ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మోడల్ ప్రశ్న పేపర్ 2023 (AP Inter Maths Model question papers) PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం మ్యాథ్స్ 2023 పరీక్ష త్వరలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు మోడల్ ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆర్టికల్లో AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ మోడల్ పేపర్‌ను (AP Inter Maths Model question papers) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ (AP Inter Maths Model question papers): ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పరీక్ష మార్ 21, 2023న జరగబోతోంది. బోర్డు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు మోడల్ ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మోడల్ పేపర్లు, ప్రశ్నలు, పరీక్షా సరళి, మార్కింగ్ స్కీమ్‌ను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. పరీక్షా సరళిని తెలుసుకోవడం వల్ల విద్యార్థులు తమ సమయాన్ని అసలైన పరీక్ష సమయంలో సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో సహాయపడుతుంది. వారు తమ ప్రిపరేషన్ పరంగా ఏ టాపిక్‌లో బలహీనంగా కూడా అర్థం చేసుకున్నవారవుతారు. AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ మోడల్ పేపర్‌ను (AP Inter Maths Model question papers) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మోడల్ ప్రశ్న పేపర్ 2023 (AP Inter Second Year Maths 2A Model Question Paper 2023)
ఈ దిగువున లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా విద్యార్థులు ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం మోడల్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మోడల్ పేపర్ | తెలుగు మీడియం | పీడీఎఫ్ డౌన్‌లోడ్ |
మోడల్ పేపర్ 1 | తెలుగు మీడియం | Click Here |
మోడల్ పేపర్ 2 | తెలుగు మీడియం | Click Here |
మోడల్ పేపర్ 3 | తెలుగు మీడియం | Click Here |
మోడల్ పేపర్ 4 | తెలుగు మీడియం | Click Here |
మ్యాథ్స్ పరీక్ష పత్రం మూడు విభాగాలను కలిగి ఉంటుంది- A, B మరియు C. మూడు విభాగాల్లో మొత్తం 24 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ Aలో ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున 10 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ B, Cలలో ఒక్కొక్కటి 5 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ B యొక్క ప్రశ్నలకు ఒక్కొక్కటి 4 మార్కులు ఉంటాయి. అయితే సెక్షన్ C యొక్క ప్రశ్నలు ఒక్కొక్కటి 7 మార్కులను కలిగి ఉంటాయి. ప్రశ్నపత్రం యొక్క గరిష్ట మార్కులు 75. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి మొత్తం 3 గంటల సమయం ఉంటుంది.
ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్‌కు సంబంధించిన మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comకి కూడా మాకు వ్రాయవచ్చు.