APPSC Group 2 Recruitment 2023: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?
APPSC గ్రూప్ 2 పోస్టులకు (APPSC Group 2 Recruitment 2023) అప్లై చేసుకోవడనికి గడువు పొడిగించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 17 చివరి తేదీలోపు అప్దై చేసుకోవాలి.
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ 2023 (APPSC Group 2 Recruitment 2023): ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 (APPSC GROUP 2) పోస్టులకు దరఖాస్తు (APPSC Group 2 Recruitment 2024 Registration) చేసుకునేందుకు గడువును పొడిగించడం జరిగింది. అభ్యర్థులు జనవరి 17, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో 897 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించేందుకు డిసెంబర్ 7వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. APPSC గ్రూప్ 2 దరఖాస్తు ప్రక్రియ 21 డిసెంబర్ 2023న ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు తమకు నచ్చిన పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. APPSC గ్రూప్ 2 పోస్టులకు ఆన్‌లైన్‌లో తప్ప మరే విధంగానూ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
APPSC గ్రూప్ 2 పోస్టుల అప్లికేషన్ డైరక్ట్ లింక్ (APPSC Group 2 Posts Application Direct Link)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ని ఈ దిగువున అందజేశాం.APPSC GROUP 2కు అర్హత ప్రమాణాలు ( APPSC GROUP 2 Education Qualification and Eligibility)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి. ఆ అర్హతలున్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు.- అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి.
- అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply for the APPSC Group 2 Recruitment 2023)
APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ పోస్టులకు అప్లై చేసుకునే విధానం ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ముందుగా అభ్యర్థులు psc.ap.gov.inలో APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో ఇవ్వబడిన దరఖాస్తు చేయడానికి APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- తర్వత అభ్యర్థులు దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- సమర్పించుపై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయాలి.
- తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచాలి.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250, ప్రాసెసింగ్ ఫీజు రూ.80 లు చెల్లించాలి. SC, ST, BC, PBDలు & ఎక్స్-సర్వీస్ మెన్, అనేక ఇతర కేటగిరీలు పరీక్ష ఫీజు రూ.80లు చెల్లించక్కర్లేదు. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు గేట్‌వేని ఉపయోగించి ఫీజు చెల్లింపు ఆన్‌లైన్‌లో చేయబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.