సబ్జెక్ట్ వైజ్‌గా AP TET ఆన్సర్ కీ 2024 (జూలై సెషన్) PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Answer Key 2024 (July Session))
ఏపీ టెట్ 2024 పరీక్షలు ఈరోజు అంటే అక్టోబర్ 3వ తేదీన మొదలయ్యాయి. 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని (AP TET Answer Key 2024) అక్టోబర్ 4, 2024న విడుదల చేస్తుంది
ఏపీ టెట్ ఆన్సర్ కీ 2024 (AP TET ఆన్సర్ కీ 2024) : ఏపీ టెట్ 2024 పరీక్షలు ఈరోజు అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా జరుగుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ AP TET 2024 జూలై సెషన్ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీలని అక్టోబర్ 4, 2024 నుంచి విడుదల చేస్తుంది. ఏపీ టెట్ ఆన్సర్ కీ 2024 అభ్యంతర లింక్, ప్రశ్న పత్రాలతో పాటు అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో పబ్లిష్ అవుతుంది. AP TET రెస్పాన్స్ షీట్ 2024 కూడా ఆన్సర్ కీతో పాటు విడుదలవుతుంది. అభ్యర్థులు అభ్యర్థి ID, పుట్టిన తేదీని ఉపయోగించి రెస్పాన్స్ షీట్‌తో పాటు APTET కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP TET కీ, రెస్పాన్స్ షీట్ కోసం నేరుగా డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ షేర్ చేస్తాం. అభ్యర్థులు ఆన్సర్ PDF లింక్‌లపై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి...
AP TET ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేసేందుకు సంబంధిత లింక్ అక్టోబర్ 5, 2024 యాక్టివేట్ అవుతుంది. అభ్యర్థులు AP TET కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారి పరీక్ష షిఫ్ట్ ముగిసినప్పుడు, దానిపై అభ్యంతరాలను సబ్మిట్ చేయవచ్చు. జూలై సెషన్‌కు సంబంధించిన AP TET 2024కి సంబంధించిన ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, అభ్యంతరాల విండో అన్ని పరీక్షా షిఫ్ట్‌ల కోసం ఒకే లింక్‌లలో అందుబాటులో ఉంటాయి.
AP TET ఆన్సర్ కీ 2024 (జూలై సెషన్): సబ్జెక్ట్ వారీగా PDF డౌన్‌లోడ్
ఏపీ టెట్ ఆన్సర్ కీ 2024 PDFలని ఇక్కడ అందించడం జరిగింది. అభ్యర్థులు ఆ లింక్‌లపై క్లిక్ చేసి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పరీక్ష తేదీ | PDF లింక్ |
అక్టోబర్ 3, 2024 | AP TET SA Telugu 3 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 4, 2024 | AP TET SGT 4 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 6, 2024 | AP TET SGT 6 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 7, 2024 | AP TET SGT 7 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 8, 2024 | AP TET SGT 8 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 9, 2024 | AP TET SGT 9 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
అక్టోబర్ 10, 2024 | AP TET SGT 10 అక్టోబర్ 2024 ఆన్సర్ కీ |
రెస్పాన్స్ షీట్‌లు | AP TET రెస్పాన్స్ షీట్ 2024 (జూలై సెషన్) |
మాస్టర్ ప్రశ్నాపత్రాలు | AP TET ప్రశ్నాపత్రం 2024 (జూలై సెషన్) |
కాగా AP TET ఫైనల్ కీ 2024 అక్టోబర్ 27, 2024 న విడుదలవుతుంది. AP TET కీ 2024 అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో షిఫ్ట్‌ల వారీగా, పేపర్ వారీగా విడుదల అవుతుంది. AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3 నుండి 20, 2024 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహించబడుతుంది. APTET 2024 పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధ్యాయుల అర్హత పరీక్ష. AP TET ఫలితాలు 2024 నవంబర్ 2, 2024న ప్రకటించబడుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.