ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) : 10,000 సీట్ల తగ్గింపు, ఎందుకంటే?
ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) కు ప్రభుత్వం 10,000 సీట్లను తగ్గించింది. ప్రస్తుతం 23,970 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బీఈడీ అడ్మిషన్ సీట్లకు సంబంధించిన మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 ( AP B.ED Admission 2022) : ఆంధ్రప్రదేశ్ బీఈడీ కౌన్సెలింగ్ జనవరి 25వ తేదీ నుండి ప్రారంభం అయ్యింది. అయితే ఈ విద్య సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కంటే దాదాపు 10,000 సీట్లను తగ్గించింది. గత సంవత్సరం నిర్వహించిన ఏపీ బీఈడీ కౌన్సెలింగ్ లో 34,760 సీట్లు ఉండగా ఈ సంవత్సరం సీట్ల సంఖ్య 23,970 కు తగ్గిపోయింది. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో అర్హత కలిగిన ప్రొఫెసర్లు లేకపోవడం మరియు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆ కళాశాలలు విఫలం అవ్వడంతో సుమారు 120 కళాశాలల అనుమతులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) అధికారికంగా రద్దు చేసింది. దీంతో బీఈడీ సీట్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది.
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ పరీక్ష తేదీలు
ఏపీ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్( AP B.ED Admission 2022) ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) శ్రీ వేంకటేశ్వర యునివర్సిటీ ద్వారా నిర్వహిస్తుంది. బీఈడీ లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు AP EDCET పరీక్ష కు హాజరు అవ్వాల్సి ఉంటుంది. బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు AP DSC పరీక్ష క్రాక్ చేయడం ద్వారా గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం సాధించవచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఉద్యోగం సాధించవచ్చు.
ఇవి కూడా చదవండి - ఏపీ EDCET 2023 దరఖాస్తు తేదీలు
ఏపీ బీఈడీ కళాశాలల్లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఉపాద్యాయులు రెండు , మూడు కళాశాలల్లో పని చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం తో ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేశారు. పైగా ప్రతీ సంవత్సరం బీఈడీ కోర్సులో( AP B.ED Admission 2022) జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. కన్వీనర్ కోటా లో విడుదల చేసిన సీట్లలో 30% సీట్లు కూడా భర్తీ కావడం లేదు. పైన ఉన్న అన్ని కారణాలను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుని ఏపీ బీఈడీ అడ్మిషన్ 2022 (AP B.ED Admission 2022)కు సీట్ల సంఖ్య ను తగ్గించింది. ఏపీ బీఈడీ 2023 కు అప్లై చేసుకునే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.
ఇవి కూడా చదవండి - ఏపీ ఈసెట్ లేటెస్ట్ అప్డేట్స్
ఏపీ బీఈడీ గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.