AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు : SGT కోసం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవే
AP TET 2024 పరీక్షలో తెలుగు సబ్జెక్టు కోసం 30 మార్కులు కేటాయించబడ్డాయి. తెలుగు సబ్జెక్టు లో ముఖ్యమైన అంశాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో ప్రచురించబడిన AP TET నోటిఫికేషన్ 2024 PDFలో AP TET సిలబస్ 2024 మరియు పరీక్షల సరళి జూలై 2, 2024న ప్రకటించబడ్డాయి. AP TET 2024 సిలబస్ పేపర్లు 1 A & B మరియు పేపర్లు 2 A & B కోసం అంశాలను కవర్ చేస్తుంది. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, ఒడియా మరియు సంస్కృతంతో సహా అన్ని భాషల కోసం AP TET సిలబస్ PDF 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP టెట్ సిలబస్ మరియు పరీక్షా సరళిని అర్థం చేసుకోవడం పరీక్ష తయారీకి కీలకం. AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3 నుండి 20, 2024 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. AP TET 2024 పరీక్షలో తెలుగు సబ్జెక్టు కోసం 30 మార్కులు కేటాయించబడ్డాయి, ఇందులో 24 మార్కులు కంటెంట్ కు మిగతా 6 మార్కులు మెథడాలజీ కి కేటాయించబడ్డాయి. అభ్యర్థులు తెలుగు ప్రశ్నలకు సమాధానాలను ఖచ్చితంగా రాయగలిగితే తెలుగు సబ్జెక్టు నుండి పూర్తి మార్కులు సాధించవచ్చు.
AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు ( AP TET 2024 Telugu Important Topics)
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 లో తెలుగు సబ్జెక్టులో ముఖ్యంశాలు క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు | ముఖ్యమైన అంశాల జాబితా |
అపరిచిత పద్యం, అపరిచిత గద్యం | కవి పరిచయాలు, విశేషాంశాలు , ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు |
పదజాలం, అర్ధాలు, పర్యాయ పదాలు, ప్రకృతి - వికృతులు , నానార్ధాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు , వృత్పత్యార్ధాలు, మాండలిక పదాలు | భాషాంశాలు, భాషాభాగాలు, కాలాలు,లింగాలు, విభక్తులు, పురుషులు, విరామ చిహ్నాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు |
సంధులు - నిర్వచనాలు | సమాసాలు - నిర్వచనాలు , ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు |
AP TET 2024 తెలుగు సిలబస్ PDF ( AP TET 2024 Telugu Syllabus PDF)
ఆంధ్రప్రదేశ్ TET తెలుగు సిలబస్ ను ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.AP TET 2024 కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.