APPSC Group 2 Exam Instructions 2024: 25న APPSC Group 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్, పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఈ విషయాలు తెలుసా?
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 2024 ఫిబ్రవరి 25న జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్ష కోసం అభ్యర్థులు పాటించాల్సిన కొన్ని సూచనలు (APPSC Group 2 Exam Instructions 2024) ఇక్కడ అందజేశాం.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష సూచనలు 2024 (APPSC Group 2 Exam Instructions 2024): ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 2024 ఫిబ్రవరి 25న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అభ్యర్థులు కూడా పరీక్షకు బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ పరీక్షకు దాదాపు 4 లక్షల 83 వేల 525 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపుగా 45 వేల మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది. APPSC Group 2 ప్రిలిమ్స్ పరీక్ష (APPSC Group 2 Exam Instructions 2024) ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. కొత్త సిలబస్ ఆధారంగానే ఈసారి APPSC Group 2 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో OMR షీట్‌పై సమాధానాలు గుర్తించాలి. ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు APPSC Group 2 మెయిన్స్‌కు అర్హులవుతారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష 2024 అభ్యర్థులకు సాధారణ సూచనలు (APPSC Group 2 Exam 2024 General Instructions to Candidates)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష 2024కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఈ సూచనలు ఫాలో అవ్వడం ద్వారా పరీక్షలో ఎటువంటి గందరగోళానికి గురికారు.- ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనంత మాత్రాన అభ్యర్థులు ఉద్యోగాలకు సెలక్ట్ అయినట్టు కాదు. ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ మెయిన్ 2024 పరీక్షను రాయాల్సి ఉంటుంది.
- పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరీక్షరాలు తీసుకెళ్లకూడదు. అంటే సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, టాబ్లెట్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
- ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను రాసేటప్పుడు అభ్యర్థులు క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ప్రవర్తించాలి. సరైన డ్రెస్‌లు ధరించి వెళ్లాలి.
- ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకూడదు. అభ్యర్థులు ఎటవంటి కాపీలు చేయకూడదు. అలాగే చేస్తే పరీక్ష రాసేందుకు అనర్హులవుతారు.
- పూర్తిగా అంధులైన అభ్యర్థుల కోసం రాయడానికి ఒకరిని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అంతేకాదు పరీక్షలో గంటకు 20 నిమిషాల అదనపు సమయం వారికి అందజేయడం జరుగుతుంది.
- దరఖాస్తుదారులు వైకల్యం శాతానికి సంబంధించిన సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు హాల్ టికెట్‌పై పేరు, హోదా, చిరునామా, అతని ఫోటోను ధ్రువీకరించాలి. ఏవైనా దిద్దుబాట్లు ఉంటే ముందుగానే అభ్యర్థులు ఆ పొరపాట్లను సరి చేసుకోవాలి.
- హాల్‌టికెట్ ఫోటో లేకుండా ఉండకూడదు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటని అటెస్ట్ చేయాలి.
- అభ్యర్థుల హాల్‌టికెట్‌పై ఫోటో, గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరణ ఉండాలి.
- అవసరమైన పేపర్లపై అభ్యర్థులు తమ సంతకాన్ని చేయాలి. ఇన్విజిలేటర్ సంతకాన్ని పొందాలి
- పూర్తి సమయం ముగిసే వరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లకూడదు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.