ఏపీ 10వ తరగతి తెలుగు పరీక్ష 2022 ప్రశ్నాపత్రం విశ్లేషణ, జవాబులతో సహా అందుబాటులో ఉంది. (AP SSC Telugu Exam 2022 Question Paper Analysis )
ఏపీ 10వ తరగతి 2022 తెలుగు పరీక్ష ప్రశ్నపత్రాన్ని ( AP SSC TELUGU QUESTION PAPER 2022) విశ్లేషణ విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో వివరించబడింది. ఈ ప్రశ్నపత్రం విశ్లేషణతో పాటు ప్రశ్నపత్రానికి జవాబులు కూడా ఈ ఆర్టికల్ లో అందించబడ్డాయి.
ఏపీ 10వ తరగతి 2022 తెలుగు ప్రశ్నపత్రం విశ్లేషణ ( AP SSC 2022 Telugu Exam Question Paper Analysis) : ఏపీ 10వ తరగతి గత సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 27, 2022 వా తేదీ నుండి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఏప్రిల్ 27 వ తేదీన తెలుగు పరీక్ష జరిగింది. తెలుగు ప్రశ్నపత్రం ( AP SSC Telugu Exam Question Paper) మొత్తం మూడు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం లో పద్య భాగానికి సంబందించిన ప్రశ్నలు ఉన్నాయి. రెండవ భాగంలో గద్య భాగానికి సంబందించిన ప్రశ్నలు ఉండగా మూడవ భాగం ఆబ్జెక్టివ్ ( MCQ) ప్రశ్నలను కలిగి ఉంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు రూపొందించారు. ఈ సంవత్సరం ప్రశ్న పత్రం ( AP SSC Telugu Exam Question Paper) రెండవ పేపర్ విధానం లేదు, మొత్తం ఒకటే ప్రశ్న పత్రం. విద్యార్థుల కోసం ఈ ఆర్టికల్ లో ప్రశ్న పత్రం పూర్తి విశ్లేషణ అందిచాము మరియు మూడవ విభాగం యొక్క జవాబులు కూడా విద్యార్థులు ఇక్కడ పొందవచ్చు. ఈ ఆర్టికల్ లో విశ్లేషణ పూర్తిగా విద్యార్థుల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకొని వివరించబడింది.
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి జవాబులు 2022 ( AP SSC Telugu Answer Key 2022)
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి కింద అందించంబడిన PDF లో జవాబులు అందించబడ్డాయి. ఈ లింక్ మీద క్లిక్ చేసి విద్యార్థులు జవాబులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఏపీ 10 వ తరగతి 2022 ( AP SSC 2022 Exams) కు హాజరు అయినట్లు అయితే మీ ప్రశ్న పత్రాలను ఈ ఈమెయిల్ ఐడి కు పంపించండి. sakunth.kumar@collegedekho.com
PDF - AP SSC (Class 10) Telugu Answer Key 2022 (కాంపోజిట్ కాని కోర్సు)
ఇది కూడా చదవండి:
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం విశ్లేషణ ( AP SSC 2022 Telugu Exam Question Paper Analysis)
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం యొక్క పూర్తి విశ్లేషణ ఈ క్రింది పట్టికలో వివరించబడింది.
అంశం | విశ్లేషణ |
పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి | సులువు |
విభాగం 1 యొక్క క్లిష్టత స్థాయి (పద్య భాగం ప్రశ్నలు) | సులువు |
విభాగం 2 యొక్క క్లిష్టత స్థాయి (గద్య భాగం ప్రశ్నలు) | సులువు |
విభాగం 3 యొక్క క్లిష్టత స్థాయి (ఆబ్జెక్టివ్ ప్రశ్నలు) | సులువు |
ఆశించే మార్కులు | 88+ |
ఇది కూడా చదవండి: AP SSC (Class 10) Exams 2022 Exam Day Instructions
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం 2022 ( AP SSC 2022 Telugu Question Paper )
ఏపీ 10 వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం 2022 ( AP SSC 2022 Telugu Question Paper ) ఇక్కడ పిడిఎఫ్ లో అందించబడింది.
AP SSC (Class 10) Composite Course Question Paper PDF
ఇది కూడా చదవండి: AP SSC (Class 10) Exams 2022 Spot Valuation Starts, Results Expected Early