తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్లు 2024 (Telangana Polytechnic Admission 2024 )- ముఖ్యమైన తేదీలు, ప్రవేశ పరీక్ష, దరఖాస్తు, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024(Telangana Polytechnic Admission 2024 )కు SBTET నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 2024 మే నెలలో పాలిసెట్ పరీక్ష జరగనుంది, అడ్మిషన్ ప్రాసెస్, కౌన్సెలింగ్ తేదీలు కటాఫ్ మార్కుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024 (Telangana Polytechnic Admission 2024): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ( SBTET) తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ అడ్మిషన్ లను నిర్వహిస్తుంది. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి TS POLYCET ఎంట్రన్స్ పరీక్ష లో అర్హత పొందిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు.తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 2024 మే నెలలో జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్లు 2024(Telangana Polytechnic Admission 2024)జూన్ నెలలో ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో ఉన్న పాలిటెక్నిక్ సీట్లను ఈ అడ్మిషన్ ద్వారా విద్యార్థులకు కేటాయిస్తారు. TS POLYCET లో కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులు పాలిటెక్నిక్ లో తమకు నచ్చిన స్ట్రీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. విద్యార్థి రాంక్ మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అప్లై చేసుకున్న వారికి అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
విద్యార్థులు తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024(Telangana Polytechnic Admission 2024) కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న విద్యార్థులకు వారు సాధించిన రాంక్ ను బట్టి రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలలో విద్యార్థులకు అడ్మిషన్ లభిస్తుంది. తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024నోటిఫికేషన్, దరఖాస్తు విధానం, కౌన్సెలింగ్ విధానం మరియు ఇతర ముఖ్యమైన తేదీలు అన్నీ ఈ ఆర్టికల్ లో వివరించబడ్డాయి.
సంబంధిత లింక్‌లు
TS POLYCET 2024లో మంచి ర్యాంక్ ఎంత? |
టీఎస్ పాలిసెట్ ర్యాంకులను అంగీకరించే కాలేజీల జాబితా |
TS POLYCET 2024లో 10,000 నుండి 25,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా |
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ తేదీలు 2023(TS Polytechnic Admission Dates 2023)
తెలంగాణ పాలిటెక్నిక్ 2024విద్యార్థుల అడ్మిషన్(Telangana Polytechnic Admission 2024) మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టిక లో గమనించవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
TS పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023 ప్రారంభం | తెలియాల్సి ఉంది. |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది. |
ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (INR 100) | తెలియాల్సి ఉంది. |
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది. |
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితం | తెలియాల్సి ఉంది. |
TS POLYCET 2023 కౌన్సెలింగ్ ఫేజ్ 1 | తెలియాల్సి ఉంది. |
TS POLYCET కౌన్సెలింగ్ ఫేజ్ 1 కోసం వెబ్ అషన్స్ | తెలియాల్సి ఉంది. |
TS పాలిసెట్ సీటు కేటాయింపు | తెలియాల్సి ఉంది. |
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్‌లో సమాచారం నింపడం, ఫీజు చెల్లింపు మరియు స్లాట్ బుకింగ్ ఫేజ్ 2 | తెలియాల్సి ఉంది. |
తుది దశకు సీట్ల కేటాయింపు ఫేజ్ 2 | తెలియాల్సి ఉంది. |
కేటాయించిన కళాశాలకు నివేదించడం | తెలియాల్సి ఉంది. |
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ అర్హత ప్రమాణాలు 2024(Eligibility Criteria for Telangana Polytechnic Admissions 2024)
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024(Telangana Polytechnic Admission 2024) కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ క్రింద సూచించబడిన ప్రమాణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి , లేనిచో వారి అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.
- తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం అప్లై చేసే విద్యార్థులు తప్పని సరిగా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి.
- తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. CBSE, ICSE, NIOS, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ( TOSS) , ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) విద్యార్థులు కూడా తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024కు అప్లై చేసుకోవచ్చు.
- 10వ తరగతిలో విద్యార్థులు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి.
- NIOS/TOSS/APOSS/CBSE/ICSE మరియు ఇతర బోర్డు విద్యార్థులు కూడా తప్పని సరిగా 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రస్తుత విద్యా సంవత్సరం ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా తెలంగాణ పాలిటెక్నిక్ కు అప్లై చేసుకోవచ్చు.
- తెలంగాణ POLYCET కు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మాత్రం ఏజ్ లిమిట్ వర్తిస్తుంది.
TS POLYCET ద్వారా అడ్మిషన్ అందించే కళాశాలల జాబితా | TS POLYCET 2024 ఉత్తీర్ణత మార్కులు |
TS POLYCET లో మంచి స్కోరు ఎంత? | TS POLYCET 2024 సిలబస్ |
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ ప్రాసెస్ 2024(TS Polytechnic Admission Process 2024)
తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2024(Telangana Polytechnic Admission 2024)కోసం విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించాలి.
స్టెప్ 1 : TS POLYCET 2024అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : " File Application" ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
స్టెప్ 3 : 10వ తరగతి పరీక్ష వివరాలను పూర్తి చెయ్యాలి.
