APRDC CET 2023 Application Date: ఏపీ ఆర్డీసీ సెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్, ముఖ్యమైన వివరాలు ఇవే
APRDC CET 2023 నోటిఫికేషన్ ఏప్రిల్ 04, 2023న విడుదలైంది. ఏపీ ఆర్డీసీ సెట్ 2023 దరఖాస్తుకు (APRDC CET 2023 Application Date) సంబంధించిన పూర్తి వివరాలు గురించి ఈ ఆర్టికల్లో చూడండి.
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 దరఖాస్తు తేదీలు (APRDC CET 2023 Application Date): APRDC CET 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీ, కర్నూలు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీలలో డిగ్రీలో అడ్మిషన్లకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు APRDC CET 2023 కోసం ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రవేశ పరీక్షకు (APRDC CET 2023 Application Date) హాజరవ్వాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల కోసం ఇక్కడ డైరక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది.
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 ముఖ్య అంశాలు (APRDC CET 2023 Exam Highlights)
ఏపీ ఆర్డీసీ సెట్ 2023క నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.పరీక్ష | ఏపీ ఆర్డీసీ సెట్ 2023 |
పరీక్ష పూర్తి పేరు | ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజ్ |
ఎగ్జామ్ లెవల్ | రాష్ట్రస్థాయి |
పరీక్ష వ్యవధి | 2.30 గంటలు |
మార్కులు | 150 |
ప్రశ్నల రకం | మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ |
మీడియం | ఇంగ్లీష్ |
అధికారిక వెబ్‌సైట్ | aprs.apcfss.in |
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (APRDC CET 2023 Important Dates)
ఏపీ ఆర్డీసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందించడం జరిగింది. ఈవెంట్ | డేట్ |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | ఏప్రిల్ 04, 2023 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 24, 2023 |
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 అడ్మిట్ కార్డు | మే 12, 2023 |
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 ఎగ్జామ్ డేట్ | మే 20, 2023 |
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 మెరిట్ లిస్ట్ | జూన్ 08, 2023 |
ఏపీ ఆర్డీసీ సెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ (APRDC CET 2023 Application Form)
APRDC CET 2023 అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 04, 2023న రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- ముందుగా అభ్యర్థులు APRDC CET 2023 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అందులో Payment ఆప్షన్‌ని ఎంచుకోవాలి
- అభ్యర్థులు APRDC CET 2023 కోసం దరఖాస్తు ఫీజు చెల్లించాలి
- ఫీజు చెల్లించిన తర్వాత APRDC CET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ వివరాలు ఇవ్వాలి. అభ్యర్థి ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.