AP మరియు TS సంక్రాంతి సెలవులు 2023: తేదీలు మరియు పాఠశాల పునఃప్రారంభ తేదీ
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవుల తేదీలను (AP & TS Sankranthi Holidays 2023)ప్రకటించాయి. సంక్రాంతి సెలవుల తర్వాత జనవరి 19వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంక్రాంతి సెలవులు 2023(AP & TS Sankranthi Holidays 2023): ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని విద్య సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ సెలవు రోజులలో విద్య సంస్థలు ఎటువంటి క్లాసులు జరుపకూడదు అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ మరియు తెలంగాణ రాష్ట్రాల సంక్రాంతి సెలవు తేదీలలో కొన్ని మార్పులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా విద్యార్థులకు ఇచ్చిన సెలవులు క్రింద గమనించవచ్చు
క్రింద ఇవ్వబడిన పట్టికలో రాష్ట్రాల వారీగా సంక్రాంతి సెలవు తేదీలు(AP & TS Sankranthi Holidays 2023) గమనించవచ్చు.
కార్యక్రమం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన తేదీలు | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తేదీలు |
పాఠశాలలకు సంక్రాంతి సెలవుల ప్రారంభం | 12/01/2023 | 13/01/2023 |
కళాశాలలకు సంక్రాంతి సెలవుల ప్రారంభం | 12/01/2023 | 14/01/2023 |
పాఠశాలలలకు సంక్రాంతి సెలవుల చివరి తేదీ | 18/01/2023 | 17/01/2023 |
కళాశాలలకు సంక్రాంతి సెలవుల చివరి తేదీ | 18/01/2023 | 16/01/2023 |
పాఠశాలలు పునఃప్రారంభం | 19/01/2023 | 18/01/2023 |
కళాశాలలు పునః ప్రారంభం | 19/01/2023 | 17/01/2023 |
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తేదీలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జనవరి 11వ తేదీ నుండి 16వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే ఉపాద్యాయులు మరియు విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులను మార్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాశాలలు మరియు పాఠశాలలు జనవరి 19వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.
తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తేదీలు : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు మరియు కళాశాలలకు విడివిడిగా సెలవులను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలకు జనవరి 13వ తేదీ నుండి 17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ఇవ్వగా కళాశాలలకు 14వ తేదీ నుండి 16వ తేదీ వరకూ సెలవులు ఇచ్చారు. తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ఐదు రోజులు మరియు కళాశాల విద్యార్థులకు మూడు రోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. తెలంగాణలో పాఠశాలలు తిరిగి జనవరి 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి, కళాశాలలు జనవరి 17వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.