APRJC CET 2023 పాత ప్రశ్నపత్రాలను (APRJC CET Previous Question Papers) ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీఆర్‌జేసీ సెట్ 2023కు ప్రీపేర్ అయ్యే అభ్యర్థులకు మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు (APRJC CET Previous Question Papers) ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి ద్వారా అభ్యర్థులకు పరీక్షా విధానంపై అవగాహన ఏర్పడుతుంది. ఏపీఆర్‌జేసీ సెట్ గత సంవత్సరాల ప్రశ్న పత్రాలు పీడీఎఫ్‌లను ఈ ఆర్టికల్లో అందజేశాం.
ఏపీఆర్‌జేసీ సెట్ 2023 (APRJC CET 2023): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షకు (APRJC CET 2023) సిద్ధమయ్యే అభ్యర్థులకు చాలా సందేహాలు ఉంటాయి. ఎటువంటి ప్రశ్నలు ఇస్తారు..? ప్రశ్న పత్రం ఎలా ఉంటుంది..? ఎన్ని మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది.. ? అని ఎన్నో అనుమానాలు కలుగుతాయి. అభ్యర్థులకు అవగాహన రావడానికి పాత ప్రశ్న పత్రాలు (APRJC CET Previous Question Papers) ఉపయోగపడతాయి.ఏపీఆర్‌జేసీ సెట్ ప్రశ్నా పత్రాలు పరిశీలించడం వల్ల పరీక్షా విధానం, మార్కులు విధానం గురించి పూర్తిగా తెలుస్తుంది.
ఏపీ ఆర్‌జేసీ సెట్ 2023 పాత ప్రశ్నా పత్రాలు (APRJC CET 2023 Previos Question Paper PDF Download)
ఏపీ ఆర్‌జేసీ సెట్ 2023 (APRJC CET 2023)కి హాజరవ్వాలనుకునే అభ్యర్థులకు ముందు సంవత్సరాల ప్రశ్న పత్రాలు (APRJC CET Previous Question Papers) ఎంతగానో ఉపయోగపడతాయి. అభ్యర్థులు ఏపీ ఆర్‌జేసీ సెట్ (APRJC CET 2023) మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలతో పాటు మాక్ టెస్ట్‌లను కూడా పరిశీలించాలి. వాటి ద్వారా పరీక్షా సరళిపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఈ దిగువున మునుపటి సంవత్సరాల APRJC CET ప్రశ్న పత్రాలను అందజేస్తున్నాం. కింద Download PDF అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంబంధిత వెబ్‌సైట్ (aprs.apcfss.in)లోకి వెళ్లి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.సబ్జెక్ట్ | సంవత్సరం | ప్రశ్నపత్రం |
ఎంపీసీ ఈఈటీ ఇంగ్లీష్/ తెలుగు మీడియం | 2019 | Download PDF |
ఎంపీసీ ఈఈటీ ఇంగ్లీష్/ ఉర్దూ మీడియం | 2019 | DownLoad PDF |
బైపీసీ/సీజీడీటీ ఇంగ్లీష్/తెలుగు మీడియం | 2019 | DownLoad PDF |
బైపీసీ/సీజీడీటీ ఇంగ్లీష్/ఉర్దూ మీడియం | 2019 | DownLoad PDF |
ఎంఈసీ సీఈసీ ఇంగ్లీష్/ తెలుగు మీడియం | 2019 | DownLoad PDF |
ఎంఈసీ సీఈసీ ఇంగ్లీష్/ఉర్దూ మీడియం | 2019 | DownLoad PDF |
ఏపీ ఆర్‌జేసీ సెట్ 2023 పాత ప్రశ్న పత్రాలతో ప్రయోజనం (Benefits of Solving APRJC CET 2023 Previous Years Question Papers)
ఏపీ ఆర్‌జేసీ సెట్ 2023 (APRJC CET 2023) ప్రిపరేషన్‌కు అభ్యర్థులు సంబంధిత సిలబస్‌ను చదివి సిద్ధం అవుతుంటారు. అదే సమయంలో గత సంవత్సరాల ఏపీ ఆర్‌జేసీ సెట్ ప్రశ్న పత్రాలను పరిశీలించడం వల్ల, వాటికి సమాధానాలను తెలుసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.- పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీాస్ చేయడం వల్ల పరీక్షల విధానాన్ని అంచనా వేయవచ్చు.
- అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో వీక్‌గా ఉన్నారో తెలుసుకోవడానికి పాత ప్రశ్న పత్రాలు సాల్వ్ చేయడం మంచి మార్గం.
- గత సంవత్సరాల ఏపీ ఆర్‌జేసీ సెట్ 2023 (APRJC CET 2023) ప్రశ్న పత్రాలను పరిశీలించడం వల్ల అభ్యర్థులు తమ అధ్యయనంలో చేస్తున్న లోపాలు తెలుస్తాయి. పరీక్షకు ముందు వారి తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
- మునుపటి సంవత్సరాల క్వశ్చన్ పేపర్లను ఒకేసారి పరిష్కరించడం వల్ల సబ్జెక్టులపై అభ్యర్థులకు పట్టు పెరుగుతుంది.
- గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా సరళి, మార్కుల విధానం గురించి తెలుస్తుంది. ఏ రకమైన ప్రశ్నలు ఇస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. సిలబస్ మొత్తం ఒక్కసారి రివిజన్ కూడా అవుతుంది.