ఏపీ పాఠశాలల టైమింగ్స్‌లో మార్పులు, ఇక నుంచి 5 గంటల వరకు స్కూల్ (Andhra Pradesh School Timings Changed)
ఆంధప్రదేశ్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు (Andhra Pradesh School Timings Changed) జరిగాయి. ఇక నుంచి సాయంత్రం 5 గంట వరకు విద్యార్థులు స్కూల్లో ఉండాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు (Andhra Pradesh School Timings Changed) : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల టైమింగ్స్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ పాఠశాలలకు కొత్త టైమ్ టేబుల్‌ను (Andhra Pradesh School Timings Changed) విడుదల చేసింది. దీని ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లు పని చేయనున్నాయి. పాత షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నడుస్తున్నాయి. ఇప్పడు విద్యాశాఖ సాయంత్రం 5 గంటల వరకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే విద్యాశాఖ ఈ మార్పును ముందుగా హైస్కూల్స్‌లో అమలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న పని వేళల కంటే అదనంగా ఓ గంట పెరగనుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడం జరుగుతుంది. అంటే నవంబర్ 30 వరకు ఎంపిక చేసిన రెండు స్కూల్స్‌లో అమలు చేస్తారు. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయాన్ని ఐదు నిమిషాలు చొప్పున, భోజన విరామాన్ని 5 నిమిషాలకు పెంచడ జరిగింది. అదేవిధంగా మార్నింగ్ ఫస్ట్ పిరియిడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు తర్వాత మూడు పీరియడ్లను 5 నిమిషాలు చొప్పున పెంచారు. అంటే ఒక్క పిరియడ్ 45 నిమిషాలు ఉంటుంది.
అయితే పాఠశాలలు పని వేళలు (Andhra Pradesh School Timings Changed) పెంచిన నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమౌతుంది. మరో గంట అదనంగా పని చేయాల్సి రావడం, విద్యార్థులు అలసిపోతారనే కారణంతో ఈ నిర్ణయాన్ని ఎక్కువ మంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.
పని వేళలు పొడిగింపు నిర్ణయాన్ని అధికారులు వెర్షన్ వేరేలా ఉంది.కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం ఎక్కువ పొడిగించామని వారు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని పాఠశాలల్లో దీనిని అమలు చేసి అందులోని సాదక బాధకాలను పరిశీలించి ఆ టోటల్ రిపోర్టుని ఈ నెల 30న విద్యాఖ డైరెక్టరేట్‌కి అధికారులు తెలియజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ టైమింగ్స్‌పై (Andhra Pradesh School Timings Changed) నిర్ణయం తీసుకోనున్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్లను ఇక్కడ పొందండి. తెలుగులో ఎడ్యుకేషన్, జాబ్‌లకు సంబంధించిన వార్తలను ఇక్కడ అందించడం జరుగుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.