AP EAMCET Rank Card 2023: నేరుగా AP EAMCET ర్యాంక్ కార్డును ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023ని (AP EAMCET Rank Card 2023) డౌన్‌లోడ్ చేయడానికి అధికారిక లింక్‌ని అధికారికి వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది. అధికారులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి తమ ర్యాంక్ కార్డును పొందవచ్చు.
AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023 (AP EAMCET Rank Card 2023): AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023 (AP EAMCET Rank Card 2023) ఈరోజు (జూన్ 14న) ఉదయం 10:30 తర్వాత విడుదలైంది. ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ అందజేశాం. ఈ సంవత్సరం AP EAMCETలో ఇంటర్మీడియట్ మార్కులకి 25% వెయిటేజీ ఉంది. EAMCET ఫైనల్ ఫలితం 75% మార్కులు వెయిటేజీ, ఇంటర్మీడియట్ కోసం వెయిటేజీ మార్కులు (MPC/ BPC)పై ఆధారపడి ఉంటుంది. AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ AP EAMCET అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
AP EAMCET 2023 ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ (AP EAMCET 2023 Rank Card Download Link)
అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేయబడిన విధంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌ల కోసం ఈ కింది AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023 లింక్‌ని చెక్ చేయవచ్చు.
AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023 డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైన వివరాలు (Necessary details to download AP EAMCET Rank Card 2023)
అభ్యర్థులు తమ AP EAMCET ర్యాంక్ కార్డ్ 2023ని చెక్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది వివరాలు అవసరం:
AP EAMCET2023 అప్లికేషన్ ID/నెంబర్
హాల్ టికెట్ నెంబర్
పుట్టిన తేదీ
గమనిక: అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఏ అభ్యర్థి అయినా వారి ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయలేకపోతే లేదా యాక్సెస్ చేయలేకపోతే తగినంత వివరాలు లోపం కారణంగా అధికారులు వాటిని నిలిపివేయవచ్చు. అటువంటి సందర్భాలలో, అభ్యర్థులు వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి.
AP EAMCET2023కి సంబంధించి లేటెస్ట్ Education News అప్‌డేట్‌ల కోసం, కాలేజ్‌దేఖోను సందర్శిస్తూ ఉండండి!