AP OAMDC Admission Process 2023: AP ఇంటర్ ఫలితాలు 2023 తర్వాత BA, B.Sc, B.Comలో అడ్మిషన్ పొందడం ఎలా?
ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 ఈరోజు సాయంత్రం (ఏప్రిల్ 26, 2023)న విడుదల కానున్నాయి. ఇంటర్‌లో పాసైన అభ్యర్థులు BA, B.Sc, B.Com కోర్సుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులు AP OAMDC అడ్మిషన్ ప్రక్రియను (AP OAMDC Admission Process 2023) ఇక్కడ చెక్ చేయవచ్చు.
ఏపీ ఓఎంఏడీసీ అడ్మిషన్ విధానం 2023 (AP OAMDC Admission Process 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP ఇంటర్ ఫలితాలు 2023 ప్రకటించిన వెంటనే BA, B.Sc, B.Com, ఇతర కోర్సులు కోసం ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inని సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంటర్‌లో మంచి మార్కులతో పాసైన విద్యార్థులు BA, BCom, BBA వంటి వివిధ విభాగాల్లో AP డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ (AP OAMDC Admission Process 2023) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ కాలేజీల్లో సీటు పొందవచ్చు. AP OAMDC డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను మే 2023లో ప్రటకించే అవకాశం ఉంది.
AP ఇంటర్ ఫలితాలు 2023 తర్వాత BA, B.Sc, B.Comలో అడ్మిషన్ పొందే విధానం (Process to Get Admission in B.A, B.Sc, B.Com after AP Inter Results 2023)
AP బోర్డు లేదా ఇతర బోర్డుల నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఐదు దశల్లో అడ్మిషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. AP OAMDC డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ 2023ని ఈ దిగువున తెలుసుకోవచ్చు.
స్టెప్ 1: అభ్యర్థి నమోదు
ముందుగా అభ్యర్థులు AP OAMDC అధికారిక సైట్‌ని oamdc-apsche.aptonline.inని సందర్శించాలి. '‘Candidates Registration’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు
రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు ఈ దిగువ టేబుల్లో పేర్కొన్న విధంగా కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించాలి.
కేటగిరి | AP OAMDC డిగ్రీ అడ్మిషన్ దరఖాస్తు ఫీజు 2023 |
జనరల్ | రూ. 400 |
బీసీ | రూ. 300 |
SC/ST | రూ. 200 |
స్టెప్ 3: అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడం
అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫార్మ్‌లో అవసరమైన వివరాలని సరిగ్గా పూరించాలి. దానిని నిర్ధారించాలి. ఫోటో, సంతకం, ఇతర ముఖ్యమైన పత్రాలను నిర్ధేశించిన ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాలి.
స్టెప్ 4: సర్టిఫికెట్ల ధ్రువీకరణ
అధికారులు ఇప్పుడు అభ్యర్థి అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్‌లను ధ్రువీకరిస్తారు. అందించిన పత్రాలు స్పష్టంగా లేకుంటే వాటిని మళ్లీ అప్‌లోడ్ చేయమని కూడా అడగవచ్చు.
స్టెప్ 5: వెబ్ ఎంపికలు, సీట్ల కేటాయింపు
తదుపరి స్టెప్ నిర్ణీత కాలపరిమితిలోపు వెబ్ ఆప్షన్లు అమలు చేయడం, ఇది ప్రాథమికంగా మీరు అడ్మిషన్ పొందాలనుకునే ప్రాధాన్య కళాశాలను ఎంచుకోవాలి. ఎంపికల ఆధారంగా సీట్ల కేటాయింపు జాబితాను నిర్వహించే సంస్థ విడుదల చేస్తుంది.
స్టెప్ 6: సెల్ఫ్ రిపోర్టింగ్, అడ్మిషన్ నిర్ధారణ
దరఖాస్తుదారులు తమ వెబ్ ఆప్షన్‌ల కోసం ఆన్‌లైన్ మోడ్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. కాలేజీని సందర్శించి వారి అడ్మిషన్‌ని నిర్ధారించాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.