Central Bank of India Recruitment 2023: 8వ తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు, మొత్తం 5000 పోస్టులు, అప్లై చేసుకునే విధానం ఇక్కడ చూడండి
బ్యాంకు ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (Central Bank of India Recruitment 2023) విడుదలైంది.5000 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు (Central Bank of India Recruitment 2023): ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రీజియన్లవారీగా సీబీ శాఖల్లో 5,000ల అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఖాళీలు ఉన్నాయి. బ్యాంకులో జాబ్‌లు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఇక్కడ తెలియజేశాం.
సెంట్రల్ బ్యాంకు పోస్టులకు ఉండాల్సిన అర్హతలు (Required Qualifications for Central Bank Posts)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5000 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.- అభ్యర్థులు 8వ/10వ/12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీలో తెలుగు సబ్జెక్టుతో పాసై ఉండాలి.
- వయసు మార్చి 31, 2023వ తేదీ నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
- జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగులు రూ.400లు చెల్లించాలి
సెంట్రల్ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధానం (How to Apply for Central Bank Jobs)
అన్ని అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.- అభ్యర్థులు తమ దరఖాస్తు ఫార్మ్‌ని ఫిల్ చేయడం కోసం CBI అధికారిక వెబ్‌సైట్‌కు http://www.apprenticeshipindia.gov.in వెళ్లాలి.
- హోమ్ పేజీలో "రిక్రూట్‌మెంట్ పోర్టల్" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- "సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023" నోటిఫికేషన్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేసి, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ని పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్‌లను పేజీలో అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- భవిష్యత్ ప్రయోజనాల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.