ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఫలితాలపై తాజా అప్‌డేట్ (APPSC Group-2 Prelims 2024 Results)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఫలితాలు ఏ క్షణంలోనైనా (APPSC Group-2 Prelims 2024 Results) రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ అందించాం.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఫలితాలు (APPSC Group-2 Prelims 2024 Results) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ఖాళీల కోసం రాత పరీక్షను నిర్వహించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25న గ్రూప్ 2 సర్వీసుల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫైనల్ కీ కూడా వచ్చేసింది. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్ ఫలితాల (APPSC Group-2 Prelims 2024 Results) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షల ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ మేరకు పరీక్ష బోర్డు అంటే APPSC, psc.ap.gov.inలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేస్తుంది.
APPSC గ్రూప్ 2 ఫలితం 2024: చెక్ చేసుకునే విధానం (APPSC Group 2 Result 2024: Steps To Check)
2024లో APPSC గ్రూప్-2 ఫలితాలు (APPSC Group-2 Prelims 2024 Results) విడుదలైన తర్వాత, అభ్యర్థులు ఈ దిగువ అందించిన దశలను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను తెలుసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు psc.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో 'APPSC వెబ్‌సైట్' అని చదివే లింక్"ని క్లిక్ చేయాలి.
- తర్వాత APPSC ప్రాథమిక పేజీకి రీ డైరక్ట్ అవుతారు.
- అక్కడ 'APPSC గ్రూప్ 2 ఫలితం 2024' లింక్‌ని గుర్తించండి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- APPSC 2024 ఫలితం మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- మీ భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 4,63,517 మంది పరీక్ష రాసేందుకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఇక.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్‌ను జూన్/జులైలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పకప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.