లాస్ 11 & 12

క్లాస్ 11 & 12 భౌతికశాస్త్రం కోసం NCERT పాఠ్యపుస్తకం

NCERT జీవశాస్త్రం క్లాస్ XI మరియు క్లాస్ XII పాఠ్యపుస్తకాలు

OP టాండన్ ద్వారా ఫిజికల్ కెమిస్ట్రీ

CP సింగ్ ద్వారా NEET కోసం భౌతికశాస్త్రం

ఎంపీ త్యాగి ద్వారా నీట్ కోసం ట్రూమాన్ ఆబ్జెక్టివ్ బయాలజీ

మోరిసన్ ద్వారా ఆర్గానిక్ కెమిస్ట్రీ

SB త్రిపాఠి ద్వారా NEET కోసం 40 రోజుల భౌతికశాస్త్రం

జీవశాస్త్రం కోసం GR బాత్లా ప్రచురణలు

దినేష్ కెమిస్ట్రీ గైడ్

ప్రదీప్ రచించిన ఫండమెంటల్ ఫిజిక్స్

జీవశాస్త్రంపై ప్రదీప్ గైడ్

అభ్యాస పుస్తకం N అవస్థి (భౌతికం)

హాలిడే, రెస్నిక్, వాకర్ ద్వారా ఫిజిక్స్ యొక్క ప్రాథమిక అంశాలు

ఎస్ చక్రవర్తిచే నీట్ కోసం 40 రోజుల జీవశాస్త్రం

అభ్యాస పుస్తకం MS చౌహాన్ (సేంద్రీయ)

DC పాండేచే ఆబ్జెక్టివ్ ఫిజిక్స్

అన్సారీచే ఆబ్జెక్టివ్ బోటనీ

VK జైస్వాల్ (అకర్బన) ద్వారా అభ్యాస పుస్తకం

IE Irodov ద్వారా జనరల్ ఫిజిక్స్‌లో సమస్యలు

దినేష్ ద్వారా ఆబ్జెక్టివ్ బయాలజీ

సుధాన్షు ఠాకూర్ ద్వారా నీట్ కోసం 40 రోజుల కెమిస్ట్రీ

హెచ్‌సి వర్మ రచించిన ఫిజిక్స్ కాన్సెప్ట్స్

జీవశాస్త్రం వాల్యూం 1, వాల్యూం 2 ట్రూమాన్

JD లీ ద్వారా సంక్షిప్త అకర్బన రసాయన శాస్త్రం

-- --

ఆధునిక  11, 12 తరగతులకు ABC ఆఫ్ కెమిస్ట్రీ

-- --

ఈ ప్రిపరేషన్ టిప్స్‌ని ఫాలో అయితే NEET 2024లో అభ్యర్థులు బాగా స్కోర్ చేయగలరు. కాబట్టి ఈ టిప్స్‌ను ఫాలో అయి అభ్యర్థులు మంచి ర్యాంక్‌ను సొంతం చేసుకోండి.

NEET UG పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు, వార్తల కోసం CollegeDekho వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి

Get Help From Our Expert Counsellors

Admission Updates for 2025

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Related Questions

When NEET UG 2025 BDS seat allotment Telangana state quota?

-j ramaraoUpdated on October 06, 2025 12:07 PM
  • 1 Answer
Samiksha Rautela, Content Team

Dear Student, The Telangana NEET UG 2025 BDS seat allotment under the Competent Authority Quota has been conducted in multiple phases. The seat allotment results for the second phase has been released on October 4, 2025 Thank You

READ MORE...

I got 456 marks in the NEET exam with rank 112190 I belong to obc female candidate will I get seat in 2nd round?what will be fees ?

-sharvari ghunareUpdated on October 06, 2025 12:10 PM
  • 1 Answer
Samiksha Rautela, Content Team

Dear Student, The Telangana NEET UG 2025 BDS seat allotment under the Competent Authority Quota has been conducted in multiple phases. The seat allotment results for the second phase has been released on October 4, 2025 Thank You

READ MORE...

Is it compulsory to live in the hostel of Rajiv Lochan Ayurved Medical College and Hospital?

-Neha SahuUpdated on October 08, 2025 12:02 PM
  • 1 Answer
Lipi, Content Team

Dear Student, The Telangana NEET UG 2025 BDS seat allotment under the Competent Authority Quota has been conducted in multiple phases. The seat allotment results for the second phase has been released on October 4, 2025 Thank You

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్