CTET Result 2023: CTET ఫలితాలు 2023 విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET ఫలితాలు 2023ని (CTET Result 2023) ctet.nic.inలో ప్రకటించింది. ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు.
CTET ఫలితాలు 2023 (CTET Result 2023): ఆగస్టు 2023లో జరిగిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో CTET ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు CTET ఫలితాలను (CTET Result 2023) చెక్ చేయడానికి, తమ వారి రోల్ నెంబర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రొవిజినల్ ఆన్సర్ కీ ఈ నెల ప్రారంభంలో జారీ చేయబడింది. అభ్యంతరాలను లేవనెత్తడానికి విండో ఇప్పటికే క్లోజ్ అయింది.
CTET 2023 పరీక్ష ఆగస్టు 20న పరీక్ష జరిగింది. ఈసారి 29 లక్షల మంది అభ్యర్థులు - పేపర్ 1 (1 నుంచి 5 తరగతులకు) 15,01,719 మంది, పేపర్ 2 (6 నుంచి 8 తరగతులకు) 14,02,184 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షలో దాదాపు 80 శాతం హాజరు నమోదైంది.
CTET పరీక్ష కటాఫ్ మార్కులు 60 శాతం అయితే SC, ST, OBC, PwD అభ్యర్థులకు రాయితీలు ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యాలకు అనుమతి ఉందని CBSE తెలిపింది. CBSE ముందుగా ప్రకటించినట్లుగా, CTET మార్కుల షీట్, సర్టిఫికేట్లు త్వరలో DigiLockerలో అందుబాటులో ఉంటాయి. DigiLocker లాగిన్ ఆధారాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్‌కు వస్తాయి.
సీటెట్ ఫలితాలు 2023ను ఎలా చెక్ చేసుకోవాలి? (CTET Result 2023: How to check scores)
CTET 2023 ఫలితాలను అభ్యర్థులు ఎలా చెక్ చేసుకోవాలో మొత్తం విధానాన్ని దిగువున అందజేశాం. ఇక్కడ తెలుసుకోండి.- CTET 2023 ఫలితాలను పైన అందజేసిన డైరక్ట్ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు.
- లేదా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ctet.nic.in సందర్శించాలి.
- తర్వాత August exam Result linkపై క్లిక్ చేయాలి.
- అనంతరం అభ్యర్థులుతమ రోల్ నెంబర్‌ను నమోదు చేసి లాగిన్ అయి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.