ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి (APPSC Group 2 Prelims Result 2024), రిజల్ట్స్ PDF లింక్ ఇదే
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల కోసం సంబంధిత ఫలితాల లింక్‌ని ఇక్కడ జోడించడం జరిగింది. ఫలితాలను (APPSC Group 2 Prelims Result 2024) ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024 (APPSC Group 2 Prelims Result 2024) : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. సంబంధిత అధికారులు మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో psc.ap.gov.in విడుదల చేశారు. ఈ ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఇక్కడ అందించాం. జూలై 28 గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్ష 25 ఫిబ్రవరి 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 వేదికల్లో పరీక్ష జరిగింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల PDF లింక్
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల PDF లింక్- ఇక్కడ క్లిక్ చేయండి |
APPSC గ్రూప్ 2 పరీక్ష ఓవర్ వ్యూ (APPSC Group 2 Exam Overview)
- ప్రిలిమ్స్ పరీక్ష OMR ఆధారిత పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగింది.
- ప్రశ్నపత్రంలో 150 MCQ తరహా ప్రశ్నలు ఇచ్చారు.
- అభ్యర్థుల జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు.
- అభ్యర్థులు పేపర్‌ను పూర్తి చేయడానికి 150 నిమిషాల సమయం ఇచ్చారు.
- తప్పు సమాధానాలకు 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024ని చెక్ చేసుకునే విధానం (Steps to Check APPSC Group 2 Prelims Result 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఇక్కడ అందించిన లింక్, విధానాన్ని ఉపయోగించి వాటిని చెక్ చేయవచ్చు.- ముందుగా psc.ap.gov.in వెబ్‌సైట్‌ను వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి.
- హోంపేజీలో APPSC వెబ్‌సైట్, OTPR, ఇతర అనేక ఎంపికల జాబితా కనిపిస్తుంది.
- అందులో APPSC వెబ్‌సైట్‌ను ఎంచుకోండి.
- మీరు మెయిన్‌కి రీ డైరక్ట్ అవుతారు. అక్కడ ఫలితాన్ని చెక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది..
- ఫలితాన్ని చెక్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర వివరాలను అందించాలి. దాంతో ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చూసుకోవచ్చు.
అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హులవుతారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష కోసం కమిషన్ 15 సార్లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.