AP ITI Admission Phase 2 Application Form Release: ఏపీ ఐటీఐ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, ఈ లింక్‌తో దరఖాస్తు చేసుకోండి
ఏపీ ఐటీఐ 2023 దరఖాస్తు ఫార్మ్ (AP ITI Admission Phase 2 Application Form Release) విడుదలైంది. అభ్యర్థులు తప్పనిసరిగా జూలై 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు AP ITI దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాల్సి సబ్మిట్ చేసుకోవాలి.
ఏపీ ఐటీఐ అడ్మిషన్ ఫేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ (AP ITI Admission Phase 2 Application Form Release): ఆంధ్రప్రదేశ్ ఐటీఐ 2023 దరఖాస్తు ప్రక్రియ రెండో దశ ప్రారంభమైంది. జూలై 31, 2023న ముగుస్తుంది. దీనికి సంబంధించిన ఏపీ ఐటీఐ అడ్మిషన్ 2023 దరఖాస్తు ఫార్మ్ (AP ITI Admission Phase 2 Application Form Release) విడుదలైంది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా జూలై 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు AP ITI దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాల్సి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ ముఖ్యాంశాలు (Andhra Pradesh ITI Admission Highlights)
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ అడ్మిషన్ ముఖ్యాంశాలు గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది.AP ITI 2023 కండక్టింగ్ బాడీ | ఉపాధి, శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ప్రవేశ విధానం | మెరిట్ ఆధారంగా |
దరఖాస్తు ప్రక్రియ | ఆన్లైన్ విధానం |
కౌన్సెలింగ్ ప్రక్రియ | ఆన్లైన్ విధానం |
కనీస విద్యార్హత | పదో తరగతి |
అధికారిక వెబ్సైట్ | https://iti.ap.gov.in/ |
ఏపీ ఐటీఐ అడ్మిషన్ తేదీలు 2023 (AP ITI Admission Dates 2023)
ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
దరఖాస్తు ఫార్మ్ విడుదల తేదీ | జూలై 13, 2023 |
దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | జూలై 31, 2023 |
మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
ఆంధ్రప్రదేశ్ ఐటీఐ 2023 దరఖాస్తు చేసుకునే ప్రక్రియ (Andhra Pradesh ITI 2023 Application Process)
పదో తరగతి పూర్తి చేసిన వ్యక్తులు ఐటీఐలో జాయిన్ అవ్వొచ్చు. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.- ముందుగా అభ్యర్థులు https://iti.ap.gov.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్లేది.
- "కొత్త రిజిస్ట్రేషన్" లింక్‌పై క్లిక్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకోవడానికి వ్యక్తిగత వివరాలను అందించాలి.
- మళ్లీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి AP ITI అడ్మిషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
- ప్రాధాన్యత తగ్గే క్రమంలో పేజీలో అందుబాటులో ఉన్న ITIల జాబితా నుంచి మీకు ఇష్టమైన ITIలను ఎంచుకోండి.
- పేర్కొన్న స్పెసిఫికేషన్ల ప్రకారం మీ స్కాన్ చేసిన అన్ని పత్రాలు, చిత్రం, సంతకాన్ని అప్లోడ్ చేయండి.
- "SUBMIT" బటన్‌పై క్లిక్ చేసి భవిష్యత్తు సూచన కోసం సమర్పించిన దరఖాస్తు ఫార్మ్‌ను ప్రింట్ తీసుకోండి.