రేపటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు (AP Inter 1st year exams 2024), పరీక్ష కేంద్రానికి వెళ్లెటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
ఏపీ ఇంటర్ పరీక్షలు (AP Inter 1st year exams 2024) రేపటి నుంచి మార్చి 1 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు విద్యార్థులు కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. విద్యార్థుల కోసం పరీక్షల గైడ్‌లైన్స్‌ని ఈ దిగువున అందిస్తున్నాం.
ఏపీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 2024 (AP Inter 1st Year Exams 2024): ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుంది. ఏపీ బోర్డు 2024 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా BIEAP ఇంటర్ హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. BIEAP AP ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగుతాయి. BIEAP ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమవుతాయి. మార్చి 19, 2024 వరకు కొనసాగుతాయి. అయితే ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు 2024 మార్చి 2న ప్రారంభమై మార్చి 20, 2024న ముగుస్తాయి.
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు 2024 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? (AP Inter Hall Tickets 2024: How to Download?)
ఇంటర్ పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా విద్యార్థులు తమ హాల్ టికెట్లను కచ్చితంగా తీసుకెళ్లాలి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bieap.apcfss.inకి వెళ్లాలి.
- స్టెప్ 2: హోంపేజీలో అడ్మిట్ కార్డ్ లింక్ ఆప్షన్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: విద్యార్థి మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, విద్యార్థి రెండో సంవత్సరం అయితే తేదీ-నెల-సంవత్సరం ఫార్మాట్ లేదా పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- స్టెప్ 4: ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ఏపీ ఇంటర్ 2024 అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ గైడ్ లైన్స్ (AP Inter first year exam guidelines)
ఏపీ మొదటి సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి మార్చి 01వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు పాటించాల్సిన గైడ్‌లైన్స్ ఇక్కడ అందిస్తున్నాం.- ఏపీ ఇంటర్ అడ్మిట్ కార్డ్ 2024ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- పాఠశాల గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి
- రిపోర్టింగ్ సమయానికి 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- సమాధానాలు రాయడానికి నలుపు లేదా నీలం పెన్నులను మాత్రమే ఉపయోగించాలి.
- కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెల్లకూడదు.
- సీటింగ్ అమరిక ప్రకారం కేటాయించిన సీట్లలో కూర్చోండి
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.