ఈరోజే APRJC CET 2025 హాల్ టికెట్లు విడుదల (APRJC CET 2025 Hall Ticket Releasing Today)

APRJC CET 2025 హాల్ టికెట్లు ఈరోజు అంటే ఏప్రిల్ 17, 2025న (APRJC CET 2025 Hall Ticket Releasing Today) విడుదలవుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

ఈరోజే APRJC CET 2025 హాల్ టికెట్లు విడుదల (APRJC CET 2025 Hall Ticket Releasing Today)

APRCJ CET 2025 హాల్ టికెట్ విడుదల తేదీ (APRJC CET 2025 Hall Ticket Releasing Today) : APRJC CET 2025 హాల్ టికెట్లు ఈరోజు అంటే ఏప్రిల్ 17, 2025న రిలీజ్ అవుతాయి.అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ (APRJC CET 2025 Hall Ticket Releasing Today) చేసుకోవడానికి సంబంధిత లింక్‌ను ఇవాళ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేస్తుంది. అనంతరం ఏపీఆర్జేసీ సెట్ 2025 హాల్ టికెట్ల లింక్‌ను ఇక్కడ అందిస్తాం. APRJC CET 2025కి దరఖాస్తు ప్రక్రియ మార్చి 01వ తేదీ నుంచి ఏప్రిల్ 06, 2025వ తేదీ వరకు సాగింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ (APREIS) APRJC CETని నిర్వహిస్తుంది. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో MPC, BiPC, MEC, CEC కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు APRJC CETని నిర్వహిస్తారు. ఈ పరీక్ష పెన్‌‌, పేపర్ మోడ్‌లో జరుగుతుంది. పరీక్షలో అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

APRJC CET 2025 హాల్ టికెట్‌లో ఉండే వివరాలు (Details On  APRJC CET 2025 Hall Ticket)

APRJC CET 2025 రాసేందుకు హాల్ టికెట్‌ చాలా ముఖ్యం. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రానికి అనుమతించరు.అయితే APRJC CET హాల్ టికెట్లో ఉండే వివరాలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని వివరాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలి.

  • విద్యార్థి పేరు

  • రోల్ నెంబర్

  • అభ్యర్థి ఫోటో

  • అభ్యర్థి సంతకం

  • పుట్టిన తేదీ

  • పరీక్ష తేదీ

  • పరీక్ష సమయం

  • పరీక్షా స్థలం

  • రిపోర్టింగ్ సమయం

APRJC CET హాల్ టికెట్ 2025 - ముఖ్యమైన సూచనలు (Important Instructions for APRJC CET Hall Ticket 2025)

APRJC CET 2025 హాజరయ్యే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన సూచనలు కచ్చితంగా పాటించాలి.

  • విద్యార్థులు APRJC CET 2025కి హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్లాలి.

  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

  • APRJC CET 2025 పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు.

  • అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు APRJC CET హాల్ టికెట్ 2025ను దగ్గరే ఉంచుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్