Andhra Pradesh NEET Counselling Date 2023: ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?
AP NEET కౌన్సెలింగ్ ప్రక్రియ (Andhra Pradesh NEET Counselling Date 2023) జూలై 2023 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇక్కడ అర్హత ప్రమాణాలు,కేటగిరీల కోసం అంచనా రిజిస్ట్రేషన్ ఫీజులను చెక్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సెలింగ్ డేట్ 2023 (Andhra Pradesh NEET Counselling Date 2023): డా. YSR విశ్వవిద్యాలయం MBBS/ BDS/ BAMS/ BUMS/ BHMS 85% రాష్ట్ర కోటా సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ NEET కౌన్సెలింగ్ 2023ని నిర్వహిస్తుంది. ఇది జూలై 2023 మధ్యలో నిర్వహించే ఛాన్స్ ఉంది. AP NEET కౌన్సెలింగ్ తేదీ ని అధికారం ఇంకా ప్రకటించ లేదు. గత సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అంచనా సమయం ఇక్కడ అందజేయడం జరిగింది. ఏపీ నీట్ కౌన్సెలింగ్ రెండు రౌండ్లలో జరగనుంది.
అర్హత ఉన్న, కౌన్సెలింగ్ ప్రక్రియలో హాజరు కావాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దాంతోపాటు వారు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. కౌన్సెలింగ్ ముగింపులో అడ్మిషన్‌కి సంబంధించి విద్యార్థులు పూరించిన ఎంపికల ఆధారంగా (వారి ప్రాధాన్యతల ప్రకారం) అలాగే NEET 2023 మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
l NEET 2023 Result Live Updates కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సెలింగ్ 2023: అర్హత ప్రమాణాలు (Andhra Pradesh NEET Counseling 2023: Eligibility Criteria)
అభ్యర్థులు AP NEET కౌన్సెలింగ్ 2023 అర్హత ప్రమాణాలను ఇక్కడ చూడవచ్చు-
- అభ్యర్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించాలి. అభ్యర్థుల కనీస వయస్సు డిసెంబర్ 2023 నాటికి కనీసం 17 సంవత్సరాలు ఉండాలి
- అభ్యర్థులు MBBS/ BDS కోర్సులకి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే PCB/ బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థులు BAMS/ BHMS/ BUMS కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు జువాలజీ, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి (ఐచ్ఛికంగా, ఇది ప్రాక్టికల్ పరీక్షను కలిగి ఉంటుంది).
ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సెలింగ్ 2023: రిజిస్ట్రేషన్ ఫీజు (Andhra Pradesh NEET Counseling 2023: Registration Fee)
మునుపటి సంవత్సరం ఫీజు నిర్మాణాన్ని పరిశీలిస్తే 2023కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు ఇక్కడ హైలైట్ చేయబడ్డాయి-
కేటగిరి | ఫీజులు |
జనరల్/OBC | రూ. 2950 |
SC/ST | రూ. 2360 |
ఇది కూడా చదవండి
నీట్ 2023 పరీక్షా ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ నీట్ 2023 టాపర్స్ లిస్ట్
తెలంగాణ నీట్ 2023 టాపర్స్ లిస్ట్
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.