తెలంగాణ MCA అడ్మిషన్ 2024 (Telangana MCA Admission 2024): అప్లికేషన్, అర్హత, సీట్ల కేటాయింపు
తెలంగాణ MCA అడ్మిషన్ (Telangana MCA Admission 2024) ప్రక్రియ TS ICET పరీక్షపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ MCA అడ్మిషన్ 2024 తేదీలు, రిజిస్ట్రేషన్, వెబ్ ఎంపికలు, సీట్ల కేటాయింపు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణ MCA అడ్మిషన్ 2024 (Telangana MCA Admission 2024): మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు, ఇది రెండేళ్ల కోర్సు. విద్యార్థుల్లో సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను పెంచడం, కంప్యూటర్ అప్లికేషన్ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం ఈ కోర్సు (Telangana MCA Admission 2024) ప్రధాన ఉద్దేశం. ఇదే ప్రాతిపదికన కోర్సులో ప్రవేశాలు జరుగుతాయి. దీని కోసం TS ICET ని (Telangana State Integrated Common Entrance Test Exam) నిర్వహిస్తారు. తెలంగాణలోని వివిధ కాలేజీల్లో MCA ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి (Telangana MCA Admission 2024) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు అనుబంధ కాలేజీల్లో MCA కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSICET) ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాష్ట్రస్థాయి పరీక్ష. TS ICET 2024 ఆన్‌లైన్‌లో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాన ఐసెట్ 2024 నోటిఫికేసన్ ఫ్రిబవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. TS ICET 2024 పరీక్ష రెండు స్లాట్‌లలో నిర్వహించబడుతుంది. ఉదయం స్లాట్ 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం స్లాట్ 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. MCA, MBA కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో మంచి ర్యాంకులు పొందిన అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
తెలంగాణ ఎంసీఏ అడ్మిషన్ 2024కి (Telangana MCA Admission 2024) సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, నమోదు, ప్రవేశ ప్రక్రియ, కాలేజీలు వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ MCA అడ్మిషన్ తేదీలు (Telangana MCA Admission 2024)
విద్యార్థుల కోసం తెలంగాణ MCA అడ్మిషన్ 2024కి (Telangana MCA Admission 2024) సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. TS ICET 2024 దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.450లు చెల్లించాలి.
ఈవెంట్స్ | తేదీలు |
TS ICET 2024 పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 దరఖాస్తు ప్రారంభ తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 రూ.500ల ఆలస్య రుసుముతో దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 రూ.2000ల ఆలస్య రుసుముతో దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 రూ.5000ల ఆలస్య రుసుముతో దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 రూ.10000ల లేట్ ఫీజుతో దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICEt 2024 హాల్ టికెట్ విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 ఫలితాల ప్రకటన తేదీ | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ నమోదు | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 సీట్ల కేటాయింపు | తెలియాల్సి ఉంది |
TS ICET 2024 అకడమిక్ సెషన్ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
తెలంగాణ MCA అడ్మిషన్‌కు అర్హతలు (Telangana MCA Admission Eligibility 2024)
తెలంగాణలో MCAలో చేరాలనుకునే అభ్యర్థులకు కచ్చితంగా ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
అభ్యర్థి తప్పనిసరిగా BCAలో గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సమానమైన డిగ్రీని పొంది ఉండాలి.
అభ్యర్థి కనీసం 60 శాతం మార్కులు సంపాదించి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
TS ICET 2024కు దరఖాస్తు చేసుకునే విధానం (How to Apply for TS ICET 2024)
ఎంసీఏలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా TS ICET 2024లో క్వాలిఫై అవ్వాలి. మంచి ర్యాంకులు పొందిన అభ్యర్థులకు మంచి కళాశాలల్లో సీటు లభ్యమవుతుంది. TS ICET 2024కు దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది.
- ముందుగా అభ్యర్థులు అధికారిక TS ICET వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో అప్లికేషన్ ఫీజు చెల్లింపు ఫీల్డ్‌లపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఫీజు చెల్లింపు తర్వాత అభ్యర్థులు పేమెంట్ స్టేటస్ ట్యాబ్‌ని చెక్ చేసుకోవాలి.
- అనంతరం ఓపెన్ అయ్యే దరఖాస్తు ఫార్మ్‌లో పేరు, అర్హత పరీక్ష హాల్ అడ్మిట్ కార్డ్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలతో దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
- 50 KB కంటే తక్కువ సైజ్ ఉన్న ఫోటోను jpg/ jpeg ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. సంతకం సైజ్ కోసం తప్పనిసరిగా jpg/ jpeg ఫార్మాట్‌లో 30 KB కంటే తక్కువ ఉండాలి.
