TSRJC CET ఫలితాలు 2025 ( TSRJC CET Results 2025) : విడుదల తేదీ మరియు సమయం, లింక్, కౌన్సెలింగ్ ప్రక్రియ
TSRJC CET 2025 ఫలితాలు మే నెల చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది, విద్యార్థులు ఫలితాల విడుదల తేదీ, సమయం, డైరెక్ట్ లింక్ మొదలైన వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
TSRJC CET ఫలితాలు 2025 ( TSRJC CET Results 2025) : TSRJC 2024 పరీక్ష మే 2025 నెలలో జరుగుతుంది.. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఉన్న దాదాపు 3000 సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం లో మొత్తం 35 TSRJC కళాశాలలు ఉన్నాయి. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా మిగతా 15 బాలుర కళాశాలలు. విద్యార్థులకు ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ MPC, BiPC , MEC కోర్సులు అందుబాటులో ఉన్నాయి. TSRJC 2025 పరీక్ష ద్వారా ఈ కళాశాలలో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు విద్య మరియు వసతి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ఈరోజు పూర్తి అయిన TSRJC CET 2025 పరీక్ష ఫలితాలు మరో రెండు వారాలలో విడుదల కానున్నాయి.
TSRJC CET 2025 ఫలితాలు ముఖ్యమైన తేదీలు ( TSRJC CET 2025 Important Dates)
TSRJC CET 2025 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీలు |
---|---|
TSRJC CET పరీక్ష | మే 2025 |
TSRJC CET ఆన్సర్ కీ | మే 2025 |
TSRJC CET ఫలితాలు | మే మొదటి వారం 2025 |
TSRJC CET కటాఫ్ విడుదల | మే మొదటి వారం 2025 |
TSRJC CET కౌన్సెలింగ్ | మే చివరి వారం 2025 |
TSRJC CET తరగతుల ప్రారంభం | జూన్ రెండవ వారం 2025 |
TSRJC CET 2025 ద్వారా అందించే కోర్సులు (Courses Offered by TSRJCs through TSRJC CET 2025)
తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (TSRJC) ఈ కింద తెలియజేసిన కోర్సులని అందిస్తాయి. ఎంపిక చేయబడిన విద్యార్థులు ఈ కోర్సులకి అడ్మిషన్ మంజూరు చేయబడతారు. అడ్మిషన్‌కి కోర్సు ఫీజు లేదు. TSRJC క్రింది కోర్సులుని ఇంగ్లీష్ మీడియంలో అందిస్తుంది -
- CEC – సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్
- MEC – మ్యాథ్స్, ఆర్థిక శాస్త్రం, కామర్స్
- BPC - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- MPC - మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం
TSRJC CET కటాఫ్ 2025 ( TSRJC CET 2025 Cut Off )
10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఉచితంగా విద్య మరియు వసతి అందించే కళాశాలలు కాబట్టి సాధారణంగా TSRJC కళాశాలల్లో అడ్మిషన్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే TSRJC CET 2025 కటాఫ్ కళాశాలను బట్టి , విద్యార్థుల జెండర్ ను బట్టి మరియు కేటగిరీ ను బట్టి మారుతూ ఉంటుంది. కళాశాలకు సంబంధించిన కటాఫ్ సాధించిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. అధికారులు TSRJC CET 2025 కటాఫ్ ను విడుదల చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది.
కేటగిరీ | TSRJC CET 2025 కటాఫ్ |
---|---|
జనరల్ | తెలియాల్సి ఉంది |
BC | తెలియాల్సి ఉంది |
SC / ST | తెలియాల్సి ఉంది |
TSRJC CET 2025 ఆన్సర్ కీ (TSRJC CET 2025 Answer Key)
TSRJC CET 2025 ఆన్సర్ కీ సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్సర్ కీని చెక్ చేయవచ్చు. అసలు ఫలితం రాకముందే అభ్యర్థి మార్కులను అంచనా వేయడానికి ఆన్సర్ కీ సహాయపడుతుంది.
TSRJC CET 2025 కౌన్సెలింగ్ ( TSRJC CET 2025 Counselling )
TSRJC CET 2025 ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థుల ర్యాంక్ ప్రకారంగా కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ కౌన్సెలింగ్ రెండు దశల్లో జరుగుతుంది, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి TSRJC CET 2025 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి వీలవుతుంది. TSRJC CET 2025 కౌన్సెలింగ్ మే నెల చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. కౌన్సెలింగ్ లో పాల్గొనే విద్యార్థులు వారి సెర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేపించాలి, తర్వాత ఛాయిస్ ఫిల్లింగ్ ద్వారా వారికి కేటాయించిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ పూరించాలి. తర్వాత విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువు లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
TSRJC CET 2025 పరీక్ష గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి CollegeDekho ను ఫాలో అవ్వండి.