ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024
విశాఖపట్నం ఆంధ్రామెడికల్ కాలేజ్ నీట్ కటాఫ్ (Andhra Medical College Visakhapatnam NEET MBBS Expected Cutoff 2024) వివరాలను అంచనాగా ఇక్కడ అందించాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ పట్టికను తయారు చేయడం జరిగింది.
ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 20245 (Andhra Medical College Visakhapatnam NEET MBBS Expected Cutoff 2024) : NEET 2024 సవరించిన స్కోర్ కార్డులు కూడా విడుదలయ్యాయి. నీట్ 2024 ఎండీఎస్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది విద్యార్థులు ఆంధ్రామెడికల్ కాలేజ్, విశాఖపట్నంలో సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ కాలేజీలో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఆ కాలేజీలో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులకు సాధించాల్సిన కటాఫ్ మార్కులు ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థుల ఆంధ్రామెడికల్ కాలేజీ, విశాఖపట్నంలో NEET Expected Cutoff 2024ని అంచనా అందించాం. అయితే ఇది వాస్తవ కటాఫ్ కాదని అభ్యర్థులు గమనించాలి. నిజమైన కటాఫ్‌ని కాలేజీ త్వరలో విడుదల చేస్తుంది. విద్యార్థులకు అవగాహన కోసం అంచనాగా ఇక్కడ కటాఫ్‌ని అందిస్తున్నాం.
ఆంధ్రామెడికల్ కళాశాల, విశాఖపట్నం నీట్ అంచనా కటాఫ్ 2024 (Andhra Medical College Visakhapatnam NEET MBBS Expected Cutoff 2024)
విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్ చాలా ప్రముఖమైనది. చాలామంది అభ్యర్థులు ఈ కళాశాలలో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. మరి ఈ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా ఇస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం ఏపీ నీట్ 2024 అంచనా కటాఫ్ స్కోర్ |
OC | 621 నుంచి 577 |
EWS | 600 నుంచి 533 |
BC | 612 నుంచి 531 |
SC | 540 నుంచి 483 |
ST | 550 నుంచి 490 |
NEET ఎంబీబీఎస్ ఫలితం 2024తో పాటు NEET కటాఫ్ 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.inలో ప్రకటిస్తుంది. కాగా 2022-23 విద్యా సంవత్సరంలో, మొత్తం 56.21% మంది అభ్యర్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.