ఏపీ లాసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్, 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (AP LAWCET 2024 Notification)
ఏపీ లాసెట్ 2024 నోటిఫికేషన్ (AP LAWCET 2024 Notification) రిలీజ్ అయింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు మార్చి 26వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.
ఏపీ లాసెట్ 2024 నోటిఫికేషన్ (AP LAWCET 2024 Notification) : ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2024 Lawcet 2024 నోటిఫికేషన్ (AP LAWCET 2024 Notification) రిలీజ్ అయింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది లాసెట్ నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల లా డిగ్రీతో పాటు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్ 2024 ప్రవేశ పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష సిలబస్, అర్హతలు, అందుబాటులో ఉన్న సీట్లు, కాలేజీల వివరాలను నోటిఫికేషన్ బ్రోచర్‌లో పేర్కొన్నారు. ఏపీ లాసెట్ 2024కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.
ఏపీ లాసెట్ 2024 ముఖ్యమైన తేదీలు (AP LAWCET 2024 Important Dates)
ఏపీ లాసెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించాం.ఏపీ లాసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం | మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 |
రూ.500ల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ | ఏప్రిల్ 27 నుంచి మే 3, 2024 |
రూ.1000 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ | మే 4 నుంచి 11, 2024 |
రూ.2000 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 12 నుంచి 20, 2024 |
రూ.3000ల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మే 21 నుంచి 29, 2024 |
ఏపీ లాసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తేదీలు | మే 30 నుంచి జూన్ 1, 2024 |
ఏపీ లాసెట్ హాల్ టికెట్ల విడుదల తేదీ | జూన్ 3, 2024 |
ఏపీ లాసెట్ 2024 ఎగ్జామ్ డేట్ | జూన్ 9, 2024 |
ఏపీ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చే తేదీ | మార్చి 26, 2024 |
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు కోసం అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు కోసం అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరకాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.