AP OAMDC Second Phase Counselling 2023: ఈరోజే AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 ప్రారంభం
AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 (AP OAMDC Second Phase Counselling 2023) కోసం అభ్యర్థులు తమ రిజిస్టేషన్‌ను తమ రిజిస్ట్రేషన్‌ను ఈరోజు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1, 2023 వరకు పూరించాలి. అర్హులైన అభ్యర్థులు పూరించడానికి ఫార్మ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 తేదీలు (AP OAMDC Second Phase Counseling 2023 Dates)
AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్స్ | తేదీలు |
AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 నమోదు తేదీలు | ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 1, 2023 వరకు |
వెబ్ ఆప్షన్ల ఎక్సర్‌సైజ్ | సెప్టెంబర్ 4 నుండి 8, 2023 వరకు |
సీట్ల కేటాయింపు తేదీ | సెప్టెంబర్ 12, 2023 |
కేటాయించిన కళాశాలలకు విద్యార్థుల రిపోర్టింగ్ | సెప్టెంబర్ 12, 2023 |
AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 నమోదు విధానం (AP OAMDC Second Phase Counseling 2023 Registration Process)
ఆసక్తి గల అభ్యర్థులు AP OAMDC రెండో దశ కౌన్సెలింగ్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను ఇక్కడ పూరించడానికి ఈ సూచనలను అనుసరించవచ్చు:- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, వారి వివరాలు అందించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోండి.
- పోర్టల్‌కి లాగిన్ అయి అవసరమైన ఫీల్డ్‌ల ప్రకారం అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించండి
- ఫారమ్‌లో సూచించిన సైజ్, ఫార్మాట్ ప్రకారం పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- OC కోసం రూ. 400/-, BCకి రూ. 300/-, SC/ST కోసం రూ. 200/- క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/ (లేదా) నెట్ బ్యాంకింగ్ ద్వారా “పే ప్రాసెసింగ్ ఫీజు” లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- ఫార్మ్‌ను సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేయండి. కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌కి రిపోర్టింగ్ చేసే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రసీదు వెంట తీసుకెళ్లాలి.