- ఫైనల్‌గా ఒక్కసారి చెక్ చేసుకుని ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. భవిష్యత్తు అవరాల రీత్యా ఆ ప్రింట్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.
తెలంగాణ MCA కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 (Telangana MCA Counselling Registration 2024)
ఎంసీఏలో చేరాలనుకునే అభ్యర్థులు, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ సెషన్‌కు నమోదు చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
TS ICET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
మొదట అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1200, SC, ST కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.600లు చెల్లించాలి. దానికోసం అభ్యర్థులు TS ICET 2024 హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు పూర్తైన తర్వాత అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్‌లు బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం టైం, సెంటర్‌ని ఎంచుకోవాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తైన తర్వాత అభ్యర్థులు లాగిన్ ఐడీని పొందుతారు. దానిని ఉపయోగించి వారు మళ్లీ లాగిన్ అయి, OTP ధ్రువీకరణ ద్వారా పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాలి. మళ్లీ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
అభ్యర్థులు తమకు ఇష్టమైన కాలేజీలను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులు ఎంసీఏలో చేరేందుకు వీలుగా ఎక్కువ కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు.
భవిష్యత్తు అవసరాల నిమిత్తం సంబంధిత అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
తెలంగాణ ఎంసీఏ కనీస అర్హత మార్కులు (Telangana MCA Cutoff 2024)
ప్రవేశ పరీక్ష నిర్వహించిన తర్వాత అడ్మిషన్ అధికారులు కటాఫ్ మార్కుల వివరాలను విడుదల చేస్తారు. టీఎస్ ఐసీఈటీ కటాఫ్ (TS ICET Cutoff) అనేది నిర్దిష్ట కళాశాలలో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస అర్హత మార్కులను సూచిస్తుంది. ఆ కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ కటాఫ్ సీట్ల లభ్యత, పరీక్ష క్లిష్టత, పరీక్షలో అభ్యర్థుల పనితీరు, పరీక్ష రాసేవారి సంఖ్య, సీట్ల రిజర్వేషన్ మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కనీస అర్హత మార్కులు కింది పట్టికలో ఉన్నాయి...
కేటగిరి | కనీస అర్హత శాతం | కనీస అర్హత మార్కులు |
జనరల్, OBC | 25% | 200లో 50 |
SC/ST | కనీస అర్హత శాతం లేదు | కనీస అర్హత మార్కులు లేవు |
తెలంగాణ MCA సీట్ల కేటాయింపు (Telangana MCA Seat Allotment 2024)
కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రతి రౌండ్ తర్వాత, సీట్ల కేటాయింపు వివరాలు ప్రకటిస్తారు.ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్, విడుదలైన కటాఫ్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. తర్వాత అభ్యర్థులు సీటు అలాట్‌మెంట్‌ని అంగీకరించి సీటును నిర్ధారించుకోవాలి. సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికెట్లు, సంబంధిత డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. అనంతరం ఫీజు చెల్లించి కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాలి.
ఎంసీఏ కోర్సు గల తెలంగాణ కాలేజీల జాబితా (List of Partipatin Colleges for Telangana MCA Admission 2024)
TS ICET స్కోర్ ద్వారా MCA కోర్సులో అభ్యర్థులు జాయిన్ అయ్యేందుకు తెలంగాణలో కొన్ని కళాశాలలు అవకాశం కల్పిస్తున్నాయి. సంబంధిత కాలేజీల వివరాలు కింద ఉన్నాయి.
వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ |
దేశంలోని టాప్ కాలేజీల్లో ఎంసీఏ కోర్సు (Top Colleges in India for MCA Admission 2024)
భారతదేశంలోని పలు పెద్ద కాలేజీల్లో కూడా ఎంసీఏ కోర్సు అందుబాటులో ఉంది. ఆ కళాశాలల్లో కూడా అభ్యర్థులు చేరొచ్చు.. ఆ కాలేజీల వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది.
కళాశాల పేరు | స్థానం |
నోయిడా | |
జలంధర్ | |
చండీగఢ్ | |
విశాఖపట్నం | |
గ్రేటర్ నోయిడా | |
జైపూర్ |
ఇతర సంబంధిత కథనాలు,
MCA Admissions - Dates, Entrance Exams, Application Form, Direct Admission, Eligibility | |
Best Career Options after MCA - Scope, Job Options, Courses after MCA | |
MCA అడ్మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం, కాలేజ్ దేఖోను చూస్తూ ఉండండి.