ఏపీలో 2260 ఉద్యోగాల భర్తీకి గ్నీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే
ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2260 ఉద్యోగాల (AP Special Education Teacher Posts 2025) భర్తీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2025 (AP Special Education Teacher Posts 2025) : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2, 260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు SGT పోస్టులు 1,136, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,124 ఉన్నాయి. ప్రభుత్వం DSC ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వాటిని పెంపొందించడంలో ఈ ఉపాధ్యాయులు కృషి చేస్తారు.
ఏపీలో జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల వివరాలు
ఏపీలో జిల్లా వారీగా మంజూరు చేసిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించాం. ఇప్పటికే మంజూరు చేసి పోస్టుల సంఖ్య, ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన పోస్టుల వివరాలు అందించాం.క్ర.సంఖ్య | జిల్లా పేరు | మంజూరు చేయబడిన SGTల సంఖ్య (స్పెషల్ ఎడ్యుకేషన్ ) | స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య (స్పెషల్ ఎడ్యుకేషన్) అవసరం | ఇప్పటికే మంజూరు చేసిన పోస్టుల సంఖ్య | ఇప్పుడు మంజూరు చేసిన పోస్టులు |
1. 1. | అనంత పురం | 101 | 178 | 78 | 100 |
2 | చిత్తూరు | 117 | 164 | 82 | 82 |
3 | తూర్పు గోదావరి | 127 | 226 | 75 | 151 |
4 | గుంటూరు | 151 | 170 | 72 | 98 |
5 | వైఎస్సార్ కడప | 57 | 115 | 66 | 49 |
6 | కృష్ణా | 71 | 154 | 65 | 89 |
7 | కర్నూలు | 110 | 199 | 69 | 130 |
8 | నెల్లూరు | 63 | 105 | 61 | 44 |
9 | ప్రకాశం | 74 | 121 | 71 | 50 |
10 | శ్రీకాకుళం | 71 | 162 | 53 | 109 - |
11 | విశాఖపట్నం | 59 | 110 | 58 | 52 |
12 | విజయనగరం | 45 | 115 | 49 | 66 |
13 | పశ్చిమ గోదావరి | 90 | 166 | 61 | 105 |
మొత్తం సంఖ్య | 1136 | 1984 | 860 | 1124 |
ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుంది. కాగా ఈ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్‌డేట్ల కోసం కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.