ఏపీ ఎడ్‌సెట్ 2022 సీట్ల కేటాయింపు (AP EDCET 2022 Seat Allotment) లిస్ట్ జనవరి 30న విడుదల: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
ఏపీ ఎడ్‌సెట్ 2022 సీట్ల కేటాయింపు జాబితా (AP EDCET 2022 Seat Allotment) జనవరి 30న విడుదల కానుంది. సీట్ల అలాట్‌మెంట్ లిస్ట్‌ను ఎలా చెక్ చేసుకోవాలో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
AP EDCET 2022 సీట్ల కేటాయింపు (AP EDCET 2022 Seat Allotment): ఏపీ ఎడ్‌సెట్ 2023 సీట్ల కేటాయింపు (AP EDCET 2022 Seat Allotment)జాబితా జనవరి 30న విడుదల కానుంది. కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు జాబితా edcet-sche.aptonline.inలో విడుదల చేయడం జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థులు జనవరి 31, 2023 నుంచి ఫిబ్రవరి 3వ తేదీలోపు నిర్దేశిత కాలేజీల్లో హాజరు కావాలి.
AP EDCET 2023 సీట్ల కేటాయింపు లిస్ట్ (AP EDCET 2022 Seat Allotment) నవంబర్ 14, 2022న విడుదల అవ్వాలి. కానీ కండక్టింగ్ అథారిటీ వాయిదా వేసింది. AP EDCET 2022 ఫలితాలు ఆగస్టు 6న ప్రకటించగా కౌన్సెలింగ్ అక్టోబర్ 22న ప్రారంభమైంది. ప్రస్తుతం సీట్ల కేటాయింపు జాబితా అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఎడ్యకుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EDCET)లో సాధించిన ర్యాంకులపై ఆధారపడి ఉంటుంది.
ఏపీ ఎడ్ సెట్ 2022 సీట్ల కేటాయింపు ముఖ్యమైన తేదీలు (AP EDCET 2022 Seat Allotment Important Dates)
ఏపీ ఎడ్‌సెట్ 2022 (AP EDCET 2022) సీట్ల కేటాయింపునకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
ఏపీ ఎడ్‌సెట్ ఎగ్జామ్ డేట్ | జూన్ 13, 2022 |
ఏపీ ఎడ్‌సెట్ 2022 ఫలితాలు | ఆగస్ట్ 6, 2022 |
ఏపీ ఎడ్‌సెట్ 2020 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ | అక్టోబర్ 22-31, 2022 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ | అక్టోబర్ 26-నవంబర్ 8, 2022 |
వెబ్ ఆప్షన్స్ | జనవరి 25 నుంచి 27 |
ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ | జనవరి 28 |
ఏపీ ఎడ్‌సెట్ సీట్ అలాట్‌మెంట్ 2022 | జనవరి 30 |
AP EDCET కళాశాలల వారీగా సీట్ల కేటాయింపు 2022ని ఎలా చెక్ చేసుకోవాలి? (How to check AP EDCET College wise Seat allotment 2022)
ఏపీ ఎడ్‌సెట్ 2022కు సంబంధించిన సీట్ల కేటాయింపు జాబితాను అభ్యర్థులు ఎలా చెక్ చేసుకోవాలో ఈ దిగువన తెలియజేయడం జరిగింది.- AP EDCET అడ్మిషన్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్, edcet-sche.aptonline.inని సందర్శించాలి
- హోంపేజీలో FORMS అనే ఆప్షన్ కింద ఏపీ ఎడ్‌సెట్ సీట్ అలాట్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
- కింద జాబితాలో మీ కళాశాలను, బ్రాంచ్‌ని ఎంచుకోండి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత "అలాట్‌మెంట్‌లను చూపించు"పై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి
- కేటాయింపు జాబితా ప్రదర్శించబడుతుంది
AP EDCET సీట్ల కేటాయింపు ఆర్డర్ 2022 డౌన్‌లోడ్ (Download the AP EDCET Seat allotment Order 2022?)
ఏపీ ఎడ్‌సెట్ 2022 (AP EDCET 2022) సీట్ల కేటాయింపు ఆర్డర్‌ని సులభంగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.- అధికారిక edcet-sche.aptonline.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
- హోమ్‌పేజీలో అభ్యర్థుల లాగిన్ పై క్లిక్ చేయాలి
- అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత సీటు కేటాయింపు వెబ్ పేజీలో కనిపిస్తుంది
- డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయాలి. దాంతో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అవుతుంది
- ఆ ఆర్డర్‌ను ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి