AP EAMCET Counselling 2023: AP EAMCET కౌన్సెలింగ్ 2023లో ఆలస్యం, కారణం ఇదే
AP EAMCET కౌన్సెలింగ్ 2023 తేదీలు (AP EAMCET Counselling 2023) ఇంకా ప్రకటించబడ లేదు. ఈ ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
AP EAMCET కౌన్సెలింగ్ 2023 (AP EAMCET Counselling 2023): AP EAMCET ఫలితాలు 2023 ప్రకటించి దాదాపు ఒక నెల అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2023-24 అకడమిక్ సెషన్ కోసం AP EAMCET కౌన్సెలింగ్ ప్రక్రియను (AP EAMCET Counselling 2023) ఇంకా ప్రారంభించ లేదు. బీటెక్ విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు మళ్లీ ఆగస్టు వరకు ఆలస్యం కానుండటంతో కౌన్సెలింగ్ నిర్వహణలో అసాధారణ జాప్యం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రీ-పాండమిక్ టైమ్‌లైన్‌ల ప్రకారం అకడమిక్ సెషన్ టైమ్‌లైన్‌లను ట్రాక్ చేయడం APSCHE ఉద్దేశం అయితే, కౌన్సెలింగ్‌లో ఊహించని జాప్యం మళ్లీ సాధారణ అకడమిక్ టైమ్‌లైన్‌లను ఆలస్యం చేస్తుంది.
అది కాకుండా AP EAMCET కౌన్సెలింగ్ , AP POLYCET, AP OAMDC కౌన్సెలింగ్ కూడా ఆలస్యమైంది. ఈ కౌన్సెలింగ్‌లు ఆలస్యం కావడానికి కారణం 2023-24 అకడమిక్ సెషన్‌కి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. B.Tech, Polytechnic, Degree, B.Ed, లా వంటి వివిధ UG కోర్సులు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఫీజు నిర్మాణాన్ని నిర్ణయించ లేదు. ఫీజు నిర్మాణం నిర్ధారించిన తర్వాత కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించబడుతుంది.
మరోవైపు తెలంగాణ ఇప్పటికే TS EAMCET counselling 2023ని ప్రారంభించింది. మొదటి దశ సీట్ల కేటాయింపు జూలై 16న విడుదల చేయబడుతుంది. JoSAA రౌండ్ 3 కూడా జూలై 12న ముగుస్తుంది. మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా B.Tech కౌన్సెలింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన ఎక్కువైంది. ఈ విద్యా సంవత్సరంలో వెనుకబడిపోతావేమోనని ఫీల్ అవుతున్నారు. ఏపీ కౌన్సెలింగ్ తేదీల గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే AP ప్రభుత్వం ఫీజు నిర్మాణాన్ని నిర్ణయించి ఈ వారంలోపు AP EAMCET కౌన్సెలింగ్ 2023ని ప్రారంభించే అవకాశం ఉంది. AP EAMCET కౌన్సెలింగ్ తేదీలు 2023 ప్రకటన తర్వాత ఫీజు నిర్మాణంపై అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబడుతుంది. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో ఏ రోజైనా కౌన్సెలింగ్ తేదీలు వెలువడే అవకాశం ఉంది. అభ్యర్థులు అలర్ట్ ఉండాలి. కౌన్సెలింగ్ తేదీలు విడుదలైన వెంటనే తదుపరి ప్రక్రియ మొదలవుతుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ లేటెస్ట్ సంఘటనలతో అప్‌డేట్ అవ్వడానికి విద్యార్థులు https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ గురించి తాజా అప్‌డేట్స్ తెలుసుకోండి.