APPSC Group 1 Main exam New Dates: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా, పరీక్షల కొత్త తేదీలను ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-I సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్‌కు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ని (APPSC Group 1 Main Exam New Dates) విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఆర్టికల్లో ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి షెడ్యూల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
APPSC గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ కొత్త తేదీలు (APPSC Group 1 Main exam New Dates): ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు APPSC ప్రకటించింది. నిజానికి ఆ పరీక్షలు ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను APPSC వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం APPSC గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు APPSC Group 1 Main exam New Dates) జూన్‌లో నిర్వహించనుంది. అన్ని పేపర్‌లు ముందస్తు సెషన్‌లో నిర్వహించడం జరుగుతుంది.నిజానికి ఏప్రిల్ 24 నుంచి మే 18వరకు సివిల్స్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. దీంతో పలువురు అభ్యర్థులను పరీక్షలను వాయిదా వేయాలని కోరడంతో మెయిన్స్ పరీక్షలను APPSC వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీల ప్రకటనను ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
APPSC గ్రూప్-1 పరీక్ష తేదీలు (APPSC Group 1 Main exam New Dates)
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను ఇక్కడ అందజేయడం జరిగింది.పరీక్ష | తేదీలు |
తెలుగులో పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్) | జూన్ 3, 2023 |
ఇంగ్లీష్ పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్) | జూన్ 5, 2023 |
జనరల్ ఎస్సే | జూన్ 6, 2023 |
హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ AP | జూన్ 7, 2023 |
రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి | జూన్ 8, 2023 |
భారతదేశం, AP ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి | జూన్ 9, 2023 |
సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ | జూన్ 10, 2023 |
ఇదిలా ఉండగా ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఏపీపీఎస్సీ జనవరి నెలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించింది.పరీక్ష జరిగిన 20 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 92 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గత ఏడాది గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా 2023 జనవరి 8న 18 జిల్లాలోని 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. ఈ ఎగ్జామ్‌కు 82.38శాతం మంది హాజరయ్యారు. .
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ దీనిపై క్లిక్ చేయండి.