ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) విడుదల. మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET 2023 Notification) నిర్వహిస్తుంది. ఈరోజు ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification): ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, A.P. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) నిర్వహిస్తుంది. మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌కి ప్రవేశ పరీక్షని నిర్వహిస్తారు. AP ICET 2023 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫార్మ్‌ని పూరించే ముందు నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) శుక్రవారం విడుదల కాగా రిజిస్ట్రేషన్లు మార్చి 20, 2023 నుంచి ప్రారంభమవుతాయి. AP ICET 2023 పరీక్ష మే 24, మే 25, 2023న ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడం జరుగుతుంది.
ఏపీ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET 2023 EXAM DATES)
ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల | 17 మార్చి 2023 |
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం | 20 మార్చి 2023 |
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ | 19 ఏప్రిల్ 2023 |
ఆలస్య రుసుము రూ.2000, రూ.3000, రూ.5000 అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీ | తెలియాల్సి ఉంది |
ఏపీ ఐసెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ | తెలియాల్సి ఉంది |
ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామినేషన్ | మే 24, మే 25, 2023 |
ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్ | తెలియాల్సి ఉంది |
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫీజు (AP ICET 2023 Application Fee)
ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.కేటగిరి | ఫీజు |
ఫీజు అమౌంట్ | రూ.650 |
బీసీ | రూ.600 |
ఎస్సీ, ఎస్టీ | రూ.550 |
లేట్ ఫీజు | రూ.2000 |
ఆలస్య ఫీజు | రూ.3000 |
ఆలస్య ఫీజు | రూ.5000 |
ఏపీ ఐసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP ICET 2023 Eligibility Criteria)
ఏపీ ఐసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ కింద తెలియజేసిన అర్హతలు ఉండాలి.- అభ్యర్థి తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.
- లోకల్, నాన్ లోకల్ స్థితికి అనుగుణంగా ఉండాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా UGC ద్వారా గుర్తించబడిన 10 2 3/4 ఫార్మాట్‌లో దానికి సమానమైన డిగ్రీ ఉండాలి.