AP Anganwadi Jobs: మహిళలకు శుభవార్త, పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, చివరి తేదీ ఎప్పుడంటే?
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల గురించి ఈ ఆర్టికల్లో అందజేశాం.
ఏపీ అంగన్‌వాడీ ఉద్యోగాలు (AP Anganwadi Jobs): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల పోస్టుల (AP Anganwadi Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 47 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి (AP Anganwadi Jobs) కేవలం మహిళల మాత్రమే అర్హులు. ఏప్రిల్ 3వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏ అర్హతలుండాలో? ఇక్కడ తెలియజేయడం జరిగింది.
అంగన్‌వాడీ పోస్టుల పోస్టుల సంఖ్య (Anganwadi Posts)
విశాఖపట్నం జిల్లాలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.పోస్టులు | సంఖ్య |
అంగన్‌వాడీ కార్యకర్త | 05 |
అంగన్‌వాడీ సహాయకురాలు | 42 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 3, 2023 |
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Qualifications required for anganwadi jobs)
అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
- కచ్చితంగా వివాహితై ఉండాలి
- పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. జూలై ఒకటి, 2022 నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం (How to Apply for Anganwadi Posts)
ఈ ఉద్యోగాలకు మహిళలు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాలి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలను దరఖాస్తు ఫార్మ్‌లో పూరించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలని జత చేసి దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి అప్లికేషన్‌లు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికైన వారికి జీతం (Salary for selected Anganwadi posts)
అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం అందజేయడం జరుగుతుంది. జీతభత్యాలు వివరాలు ఈ దిగువున వివరంగా తెలియజేయడం జరిగింది.పోస్టులు | జీతం |
అంగన్‌వాడీ వర్కర్ | రూ.11,500 |
మినీ అంగన్‌వాడీ వర్కర్ | రూ.7000 |
అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు | రూ.7000 |
అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఈ https://visakhapatnam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.