AP ECET Application Form 2023 Dates: ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు విడుదల, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే?
ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 (AP ECET Application Form 2023 Dates) మార్చి 10న విడుదల అవుతుందని APSCHE వెల్లడించింది. సిలబస్‌తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది.
AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023 తేదీ (AP ECET Application Form 2023 Dates): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023ని (AP ECET Application Form 2023 Date) మార్చి 10న విడుదల చేయనున్నట్టు ధ్రువీకరించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP ECET 2023 కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి వివిధ దశలను అభ్యర్థులు ఫాలో అవ్వాలి. మొదట దరఖాస్తు ఫీజు చెల్లించాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి ఫోటోను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. AP ECET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి లింక్ cets.apsche.ap.gov.inలో యాక్టివేట్ చేయబడుతుంది.
AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET Application Form 2023 Dates)
AP ECET అప్లికేషన్ ఫార్మ్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేశాం.ఈవెంట్ | తేదీలు |
అధికారిక నోటిఫికేషన్ విడుదల | మార్చి 8, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ విడుదల | మార్చి 10, 2023 |
ఆలస్య రుసుము లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 10, 2023 |
ఆలస్య రుసుము రూ.500లతో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 11 నుంచి 15, 2023 వరకు |
ఆలస్య రుసుము రూ.2,000తో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 16 నుంచి 19, 2023 వరకు |
ఆలస్య రుసుము రూ.5,000లతో అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | ఏప్రిల్ 20 నుంచి 24, 2023 |
హాల్ టికెట్ విడుదల | ఏప్రిల్ 28, 2023 |
AP ECET 2023 మే 5న నిర్వహించడం జరుగుతుంది. ఈసెట్ 2023 పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద డైరెక్ట్ సెకండ్ ఇయర్ B.Tech కోర్సులో అడ్మిషన్‌కి AP ECET ర్యాంక్ తప్పనిసరి అని అభ్యర్థులు గుర్తించాలి. కన్వీనర్ (రాష్ట్ర) కోటా కింద అన్ని సీట్లు AP ECET కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయబడతాయి. కాబట్టి, అర్హులైన ఔత్సాహిక అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
లేటెస్ట్ Education News కోసం College Dekhoని చూస్తూ ఉండండి. మాకు ఈ-మెయిల్ ID news@collegedekho.com చేయడం ద్వారా మీ సందేహాలను తీర్చుకోవచ్చు.