CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల చేయబడింది: డైరెక్ట్ లింక్, తేదీలు , దరఖాస్తు విధానం
CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఇప్పుడు cuet.samarth.ac.in అందుబాటులో ఉంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 12, 2023. ఇక్కడ డైరెక్ట్ లింక్, ముఖ్యమైన తేదీలు , మరియు దరఖాస్తు చేయడానికి సూచనలు ఉన్నాయి.
CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 (CUET 2023 Application Form): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CUET UG 2023 పరీక్ష అప్లికేషన్ ఫార్మ్ ను ఫిబ్రవరి 09, 2023 వ తేదీన విడుదల చేసింది. CUET 2023 పరీక్ష కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cuet.samarth.ac.in లో అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయవచ్చు. CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి చివరి తేదీ మార్చి 12, 2023. CUET 2023 పరీక్ష మే 21వ తేదీ నుండి మే 31వ తేదీ వరకూ జరుగుతున్నది. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో CUET 2023 పరీక్ష గురించిన ముఖ్యమైన తేదీలు గురించి కూడా తెలుసుకోవచ్చు.
CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరెక్ట్ లింక్ (CUET 2023 Application Form Link)
CUET UG అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి విద్యార్థులు ఈ క్రింద అందించిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు (CUET 2023 Application Form Dates)
CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
కార్యక్రమం | తేదీలు |
అప్లికేషన్ ఫార్మ్ విడుదల | ఫిబ్రవరి 9, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ | మార్చి 12, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | మార్చి 15 నుండి 18, 2023 వరకు |
హాల్ టికెట్ | మే 2023 రెండవ వారం |
పరీక్ష తేదీ | మే 21 నుండి 31 వరకు |
CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 పూర్తి చేసే విధానం (CUET 2023 Application Form: Steps to Apply)
విద్యార్థులు క్రింది పట్టిక లో ఉన్న స్టెప్స్ ను అనుసరించి CUET అప్లికేషన్ ఫార్మ్ 2023 ను పూర్తి చేయవచ్చు.
స్టెప్ 1: రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించండి |
|
స్టెప్ 2: అప్లికేషన్ ఫార్మ్ ని పూరించండి |
|
స్టెప్ 3: పత్రాల అప్‌లోడ్ |
|
స్టెప్ 4: రుసుము చెల్లింపు |
|
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని ఫాలో అవ్వండి.