AP ICET phase 2 Counselling Registration: రేపటితో AP ICET రెండో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ క్లోజ్, 22న సీట్ల కేటాయింపు జాబితా విడుదల
రేపటితో AP ICET రెండో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ (AP ICET phase 2 Counselling Registration) ముగియనుంది. 22న సీట్ల కేటాయింపు జాబితా విడుదలవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఏపీ ఐసెట్ ఫేజ్ 2 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ (AP ICET phase 2 Counselling Registration): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) 2023 ఫేజ్ 2 కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ (AP ICET phase 2 Counselling Registration) విండోను రేపు అంటే నవంబర్ 17న క్లోజ్ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు AP ICET ఫేజ్ 2 కౌన్సెలింగ్ 2023 కోసం అధికారిక వెబ్సైట్ icet-sche.aptonline.in ద్వారా నమోదు చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నవంబర్ 16 నుంచి 18, 2023 వరకు షెడ్యూల్ చేయబడింది. AP ICET ఫేజ్ 2 సీట్ల కేటాయింపు 2023 నవంబర్ 22న ప్రకటించబడుతుంది. అభ్యర్థులు ఐసెట్ ఫేజ్ 2 సీట్ల కేటాయింపు జాబితాను చూసుకోవడానికి ICET రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ ఆధారాలను ఉపయోగించాల్సి ఉంటుంది. వాటి ద్వారా AP ICET రెండో ఫేజ్ కేటాయింపు ఆర్డర్ 2023ని యాక్సెస్ చేయవచ్చు.
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ డేట్స్ 2023 ఫైనల్ ఫేజ్ (AP ICET Counselling Dates 2023- Final Phase)
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
ఏపీ ఐసెట్ 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | నవంబర్ 15, 2023 |
రిజిస్ట్రేషన్ చివరి తేదీ | నవంబర్ 17, 2023 |
డాక్యుమెంట్ల వెరిఫికేషన్ | నవంబర్ 16 నుంచి నవంబర్ 18, 2023 |
ఏపీ ఐసెట్ 2023 వెబ్ ఆప్షన్ సెలక్షన్ | నవంబర్ 17 నుంచి 19, 2023 |
వెబ్ ఆప్షన్ల మార్పు | నవంబర్ 20, 2023 |
సీట్ల కేటాయింపు య | నవంబర్ 22, 2023 |
ఏపీ ఐసెట్ 2023 కౌన్సెలింగ్‌కి రిజస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? (AP ICET 2023 Counselling: How to Register)
అభ్యర్థులు AP ICET ఫేజ్ 2 కౌన్సెలింగ్ 2023 కోసం నమోదు చేసుకోవడానికి ఈ దిగువ ఇచ్చిన దశలను అనుసరించవచ్చు.- AP ICET 2023 కౌన్సెలింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ICET రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- అవసరమైన వివరాలను పూరించాలి.
- ధ్రువీకరణ కోసం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజును సబ్మిట్ చేయాలి.