AP POLYCET Counselling 2023: కొనసాగుతున్న AP POLYCET కౌన్సెలింగ్ 2023
AP POLYCET కౌన్సెలింగ్ 2023 (AP POLYCET Counselling 2023) కొనసాగుతుంది. అధికారులు అభ్యర్థుల డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేస్తున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
AP పాలిసెట్ కౌన్సెలింగ్ తేదీ 2023 (AP POLYCET Counselling 2023): AP పాలిసెట్ ఫలితాలు 2023 మే 20న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AP POLYCET కౌన్సెలింగ్ (AP POLYCET Counselling 2023) తేదీలను 2023 ప్రకటించింది. పరీక్ష తర్వాత 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేయబడినందున, AP POLYCET కౌన్సెలింగ్ మే 25, 2023న ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం POLYCET కౌన్సెలింగ్ ప్రక్రియ ఫలితాల ప్రకటన తర్వాత ఒక వారంలోపు మొదలవుతుంది. SBTET అధికారికంగా మే 22న కౌన్సెలింగ్ షెడ్యూల్‌ని ప్రకటించడం జరిగింది.
AP పాలిసెట్ కౌన్సెలింగ్ తేదీ 2023 (AP POLYCET Counselling Date 2023)
AP POLYCET కౌన్సెలింగ్ 2023 కోసం అంచనా షెడ్యూల్ ఇక్కడ అందజేయడం జరిగింది.ఈవెంట్ | అంచనా తేదీలు |
అధికారిక నోటిఫికేషన్ విడుదల | మే 22, 2023 |
రిజిస్ట్రేషన్ ప్రారంభం | మే 25, 2023 |
వెబ్ ఎంపికలు | జూన్ 01, 2023 |
సీటు కేటాయింపు | జూన్ 09 2023 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ | మే 29 నుంచి జూన్ 5, 2023 |
రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ | జూన్ 01, 2023 |
AP POLYCET కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.inలో విడుదల చేయడం జరుగుతుంది. షెడ్యూల్లో తేదీలు, ప్రక్రియ మొదలైన వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఏపీ పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించే ముందు అభ్యర్థులు డిప్లొమా మార్క్ షీట్, స్టడీ సర్టిఫికేట్, కులం/కేటగిరీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం మొదలైన అన్ని ముఖ్యమైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఈ డాక్యుమెంట్లన్నీ తప్పనిసరిగా ఉండాలి. AP POLYCET మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంది. అభ్యర్థులు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మాత్రమే హాజరు కావాలి.
లేటెస్ట్ Education News కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మమ్మల్ని మా ఈ మెయిల్ ID news@collegedekho.com ద్వారా సంప్రదించవచ్చు.