ఏపీ ఇంటర్ మార్కుల మెమోలను ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి (AP Inter Marks Memo 2024)
ఏపీ ఇంటర్మీడియట్ షార్ట్ మెమోలు (AP Inter Marks Memo 2024) విడుదలయ్యాయి. విద్యార్థులు తమ మార్కుల షార్ట్ మెమోలు ఇక్కడ అందించిన లింక్స్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 ఇటీవలె విడుదలయ్యాయి. విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను (AP Inter Marks Memo 2024) కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్‌లను ఇక్కడ అందించాం. విద్యార్థులు వాటిపై క్లిక్ చేసి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్కుల మెమో కోసం అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ని, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఏపీ ఇంటర్మీడియట్ మార్కుల మెమోల లింక్ 2024 (AP Intermediate Marks Memo Link 2024)
ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌లపై క్లిక్ చేసి విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇంటర్ ఫస్ట్ ఇయర్, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 12 ఏప్రిల్ 2024న https://resultsbie.ap.gov.in/లో రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8,55,030 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం మంది, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 78 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ మార్చి 2024లో మొదటి, రెండో సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించింది. కాగా ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఏ మాత్రం నిరాశ చెందనక్కర్లేదు. ఇలాంటి విద్యార్థుల కోసం వచ్చే నెలలో ఎడ్యుకేషన్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది.
ఏపీ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీలలో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. అదే విధంగా మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కి ఛాన్స్
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 2024 తమ మార్కుల పట్ల అసంతృప్తిగా ఉండే విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం లేదా రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. దీని కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీలోపు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ద్వారా మరోసారి మార్కుల మూల్యాంకనం, రీ వెరిఫికేషన్ ద్వారా సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలని కోరవచ్చు. తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.