AP DSC 2024 కోసం AP TET లో 20% వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20% Weightage Marks for AP DSC 2024?)
AP DSC 2024 కోసం AP TET లో 20% వెయిటేజీ మార్కులను ఎలా లెక్కించాలో వివరంగా ఇక్కడ చూడవచ్చు .
AP DSC 2024 కోసం AP TET లో 20% వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20% Weightage Marks for AP DSC 2024?) : AP TET 2024 పరీక్ష పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Aపీ టెట్ హాల్ టికెట్లను (AP TET Exam Dates 2024) సెప్టెంబర్ 22న రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి 21, 2024 వరకు జరుగుతాయి. AP TET పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. AP DSC పరీక్ష , AP TET పరీక్షలు పూర్తి అయిన మూడు నెలల తర్వాత నిర్వహించనున్నారు, ఈ విధంగా చూస్తే AP DSC పరీక్ష జనవరి 2025 నెలలో నిర్వహించే అవకాశం ఉన్నది . AP DSC 2024 నోటిఫికేషన్ ప్రకారంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు . AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20% వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు.
AP DSC 2024 కోసం AP TET లో 20% వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20% Weightage Marks for AP DSC 2024?)
AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20% వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 120 ( ఉదాహరణ)
AP DSC లో 20% వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
అంటే (120/150) × 20 = 16
అభ్యర్థి AP TET లో 120 మార్కులు సాధిస్తే అందులో నుండి 16 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 120 మార్కులు సాధిస్తే AP DSC లో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (46+16) = 62
పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.