AP EAMCET 2023 Results Released: ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు ఈరోజు రిలీజ్ (AP EAMCET 2023 Results Released) అయ్యాయి. డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అందజేశాం. లేదంటే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదల (AP EAMCET 2023 Results Released): ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు (AP EAMCET 2023 Results Released) ఈరోజు విడుదలయ్యాయి. మే నెలలో జరిగిన అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల కోసం ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష జరిగింది. ఈ ఫలితాలను జేఎన్‌టీయూ నేడు విడుదల చేసింది. ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ని సందర్శించాలి. AP EAMCET 2023 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను దగ్గర పెట్టుకోవాలి. వాటి ద్వారా AP EAMCET 2023 ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.
ఏపీ ఎంసెట్ 2023 ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల - డైరక్ట్ లింక్ |
ఏపీ ఎంసెట్ 2023 అగ్రికల్చర్ ఫలితాలు విడుదల - డైరక్ట్ లింక్ |
ఏపీ ఎంసెట్ ఫలితాలు 2023 ఓవర్ వ్యూ (AP EAMCET Result 2023 Overview)
AP EAMCET 2023 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడండి.పరీక్ష పేరు | AP EAMCET 2023 |
పూర్తి పేరు | ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |
కండక్టింగ్ అథారిటీ | జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ (JNTU) |
ఎగ్జామ్ టైప్ | ఎంట్రన్స్ టెస్ట్ |
ఫ్రీక్వెన్సీ | సంవత్సరానికి ఒకసారి |
లెవల్ | స్టేట్ లెవల్ |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ డేట్ | మే 15 నుంచి 19 2023 |
ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్ డేట్ | మే 22 నుంచి 23 2023 |
అధికారిక వెబ్‌సైట్ | cets.apsche.ap.gov.in |
AP EAMCET 2023 ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Online AP EAMCET Result 2023)
AP EMACET ఫలితం 2023 ప్రకటించిన తర్వాత విద్యార్థులు ఈ దిగువ ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.- దశ 1: AP EMACET అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో డౌన్‌లోడ్ చేయాలి.
- దశ 2: వెబ్‌పేజీలో 'Results' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- దశ 3: 'AP EAMCET ఫలితం 2023' అని చెప్పే లింక్‌పై క్లిక్ చేయండి.
- దశ 4: అవసరమైన ఫీల్డ్‌లలో మీ రోల్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను పూరించండి.
- దశ 5: 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి.
- దశ 6: తదుపరి స్క్రీన్‌లో మీ AP EAMCET ఫలితం 2023 ప్రదర్శించబడుతుంది.
- దశ 7: భవిష్యత్తు సూచన కోసం మీ AP EAMCET ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలపై ఉండే వివరాలు (Details in AP EAMCET Result 2023)
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయో? లేదో? కచ్చితంగా చెక్ చేసుకోవాలి.- అభ్యర్థి పేరు
- జెండర్
- కేటగిరి
- తండ్రి పేరు
- రాష్ట్రం
- అడ్మిట్ కార్డు నెంబర్
- స్ట్రీమ్
- రిజిస్ట్రేషన్ నెంబర్
- స్కోర్ చేసిన మార్కులు
- పర్సంటేజ్
- ర్యాంక్
- రిజల్ట్స్ స్టేటస్