స్టెప్ 4 : తర్వాత " Show Application" మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 5 : POLYCET అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ పూర్తి చేయాలి.
స్టెప్ 6 : అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
స్టెప్ 7 : రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి , రసీదు ను మరియు పూర్తి చేసిన అప్లికేషన్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలంగాణ POLYCET 2024దరఖాస్తు ఫీజు (TS POLYCET 2024 Application Fee)
తెలంగాణ POLYCET కు దరఖాస్తు ఫీజు విద్యార్థుల యొక్క కేటగిరీ ప్రకారంగా క్రింది పట్టిక లో వివరించబడింది.
కేటగిరీ | ఫీజు |
SC మరియు ST అభ్యర్థులకు | రూ. 250/- |
ఇతర అభ్యర్థి కోసం | రూ. 450/- |
తెలంగాణ పాలిటెక్నిక్ హాల్ టిక్కెట్లు 2024(Telangana Polytechnic Hall Ticket 2024)
తెలంగాణ POLYCET 2024కు అప్లై చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ polycetts.nic.in ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే హాల్ టిక్కెట్లు విడుదల చేయబడతాయి. హాల్ టికెట్ లేకపోటే విద్యార్థులను తెలంగాణ POLYCET 2024పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ మీద విద్యార్థి పేరు, హాల్ టికెట్ నెంబర్, పరీక్ష తేదీ,పరీక్ష కేంద్రం మొదలైన సమాచారం ఉంటుంది.
తెలంగాణ పాలిటెక్నిక్ ఫలితాలు 2024(Telangana Polytechnic Result 2024)
తెలంగాణ POLYCET 2024ఫలితాలను SBTET అధికారిక వెబ్సైట్ polycetts.nic.in లో విడుదల చేస్తారు. తెలంగాణ POLYCET ఫలితాలు జూలై నెలలో విడుదల అవుతాయి. ఈ ఫలితాలలో విద్యార్థులు సాధించిన రాంక్ ప్రకారం వారికి తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ లభిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు వారి రాంక్ ప్రకారం కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాలి.
తెలంగాణ పాలిటెక్నిక్ కట్ ఆఫ్ 2024(Telangana Polytechnic Cutoff 2024)
TS POLYCET ఫలితాలలో పాటు కట్ ఆఫ్ మార్కులను కూడా అధికారులు విడుదల చేస్తారు. ఎంట్రన్స్ పరీక్ష వ్రాసిన విద్యార్థుల సంఖ్య మరియు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ను అనుసరించి కట్ ఆఫ్ మార్కులను నిర్ధారిస్తారు. కట్ ఆఫ్ మార్కులు సాధించిన విద్యార్థులు తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్ పొందుతారు.
తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ విధానం 2024(Telangana Polytechnic Counselling Process 2024)
తెలంగాణ POLYCET ఫలితాలు విడుదల చేసిన తర్వాత విద్యార్థులకు వచ్చిన రాంక్ ను బట్టి వారికి నిర్దేశించిన తేదీలలో కౌన్సెలింగ్ జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన స్టెప్స్ లో విద్యార్థులు కౌన్సెలింగ్ విధానం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.
స్టెప్ 1 : రిజిస్ట్రేషన్ ( Registration)
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కు రిజిష్టర్ చేసుకోవాలి, ఈ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు వారికి కేటాయించిన ఫీజు చెల్లించాలి. ( జనరల్ విద్యార్థులకు 800/- SC/ST విద్యార్థులకు 600/- రూపాయలు)
స్టెప్ 2 : సర్టిఫికెట్ వెరిఫికేషన్ ( Certificate Verification)
విద్యార్థులకు కేటాయించిన తేదీలలో వారి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కు సంబంధిత కౌన్సెలింగ్ కేంద్రం కు వెళ్ళాలి. అక్కడ అధికారులు విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు.
స్టెప్ 3 : వెబ్ ఆప్షన్స్ నమోదు ( Web Options)
విద్యార్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేసిన తర్వాత వారికి లాగిన్ ఐడీ ఇవ్వబడుతుంది. విద్యార్థుల రాంక్ ప్రకారంగా వారికి ఇచ్చిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.
స్టెప్ 4 : సీట్ల కేటాయింపు ( Seat Allotment)
విద్యార్థులు వారి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసిన తర్వాత కొద్ది రోజులలో వారికి సీట్ కేటాయించబడుతుంది. విద్యార్థులకు సీట్ కేటాయించిన కళాశాల ను బట్టి వారి ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
స్టెప్ 5 : కాలేజీలో రిపోర్ట్ చేయడం ( Reporting in College)
విద్యార్థులు వారికి ఇచ్చిన గడువు లోపు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఒకవేళ విద్యార్థులు నిర్ణీత గడువు లోపుగా కాలేజీ లో రిపోర్ట్ చేయకపోతే వారి సీట్ కాన్సిల్ చేయబడతాయి.
స్టెప్ 6 : క్లాసులు ప్రారంభం ( Commencement of Classes)
కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యాక విద్యార్థులకు తెలంగాణ పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం అవుతాయి.
సంబంధిత లింకులు
తెలంగాణా పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం CollegeDekho ను చూస్తూ ఉండండి.