GGH Srikakulam Junior Assistant Posts: శ్రీకాకుళం జీజీహెచ్‌లో 60 ఉద్యోగాలు, నెలకు మంచి జీతం, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (GGH Srikakulam Junior Assistant Posts) విడుదలైంది. అవుట్ సోర్చింగ్ పద్ధతిలో ఫిల్ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 లాస్ట్ డేట్.
జీజీహెచ్ శ్రీకాకుళం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు (GGH Srikakulam Junior Assistant Posts): శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. అర్హత గల అభ్యర్థుల నుంచి శ్రీకాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సూపరింటెండెంట్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మార్చి 31, 2023 చివరి తేదీ.
GGH శ్రీకాకుళం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు (GGH Srikakulam Junior Assistant Posts Details)
పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో పని చేయడానికి 60 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. 60 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున తెలియజేయడం జరిగింది.పోస్టు | సంఖ్య |
జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈవో | 04 |
రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ | 04 |
ఓటీ అసిస్టెంట్ | 04 |
డయాలసిస్ టెక్నిషియన్ | 04 |
ల్యాబరేటరీ టెక్నిషియన్ | 10 |
సీ ఆర్మ్ టెక్నిషియన్ | 04 |
సోషల్ వర్కర్, | 02 |
సపోర్టింగ్ స్టాఫ్ | 22 |
సెక్యూరిటీ గార్డ్స్ | 06 |
GGH శ్రీకాకుళం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత ప్రమాణాలు (Eligibility Criteria for GGH Srikakulam Junior Assistant Posts)
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ దిగువ తెలిపిన అర్హతలు ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఆ అర్హతలున్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి.- పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, డిగ్రీ, డిప్లమా, డీఎంఎల్‌టీ, పీజీ పాసై ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి
GGH శ్రీకాకుళం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలంటే? (How to apply for GGH Srikakulam Junior Assistant Posts)
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలని దరఖాస్తులో పూరించి, అభ్యర్థులకు నకలు పత్రాలని జత చేసి శ్రీకాకుళంలోని జీజీహెచ్, సూపరింటెండెంట్ కార్యాలయంలో నేరుగా అందజేయాలి. లేదంటే పోస్టులో పంపించాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2023 లాస్ట్ డేట్. ఆ గడువు తేదీలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000 బట్టి రూ.32,000 వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు Srikakulam.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.