ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2023 మ్యాథ్స్ 1బీ మోడల్ ప్రశ్నాపత్రం PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1B పరీక్ష కోసం మోడల్ ప్రశ్నాపత్రం ఈ ఆర్టికల్లో అందించడం జరిగింది. మోడల్ పేపర్ల ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యర్థులు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు.
ఏపీ ఇంటర్ 2023 మ్యాథ్స్ మోడల్ పేపర్ (AP Inter 2023 Maths model paper): ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1B పరీక్ష ఈరోజు జరుగుతుంది.ఈ పరీక్షని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్వహిస్తుంది. పరీక్షా విధానం క్లిష్టత స్థాయిని బాగా అర్థం చేసుకోవడానికి విద్యార్థులు పరీక్షకు ముందు మ్యాథ్స్ ప్రశ్నపత్రాలని ప్రాక్టీస్ చేయడం అత్యవసరం. మోడల్ పేపర్ విద్యార్థులకు వివిధ ప్రశ్నలని అభ్యసించే అవకాశాన్ని కలుగుతుంది. అంతేకాకుండా మోడల్ పేపర్ పరీక్ష గురించి, అడిగే ప్రశ్నల సంఖ్య, మార్కులు ఎలా కేటాయిస్తారనే అంశాలపై ఒక అవగాహన కలుగుతుంది.
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1B మోడల్ ప్రశ్న పత్రం 2023
ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ మోడల్ ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఈ కింద ఇవ్వడం జరిగింది.మోడల్ పేపర్లు | TM | PDFని డౌన్‌లోడ్ |
మోడల్ పేపర్ 1 | TM | Download Here |
మోడల్ పేపర్ 2 | TM | Download Here |
మోడల్ పేపర్ 3 | TM | Download Here |
మోడల్ పేపర్ 4 | TM | Download Here |
మ్యాథ్స్ ప్రశ్నపత్రం A, B, C అనే మూడు విభాగాలుగా విభజిస్తారు. మొత్తం 24 ప్రశ్నలు ఈ మూడు విభాగాలలో అడుగుతారు. సెక్షన్ Aలో అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఇస్తారు. సెక్షన్ B నుంచి ఏవైనా 5 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ప్రతి ఒక్క సమాధానానికి నాలుగు మార్కులు వేస్తారు. సెక్షన్ C దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సిన ప్రశ్నలు ఇస్తారు.. ప్రతి ఒక్క జవాబుకి 7 మార్కులు వేస్తారు. గరిష్టంగా 75 మార్కులకు పేపర్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించినది. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.