AP POLYCET 2023 Application Closing: విద్యార్థులకు అలర్ట్, దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు గడువులోగా (ఏప్రిల్ 30) దరఖాస్తు (AP POLYCET 2023 Application Closing) చేసుకోవాలి. దీనికోసం అభ్యర్థులు polycetap.nic.inకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ పాలిసెట్ 2023 దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (AP POLYCET 2023 Application Closing): AP POLYCET 2023 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. రేపు అంటే ఏప్రిల్ 30న ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు (AP POLYCET 2023 Application Closing) చేసుకోవాలి. దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు విజయవంతంగా తమను తాము నమోదు చేసుకోవాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించాలి. ఏపీ పాలిసెట్ 2023 పరీక్ష 10 మే 2023న జరగనుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ పరీక్షకు కొన్ని రోజుల ముందు విడుదల చేయబడుతుంది. AP POLYCET 2023 గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
AP POLYCET 2023 దరఖాస్తు ప్రక్రియ (AP POLYCET 2023 Application Process)
AP POLYCET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇంకా AP POLYCET 2023 దరఖాస్తు ఫార్మ్‌ని ఎలా పూరించాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు polycetap.nic.in అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి.
స్టెప్ 2: హోంపేజీలో అందించిన 'Application form for AP POLYCET' లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: అప్లికేషన్ ఫార్మ్ ప్రదర్శించబడే కొత్త పేజీ కనిపిస్తుంది.
స్టెప్ 4: విద్యార్హత, నివాస చిరునామా వంటి అన్ని వివరాలు నమోదు చేయాలి.
స్టెప్ 5: ఫోటోగ్రాఫ్‌లు, సంతకాలు వంటి నిర్దిష్ట పత్రాలను తప్పనిసరిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 6: దరఖాస్తు ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
AP పాలిసెట్ 2023 దరఖాస్తు ఫీజు (AP POLYCET 2023 Application Fee)
మీరు AP POLYCET కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండింటికీ ఫీజు భిన్నంగా ఉంటుంది-అప్లికేషన్ ఫార్మ్ | దరఖాస్తు ఫీజు |
ఆన్‌లైన్ మోడ్ | రూ. 350 |
ఆఫ్‌లైన్ మోడ్ | రూ.400 |
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించినది. మీరు మా ఈమెయిల్ ఐడీ ID news@collegedekho.com ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.